ఇంగువ మాధురి
ఈ వ్యాస విషయం వికీపీడియా సాధారణ విషయ ప్రాముఖ్యత మార్గదర్శకాలకు అనుగుణంగా లేనట్లుగా తోస్తోంది. |
ఈ వ్యాసం మౌలిక పరిశోధన కలిగివుండవచ్చు. |
ఇంగువ మాధురి:
రచయిత్రి శ్రీమతి ఇంగువ మాధురి జననం సెప్టెంబర్ 9 న, హైదరాబాదులో. తల్లిదండ్రులు శ్రీ యడవల్లి గిరిజ, కామేశ్వరరావు దంపతులు. ఈమె పూర్వీకులు అయిదు తరాలు విజయవాడ సత్యనారాయణపురంలో నివాసం ఉన్నారు. మాధురి బామ్మ శ్రీమతి వెంకటలక్ష్మీ సరోజినీ భాస్కరం(1926–2014) విజయవాడలో పుట్టిపెరిగి, SSLC పాసై,1945-47 మధ్య విశాఖ కింగ్ జార్జి ఆస్పత్రిలో నర్సు శిక్షణ పూర్తి చేసి, ప్రభుత్వ ఆస్పత్రుల్లో నర్సు ఉద్యోగం చేస్తూ, బదిలీలపై ఆంధ్రప్రదేశ్ లోని జిల్లాలన్నిoటిలో పనిచేసింది. అప్పటి ఇంగ్లీషు డాక్టర్లు ఆమె పేరు నోరు తిరగక క్లుప్తంగా ‘రోజా’ అని పిలిచేవారు. 1926 దశాబ్దంలో పుట్టిన అమ్మాయిలు చదువుకొని ఉద్యోగం చేయడం ఊహకు అందని విషయం. వెంకటలక్ష్మీసరోజినీ భాస్కరం వివాహం1952లో యడవల్లి పూర్ణచంద్రరావుతో జరిగింది. అప్పటికే ఆవిడ ఆంధ్ర, ఆంగ్ల సాహిత్యాలు, చరిత్ర, శాస్త్రవిషయాలుచక్కగా చదువుకొన్న మహిళా ఉద్యోగి. ఈ బామ్మ ప్రభావం బాల మాధురి పైన కనబడుతుంది.
మాధురి తండ్రి యడవల్లి కామేశ్వరరావు హైదరాబాదులో జన్మించినా, ఆయన తల్లివెంట ఆంధ్రదేశమంతా తిరగడంవల్ల, వివిధ కాలేజీలలో చదవడం వలన విస్తృతమైన లోకానుభవం కలిగింది. 1977లో కామేశ్వరరావుకు మేనమామ కుమార్తె గిరిజతో విజయవాడలో పరిణయం జరిగింది. 1982లో ఆయన ఉద్యోగంలో చేరి హైదరాబాదులో స్థిరపడ్డాడు. ఆయన సంతానం యడవల్లి విజయ్, మాధురి.
మాధురి తల్లి గిరిజ(1956-2010) గొప్ప గాయని, సామాజిక సేవా కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొనేది. మాధురి అన్నయ్య యడవల్లి విజయ్, హైదరాబాదులో IT రంగ నిపుణులుగా స్థిరపడ్డాడు. మాధురి హైదరాబాదులో పుట్టి పెరిగి, ఆంగ్ల మాధ్యమంలో చదువుకున్నా ఇంట్లో పెద్దలు తెలుగు భాషాభిమానం, సంస్కృతీ సంప్రదాయాలపట్ల అభిమానం నేర్పారు.
విద్యాభ్యాసం:
మాధురి విద్యాభాసం హైదరాబాదులోని వివిధ విద్యాలయాలలో ఇంగ్లీషు మాధ్యమంలో సాగినా, బాల్యంనుంచీ బామ్మ ప్రేరణ, ప్రోత్సాహంవల్ల పదో ఏటినుంచే పురాణ గాథలు, తెలుగు ప్రబంధ గాథలతో పరిచయం కలిగి, సాహిత్యంలో ప్రవేశం, అభిరుచి ఏర్పడింది. తెలుగు వ్యాస రచన పోటీలలో ప్రథమ బహుమతులు గెలుచుకుని, తెలుగు సాహిత్యం మీద అభిమానంతో ఆంగ్లాన్ని వీడి Central University of Hyderabad లో ఆమె తెలుగు ఏం.ఏ.లో అసాధారణ ప్రతిభ కనబరచి, అత్యుత్తమ శ్రేణిలో పాసయింది.
