ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్
ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ Indian Overseas Bank (IOB) ఫిబ్రవరి 10, 1937 న ముత్తయ్య చిదంబరం చెట్టియార్ చే స్థాపించబడింది. బ్యాంక్ ప్రధాన కార్యాలయం తమిళనాడు రాజధాని చెన్నైలో ఉంది. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ సేవలలో వాణిజ్య బ్యాంకింగ్, ట్రెజరీ, కార్పొరేట్/ హోల్ సేల్ బ్యాంకింగ్, రిటైల్ బ్యాంకింగ్, ఇతర బ్యాంకింగ్ కార్యకలాపాలతో పాటు వ్యక్తిగత బ్యాంకింగ్, కార్పొరేట్ బ్యాంకింగ్, ఎన్ఆర్ఐ ఖాతాలు, మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, సేవింగ్స్ బ్యాంక్ ఖాతా, కరెంట్ ఖాతా, రిటైల్ ఉత్పత్తులు, అంతర్జాతీయ వీసా కార్డు, తృతీయపక్ష బీమా( థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్), టర్మ్ డిపాజిట్లు వంటి సేవలు వినియోగదారులకు అందచేస్తుంది.[1][2]
చరిత్ర
[మార్చు]1937 సంవత్సరంలో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ మూడు శాఖలతో చెన్నై, కరైకుడి, రంగూన్ (బర్మాలో, తరువాత మయన్మార్ లో) ప్రారంభించినారు. బ్యాంక్ వ్య వస్థాపక చైర్మన్ ఎం.సి.టి.చిదంబరం చెట్టియార్ బ్యాంక్ స్థాపనలో విదేశీ బ్యాంకింగ్, విదేశీ మారక ద్రవ్యాన్ని ప్రోత్సహించడమే లక్ష్యంగా పెట్టుకొని ముఖ్య ఉద్దేశ్యం తో స్థాపించాడు . 1955 సంవత్సరం నాటికి, ఇది హాంగ్-కాంగ్, కౌలాలంపూర్, సింగపూర్, కొలంబోలలో శాఖలను ప్రారంభించింది. 1960వ దశకంలో, చిన్న భారతీయ బ్యాంకుల ఏకీకరణ జరిగింది. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ అనేక బ్యాంకులను కొనుగోలు చేసింది. 1969 సంవత్సరంలో తన 168 శాఖలతో జాతీయ బ్యాంకుగా మారింది. 1990లో బ్యాంక్ ఆఫ్ తమిళనాడును ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ లో విలీనం చేశారు. 1990 లలో స్థిరమైన వృద్ధి తరువాత, ఐఓబి ఐపిఒను ప్రారంభించింది, తరువాత ప్రభుత్వ హోల్డింగ్ 100% నుండి 75% కు పడిపోయింది. 2003 సంవత్సరం లో, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ తన రెండవ ఐపిఒను ప్రారంభించింది, ఇది ప్రభుత్వ హోల్డింగ్ ను 61% కు తగ్గించింది[3].
దస్త్రం:ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ శాఖ -లెమెల్లె.jpg | |
రకం | పబ్లిక్ |
---|---|
బి.ఎస్.ఇ: 532388 NSE: IOB | |
పరిశ్రమ | బ్యాంకింగ్ కాపిటల్ మార్కెట్ |
స్థాపన | 10 ఫిబ్రవరి 1937 |
స్థాపకుడు | ఎం.సి.టి.ఎం.చిదంబరం చెట్యార్ |
ప్రధాన కార్యాలయం | చెన్నై, తమిళ నాడు, భారతదేశం |
Number of locations | 3218 - శాఖలు & 3270 ఏ టి ఎం |
కీలక వ్యక్తులు |
|
ఉత్పత్తులు | అప్పులు, క్రెడిట్ కార్డ్స్, సేవింగ్స్, కరెంట్ అకౌంట్ , ప్రభుత్వ ప్రాయోజిత పథకాలు, ఇన్వెస్ట్మెంట్ వైకిల్స్ మొదలైనవి ., |
రెవెన్యూ | ₹22,422.91 crore (US$2.8 billion) (2021)[4] |
₹5,840.81 crore (US$730 million) (2021)[4] | |
₹831.47 crore (US$100 million) (2021)[4] | |
Total assets | ₹2,74,000.35 crore (US$34 billion) (2021)[4] |
యజమాని | పబ్లిక్ లిస్టెడ్ |
ఉద్యోగుల సంఖ్య | 23,579 (2021)[4] |
మాతృ సంస్థ | ఆర్ధిక శాఖ, భారత ప్రభుత్వం |
మూలధన నిష్పత్తి | 10.32% (2021)[4] |
