ఇన్స్టంట్ కెమెరా
ఇన్స్టంట్ కెమెరా లేక పోలరాయిడ్ కెమెరా అనేది కెమెరా యొక్క ఒక రకం, ఇది ఫిల్మ్ ఇమేజ్ ను తక్షణమే అభివృద్ధి పరచి చిత్రాన్ని అందిస్తుంది. స్వీయ అభివృద్ధి ఫిల్మ్ ను ఉపయోగించడానికి చాలా ప్రాచుర్యం కలిగిన రకాలను గతంలో పోలరాయిడ్ కార్పొరేషన్ తయారు చేసింది. ఈ కెమెరా తక్షిణమే చిత్రాన్ని అందిస్తుంది కాబట్టి ఇన్స్టంట్ కెమెరాగా, పోలరాయిడ్ కంపెనీచే తయారయింది కాబట్టి పోలరాయిడ్ కెమెరాగా పేరు తెచ్చుకుంది. 1948లో అమెరికాకు చెందిన ఎడ్విన్ హెచ్.లాండ్ మొదటగా పోలరాయిడ్ కెమెరాలను రూపొందించాడు. అయితే అది బ్లాక్ అండ్ వైట్ ఫొటోలకు మాత్రమే పరిమితమయింది. ఆ తర్వాత రంగుల చిత్రాలను తీయగలిగేలా ఈ కెమెరాను అభివృద్ధి పరచారు.
పోలరాయిడ్ కెమెరా పని చేసే విధానం
[మార్చు]పోలరాయిడ్ కెమెరాలో డబుల్ పిక్చర్ రోల్ లోడ్ చేసి ఉంటుంది, వీటిలో ఒకటి నెగటివ్, మరొకటి ప్రత్యేకమైన కాగితంపై ఉండే పాజిటివ్ రోల్. పాజిటివ్ రోల్ మీద కొన్ని రసాయనిక పూతలు పూయబడి ఉంటాయి. ఫొటో తీసినప్పుడు కెమెరా లెన్స్ నుంచి కాంతినందుకున్న నెగటివ్, పాజిటివ్ రోల్స్ రెండూ రసాయనపు పొరలను ఛేదించుకుంటూ ఒక రోలర్ గుండా బయటికి వస్తాయి. అప్పటికే ఎక్స్‌పోజ్ అయి ఉన్న నెగటివ్ రోల్ నుంచి రసాయన పూతలు చొచ్చుకుపోయి నెగటివ్ రోల్ పైన నలుపు, తెలుపు రంగులతో కూడిన నెగటివ్ ఇమేజ్ ఏర్పడుతుంది. పాజిటివ్ రోల్‌కూ, కెమెరాలో ఉన్న రసాయనాలకు మధ్య జరిగిన చర్య ఫలితంగా ఫొటోగ్రాఫ్ పైన గల తెలుపు బొమ్మ తెల్లగానూ, నలుపు బొమ్మ నల్లగానూ ఉండేలా చిత్రం ఆవిష్కృతమవుతుంది. బ్లాక్ అండ్ వైట్ చిత్రం ఆవిష్కృతమవడానికి 10 సెకండ్లు మాత్రమే పడితే, రంగుల చిత్రం ఆవిష్కృతమవడానికి నిమిషం దాకా వ్యవధి పడుతుంది. ఫిల్మ్‌ను లైట్‌లో ఎక్స్‌పోజ్ చేసినప్పుడు దాని మీద ఉండే సిల్వర్ సాల్ట్, మెటాలిక్ సిల్వర్‌గా మారిపోతుంది. ఫోటో తీసినప్పుడు జరిగే ఒక రసాయన చర్య వలన ఫిల్మ్‌పైన రంగులు ఏర్పడతాయి. ఇలా తొలిదశ పోలరాయిడ్ కెమెరాల పనితీరు ఉండగా, ఆ తరువాత 1972లో, 1978లో జరిగిన సాంకేతికాభివృద్ధి ఫలితంగా వీటి పనితీరు బాగా మెరుగయింది.
ప్రస్తుతం లభించే ఇన్స్టంట్ కెమెరాల జాబితా
[మార్చు]ద ఇంపాజిబుల్ ప్రాజెక్ట్ సంస్థ
[మార్చు]- SX-70 కెమెరా (ఫోల్డింగ్ టైప్,, బాక్స్ టైప్)
- 600 కెమెరా (ఫోల్డింగ్ టైప్,, బాక్స్ టైప్)
- ఇమేజ్/స్పెక్ట్రా కెమెరా
ఫూజీఫిలిం సంస్థ
[మార్చు]- Instax Mini 8
- Instax Mini 25
- Instax Mini 50S
- Instax 210
-
ఇన్స్టాక్స్ మిని 25
-
ఇన్స్టాక్స్ మిని 50S
-
ఇన్స్టాక్స్ 210
కొడాక్ సంస్థచే రూపొందించబడ్డ ఇన్స్టంట్ కెమెరాలు
[మార్చు]ప్రస్తుతం వీటి ఉత్పాదన నిలిపివేయబడ్డాయి
-
ఈకే 6
-
ఈకే 100
-
ఈకే 160
-
ద హ్యాండిల్
ఇవి కూడా చూడండి
[మార్చు]ఇన్స్టంట్ ఫిల్మ్ - ఇన్స్టంట్ కెమెరాలో వాడబడే ఫిల్మ్
మూలాలు
[మార్చు]- సాక్షి దినపత్రిక - 17-08-2014 (పోలరాయిడ్ కెమెరా ఎలా పనిచేస్తుంది..?)
- ద ఇంపాజిబుల్ ప్రాజెక్ట్ కెమెరాల జాబితా
- ఫూజీ ఫిలిం కెమెరాల జాబితా