రచనా వ్యాసంగం:
మాధురి రచనా వ్యాసంగం పదవ ఏటినుంచి ప్రారంభం అయింది. ప్యారెడి పాటలు, కవితలు రాసినా, తొలికథ “చెల్లాయ్" ఆంధ్రజ్యోతి వారపత్రికలో తన 13వ ఏటనే 1995లో అచ్చయింది, తొలి రేడియో కవితాగానం 1999 లో ఆకాశవాణి హైదరాబాదు నుంచి ప్రసారమయింది.
వివాహం:
2003లో M.A చదువుతుండగా ఇంగువ సాంబశివ రావుతో పెద్దలు వివాహం జరిపారు. MA పూర్తి చేసి గృహిణిగా ఉంటూ కవితా రచనా వ్యాసంగం కొనసాగించింది.
రేడియో జాకీ, న్యూస్ రీడర్, అనువాదకురాలు:
2008లో ఆకాశవాణిలో చేరడం ఆమె జీవితంలో గొప్ప మలుపు. 2008-2014 మధ్య మీడియా రంగంలోని అన్ని విభాగాల్లో మాధురి శిక్షణపొంది, రేడియో, టీవి మాధ్యమాల్లోని వేరువేరు శాఖల్లో పనిచేసింది. ఆకాశవాణిలో FM Rainbow లో రేడియో జాకీగా కొంతకాలం పనిచేస్తూ, చిత్రసీమలోని వివిధ గీత రచయితల గురించీ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎందరో ప్రేరణాత్మక మహిళల గురించీ కార్యక్రమాలు నిర్వహించింది. 2012-2014మధ్య కొంతకాలం దూరదర్శన్ లో వార్తలు చదివింది. 2010-2012మధ్య కేంద్ర ప్రభుత్వ పత్రిక 'యోజన'లో అనువాదకురాలుగా బాధ్యతలు నిర్వహించింది. కొంతకాలం ప్రైవేటు వ్యాపారప్రకటనల సంస్థలో క్రియేటివ్ హెడ్ గా పనిచేసి, 2014 నుండి ఉద్యోగరిత్యా జీవితసహచరుడితో విదేశీయానాల వల్ల మీడియా రంగానికి దూరం కావలసి వచ్చినప్పటికీ, అంతర్జాల పత్రికలకు కథలు, కవితలు, ధారావాహికలు రాస్తూనే వచ్చింది.
రచనలు:
తపస్వీ మనోహరం ప్రచురణల సౌజన్యంతో 1.వజ్రకుండం 2. మనసిజ 3. నందు వర్సెస్ నందు 4.మా అమ్మకోసం నవలలు రచించింది. ఈ నాలుగు నవలలూ ఆమెకు విశేష ఖ్యాతిని తెచ్చిపెట్టాయి. తన తొలినవల వజ్రకుండం 26 వేల పదాలలో రాసిన కాల్పనిక నవల. ఇందులో ఒక్క ఆంగ్లపదం కూడా వాడుక చేయక, సరళ గ్రాంథికoలో వ్రాసి తెలుగు భాషాభిమానాన్ని, భాషమీద తనకున్న గొప్ప పట్టును నిరూపించుకున్నది. ఈ నవలకు ఆస్కార్ అవార్డు గ్రహీత, గీతరచయిత చంద్రబోసు మున్నుడి సమకూర్చారు.