వెబ్‌సైట్ | www |
సేవలు
[మార్చు]1969 సంవత్సరంలో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ జాతీయం చేయబడినప్పుడు, బ్యాంకుకు 208 శాఖలు, రూ.156 కోట్ల వ్యాపార మిశ్రమం ఉన్నాయి. 1990 సంవత్సరంలో బ్యాంక్ ఆఫ్ తమిళనాడు ను ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ లో విలీనం చేసారు. బ్యాంక్ క్యాన్ కార్డ్ తో కలిసి అరేంజ్ మెంట్ లో క్రెడిట్ కార్డును ప్రవేశ పెట్టడం జరిగింది. 1995 సంవత్సరంలో జూలై 26 న బ్యాంకు, దానిచే ప్రాయోజితం చేయబడిన మూడు ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు (ఆర్.ఆర్.బి.లు) తో ఒక అవగాహనా ఒప్పందంపై సంతకం చేసింది - పూరీ గ్రామీణ బ్యాంకు (ఒరిస్సా), పాండ్యన్ గ్రామా బ్యాంక్ (తమిళనాడు), ధెంకనాల్ గ్రామీణ బ్యాంకు (ఒరిస్సా). ఎమ్ఒయు కింద, ఐదు సంవత్సరాల వ్యవధిలో వివిధ వ్యాపార పరామీటర్ల కింద లక్ష్యాలను సాధించాలని నిర్ణయించారు.
1998 నవంబర్ 27న కిసాన్ క్రెడిట్ కార్డు మెరుగైన వెర్షన్ ను బ్యాంక్ లాంఛ్ చేసింది. ఈ పథకం వేగంగా ప్రజాదరణ పొందుతోంది. శాఖలు 2,369 కార్డులను పంపిణీ చేశాయి, ఈ పథకం ప్రారంభమైన నాలుగు నెలల్లోనే రూ. 538.0 లక్షల రుణాన్ని పంపిణీ చేశాయి. 1999 - బ్యాంకు సరళీకృత, రుణగ్రహీత స్నేహపూర్వక ఫీచర్లతో 'శుభ గృహ' అనే గృహనిర్మాణ పథకాన్ని ప్రారంభించింది. - దేశవిదేశాల్లో చదువులు చదువుతున్న విద్యార్థులకు ప్రయోజనం చేకూర్చేందుకు బ్యాంకు 'విద్యాజ్యోతి' విద్యా రుణ పథకాన్ని మరింత సవరించారు. దేశ,విదేశాలలో చదివే విద్యార్థులకు రుణ మొత్తాలు పెంచబడి, వడ్డీ రేట్లు తగ్గించబడ్డాయి.[5]
మైలురాళ్ళు
[మార్చు]1964 లో, ఇది ఇంటర్-బ్రాంచ్ రీకాన్సిలేషన్ , ప్రావిడెంట్ ఫండ్ ఖాతాల రంగాలలో కంప్యూటరీకరణను ప్రవేశపెట్టింది.
వ్యక్తిగత రుణ పథకాన్ని ప్రవేశపెట్టడం ద్వారా వినియోగదారుల పరపతిలోకి ప్రవేశించిన మొదటి బ్యాంకు. .
1969 లో జాతీయం చేయబడిన 14 ప్రధాన బ్యాంకులలో ఐఒబి ఒకటి.
బిజినెస్ టుడే - పిఎమ్ జి సర్వే , ఫైనాన్షియల్ ఎక్స్ ప్రెస్ - ఎర్నెస్ట్ & యంగ్ సర్వే లో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో నెం.1 స్థానంలో నిలిచింది.[6]
మూలాలు
[మార్చు]- ↑ chcom (2013-07-11). "Indian Overseas Bank". CompaniesHistory.com - The largest companies and brands in the world (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2022-07-13.
- ↑ wikesh (2023-05-10). "భారతదేశంలోని ప్రభుత్వ బ్యాంకుల జాబితా - government banks in india". latestnewstamil.com - current affairs and news (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2023-07-15. Retrieved 2022-07-13.
- ↑ "A Brief History of Indian Overseas Bank". www.icmrindia.org. Retrieved 2022-07-13.
- ↑ 4.0 4.1 4.2 4.3 4.4 4.5 "Balance Sheet 31.03.2021".
- ↑ "History of Indian Overseas Bank, Company". Goodreturn (in ఇంగ్లీష్). Retrieved 2022-07-13.
- ↑ "Indian Overseas Bank: Reports, Company History, Directors Report, Chairman's Speech, Auditors Report of Indian Overseas Bank - NDTVProfit.com". www.ndtv.com (in ఇంగ్లీష్). Retrieved 2022-07-13.