ఊడుగచెట్టు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఊడుగచెట్టు (ఆంగ్లం: Alangium Salvifolium) భారతదేశం అంతటా కనిపిస్తుంది.[1] దీనిని సంస్కృతంలో అంకోలవృక్షం అంటారు. ఇది మన దేశానికి చెందిన చెట్టు. ఆఫ్రికా,[2] శ్రీలంక, బర్మా, థాయిలాండ్, ఇండోనేషియా, ఫిలిపీన్సు వగయిరా దేశాలలో కూడా పెరుగుతుంది.[3] కొన్ని చోట్ల దారికి ఇరుదరుల అలంకారంగా పెంచుతారు.[4][5] రాజస్థాన్, పశ్చిమబెంగాల్, కేరళ, ఆంధ్రప్రదేశ్ లో తూర్పుకనుమల్లో ఇసుక తరి నెలల్లో ఈ వృక్షం పెరుగుతుంది.

ఈ కాయ‌లు ప‌చ్చిగా ఉన్న‌ప్పుడు ప‌చ్చ‌రంగులో, దోర‌గా ఉన్న‌ప్పుడు ఎరుపు రంగులో, పండిన త‌రువాత న‌లుపు రంగులో ఉంటాయి. వీటిని ప‌గ‌ల‌కొట్టి చూస్తే లోప‌ల తెల్ల రంగులో గుజ్జు ఉంటుంది. ఈ కాయ‌ల‌ను చాలా మంది ఇష్టంగా తింటారు." దీనిలో 40 రకాల specius ఉన్నాయని అంటారు. Alangiaceae కుటుంబానికి, లేదా జాతికి చెందిన చెట్టు. పొదలుగా షుమారు 20 అడుగుల ఎత్తు వరకూ ఎదుగుతుంది. పెద్ద ఖర్చు లేకుండా పెంచడానికి అనుకూలమయిన చెట్టు. కొమ్మలకు ముళ్లుంటాయి. ఫెబ్రవరి, మార్చి నెలలలో చెట్టు పూస్తుంది, పూలు సువాసనతో, తెల్లగా, పసుపుదాళుగా ఉంటాయి, పక్షులు, తేనెటీగలు పూవ్వులకోసం వచ్చి పరపరాగా సంపర్కం జరుపుతాయి. మే, జూన్ కల్లా బెర్రీ పళ్ళవంటి ఎర్రని చేదు పళ్ళు కాస్తుంది. మయినాలు, బేబ్లర్ పిట్టలు, పారాకీట్ పిట్టలు దీని పళ్ళను తింటాయి.

దీని విత్తనాలనుంచి నూనెతీసి పారిశ్రామిక ఉత్పత్తుల్లో వాడుక చేస్తారు. ఇది ఆయుర్వేద వయిద్యంలో ఉపయోగపడుతుంది.[6] ఈ చెట్టు నుంచి తయారుచేసిన మందుల్లో యాంటీ ఆక్సిడెంట్ గుణం ఉందని వాడుక. దీని నూనెతో స్వర్ణవిద్యను సాధించవచ్చని నమ్మకం. దీని కొయ్యతో నగిషీలు చేసే బొమ్మలు, వస్తువులు, కుర్చీలు తయారుచేస్తారు. లేత కొమ్మలను పలుదోముపుల్లలుగా ఉపయోగిస్తారు.[7][8] ఉరుములు, మెరుపుల్తో వర్షం కురిసినపుడు ఊడుగ విత్తనాలు మానుకు అతుక్కుంటాయని మరొక నమ్మకం. బారతీయ సాహిత్యంలో తరచూ అంకోలవృక్షం ప్రస్తావనలు కనిపిస్తాయి. ఊడుగ విత్తనం వంటివాడు అని తెలుగులో సామెత. అంటే వద్దన్నా అతుక్కుపోతాడని భావం.

మూలాలు

[మార్చు]
  • Flora of Nalamala VolI,R.S.Rao and others
  • ఆయుర్వేదం ఆన్లైన్ సంచిక. June 11, 2022
  1. K. N, Ganeshaiah; R, Ganesan; R, Vasudeva; C G, Kushalappa; A R R, Menon; Patwardhan, Ankur; S R, Yadav; Shanker, Uma (2012). Plants of Western Ghats (Vol.1). Bangalore: School of Ecology and Conservation GKVS Bangalore. p. 57.
  2. "Alangium salviifolium (L.f.) Wangerin". Plants of the World Online. Royal Botanic Gardens, Kew. Retrieved 23 March 2021.
  3. "Alangium salviifolium (L.f.) Wangerin". Plants of the World Online. Royal Botanic Gardens, Kew. Retrieved 23 March 2021.
  4. Krishen, Pradip (2013). Jungle Trees of Central India. Penguin group. p. 164. ISBN 9780143420743.
  5. Neginhal, S.G (2011). Forest trees of the western ghats. S.G Neginhal IFS (Retd). p. 176. ISBN 9789350671733.
  6. K. N, Ganeshaiah; R, Ganesan; R, Vasudeva; C G, Kushalappa; A R R, Menon; Patwardhan, Ankur; S R, Yadav; Shanker, Uma (2012). Plants of Western Ghats (Vol.1). Bangalore: School of Ecology and Conservation GKVS Bangalore. p. 57.
  7. Krishen, Pradip (2013). Jungle Trees of Central India. Penguin group. p. 164. ISBN 9780143420743.
  8. Neginhal, S.G (2011). Forest trees of the western ghats. S.G Neginhal IFS (Retd). p. 176. ISBN 9789350671733.