కథలు : చెల్లాయ్
సంసార సాగరం
ట్రాష్ బిన్
పారిపోoడ్రోయ్
శ్రావణమేఘాలు
ఒక చిట్టికథ
వర్షప్రియ
ధీరవనిత
అవధాని
కామెడీ కాంతారావ్
ముగ్థమణి
నవ్విందీ మల్లేచెండు
దేవుడికి డిస్కౌంట్
ఫస్ట్ క్రష్
నిశీథి కలలు
పరిమళ
పునర్జన్మ
పడమటి ప్రమిద
కళ్యాణి రాగం
త్రీ సిక్స్టీ డిగ్రీస్
మౌనమై మెరిసి
కొత్తేడు
రెడీ మేడ్ సంక్రాంతి
దిమ్మ తిరిగే దిమ్మా తిరిగే
25 బాలల కథలు (మరెన్నో)
కవితలు:
వెన్నెల
బాల్యస్మృతి
అప్సరోభామిని
ఆశ
ప్రేమ ఇంద్రజాలం
ఎవరివో నీవెవరివో
రేపెళదాం నిన్నట్లోకి
చైతన్యం
బండరాళ్లు
ఇదిగో నిన్నే
తునక
నవ్యత
ప్రేమ ఖరీదు
ప్రణయ సుందరి
ప్రేమ యాత్ర
అభిషేకం
ప్రేమకోసం
జైత్రయాత్ర
నీవెవరు
ఒక్క క్షణమేగా
పరవశం
రతిలోక మణి
ఉలికిపడు
నీ జతలో
నీకై నేను
ఎర్ర కాటుక
విధి వంచిత
రాధే గోవిందం
గోపాలుడికోసం ఈ రాధ
ఎవరో ఆ సుందరి
ప్రేమవర్షం
ప్రేమేనంటావా
శక్తినివ్వు
ఎన్ని చినుకులో
కొత్త వాన
నీ స్మరణం
ప్రేమ ఋతువు
భావాల శీర్షాసనం
నీలో నేనై
కవితావనం
రెండుగ పగిలిన మనసు
సాగే కలలనది
కనిపించని తోడువి
నింగితో వలపు
భగభగమను భానుతేజం
అల్లాడే ప్రాణం
కుహు గీతం
శ్రీమాత్రే నమః
నమో బాలా త్రిపురసుందరి
నమో నమో జగత్తారిణీ పాహి దుర్గే
"బొట్టు"
(మరెన్నో కవితలు)
పురస్కారాలు:
ఉత్తమ ధారావాహిక రచయిత్రి : ప్రతిలిపి అంతర్జాలపత్రిక 2019 లో 'పెసరట్టు' ధారావాహికకు ఉత్తమ ధారావాహిక రచయిత్రిగా ఎంపిక చేసి పురస్కారంతో గౌరవించింది. ఆ ధారావాహిక పిదప 'మనసిజ' నవలగా విడుదలయి ఘనవిజయం సాధించింది.
ఉత్తమ నవలా రచయిత్రి: తపస్వి మనోహరం “ పత్రిక 2021 లో ఆమె రచన వజ్రకుండం నవలకు ఉత్తమ నవలా రచయిత్రి అవార్డుతో గౌరవించింది.
ఆడుసుమిల్లి అనిల్ కుమార్ స్మారక పురస్కారం: "మా అమ్మకోసం" నవలకు 2023లో "కీ.శే.ఆడుసుమిల్లి అనిల్ కుమార్ స్మారక పురస్కారం" లభించింది. మాధురి రాసిన బాలల కథాసంకలనానికి ఉస్మానియా రచయితల సంఘం “గాథా సృజన సంయమి” బిరుదు ప్రదానం చేసింది.
ఇవికాక, పలు విశ్వవిద్యాలయాల నుండి పలు విభాగాల రచనలకుగాను 50కి పైగా ప్రశంసాపత్రాలు అందుకున్నది.
ఇటీవల 2023 అక్టోబర్ లో మాధురి కాలిఫోర్నియా లోని సిలికాన్ ఆంధ్రా యూనివర్సిటీ ఆహ్వానం మీద, ఆ విశ్వవిద్యాలయంలో “తెలుగుభాషా వ్యాప్తి” అనే విషయం మీద ప్రసంగించింది,
మద్రాసు విశ్వవిద్యాలయంలో "స్వర్గారోహణ పర్వం - యుధిష్ఠిరుని ధర్మనిష్ఠ" గురించి 2024 ఏప్రిల్ లో ప్రసoగించింది. విశ్వావిద్యాలయాలలో సాహితీ విషయాల మీద ప్రసంగించడం ఆమె ప్రవృత్తి.
ఆమె కథ “పడమటి ప్రమిద”కు జీడిగుంట శ్రీరామచంద్రమూర్తి అవార్డును 2024 ఏప్రిల్ లో జీడిగుంట శ్రీరామచంద్రమూర్తి కుమారులు జీడిగుంట విజయసారథి, కథాకళ కార్యక్రమ రూపకర్త విజయభాస్కర్ సంయుక్తంగా "జీడిగుంట రామచంద్రమూర్తి పురస్కారం" ఇచ్చి కాలిఫోర్నియాలో గౌరవించారు.
ఇప్పటిదాకా 200 కవితలు, గేయాలు, 100కు పైగా కథలు, వ్యాసాలు, 4 నవలలు ప్రచురించటమే కాక 50కి పైగా సాహితీ సమావేశాలలో ప్రసంగించింది. ఆమె మరికొన్ని రచనలు ప్రచురణకు సిద్ధంగా ఉన్నాయి. 2024 మే మాసంలో వాషింగ్టన్ స్టేట్ లోని "తెలంగాణా అమెరికా తెలుగు అసోసియేషన్" ఆధ్వర్యంలో 'శ్రీ పాలడుగు శ్రీచరణ్' గారి అష్టావధాన కార్యక్రమంలో మాధురి పృచ్ఛకురాలిగా పాల్గొనబోతోంది.
మాధురి త్వరలో 'వేటూరి గీతామృతం' పేరుతో గ్రంథ సంకలనాలను వెలువరించే ప్రయత్నంలో ఉంది. వేటూరి సుందరరాంమూర్తి పాటలకు ప్రతిపదార్థ తాత్పర్యాలు ఈ పుస్తక సంపుటాలలో సమగ్రంగా లభించనున్నాయి. గాయకులకు, భాషాభిమానులకు, తెలుగు విద్యార్థులకు, వేటూరి అభిమానులకు ఇది ఎంతో ఉపయుక్తమైన గ్రంథం కాగలదు.
సాంఘిక సేవాకార్యక్రమాలు:
మాధురి దంపతులు పేద విద్యార్థుల ఫీజుల కోసం విరాళాలు ఇవ్వడం ప్రారంభించారు. ఈ దంపతులు భారతదేశంలో ఉండగా ప్రతీ శనివారం అన్నదానకార్యక్రమం నిర్వహించారు. వేదపాఠశాలల పునరుధ్ధరణకు, వృద్ధుల వైద్యానికీ, పేదమహిళల వివాహానికీ ఆర్థికసాయం చేసినా ఏనాడు ప్రచారాన్ని కోరుకోలేదు. అమెరికానుండి దేవాలయాలలో అన్నదానాలకీ, అడవుల సంరక్షణకీ, విద్యాదానానికి వారు ఆర్థిక సహాయం అందిస్తూనే ఉన్నారు.
ఆధ్యాత్మిక ప్రయాణం:
పదవ తరగతిలో ఉండగా మాధురి 'సిద్ధిసమాధి యోగ' తరగతులకు వెళ్ళి తన జీవన శైలిని మార్చుకున్నప్పటికీ, వివాహనంతరం కొంత విరామం వచ్చింది. తిరిగి 2015 నుండి ఆవిడ ఆధ్యాత్మిక ప్రయాణం మొదలయి, ప్రతీ ఉదయం బ్రహ్మముహూర్తంలో ధ్యానం, పూజాదుల ఆనంతతం, తన ఆధ్యాత్మిక అనుభూతులను గ్రంథస్తo చేయనారంభిస్తుంది మాధురి. అమ్మవారికి సంబంధించిన ఎన్నో గ్రంథాలను ఆవిడ క్షుణ్ణంగా చదివి ఆధ్యాత్మిక భావాలను పెంపొందించుకున్నది.
ఆధారాలు;
1. తొలినవల వజ్రకుండం విడుదల 2021, ఏప్రిల్.
2. మనసిజ, నందు వర్సెస్ నందు, మా అమ్మకోసం నవలల విడుదల ఏకకాలంలో Dec, 2022.
3. 'నందు వర్సెస్ నందు' నవలమీద కె.ఎల్. శైలజ రచించిన సమీక్ష అంతర్జాల పత్రిక తపస్వి మనోహారం జనవరి, 2023 సంచికలో ప్రచురించబడింది.
తపస్వి మనోహారం పత్రిక 2023 జనవరి సంచికలో ప్రచురితమయిన నవలా రచయిత్రి ఇంగువ మాధురి పరిచయం నుంచి ఆమె జీవిత వివరాలు సేకరించడమయినది.
4. మద్రాసు విశ్వవిద్యాలయం కవిత్రయ మహాభారతం మీద నిర్వహించిన జాతీయ సెమినార్ లో శ్రీమతి ఇంగువ మాధురి ఉపన్యసించినట్లు చెన్నయ్ 07-3-2024 ఈనాడు, అంధ్రజ్యోతి(చెన్నై ఏడి షన్లు) ప్రకటించిన వార్త.
5. మద్రాసు విశ్వవిద్యాలయం తెలగు శాఖ నిర్వహించిన "విశ్వర్షి వాసిలి సాహిత్యం, వ్యక్తిత్వం, యౌగికత్వం" మీద నిర్వహించిన సెమినార్ లో ఇంగువ మాధురి ఉపన్యసించినట్లు ఈనాడు(A.P, T. N ఈనాడు 08 -10-2022 సంచిక పరచురించిన రిపోర్ట్.
6.13 వ అమెరికా తెలుగు సాహితీ సదస్సు, సిలికాంధ్ర విశ్వవిద్యాలయం & వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా సావెనిర్, 2023,అక్టోబర్ -21-22 లో ఇంగువ మాధురి పచయం.