ఎస్/2004 ఎన్ 1
S/2004 N 1 అనునది నెప్ట్యూన్ గ్రహం యొక్క ఉపగ్రహం యిది సుమారు 18 కి.మీ వ్యాసము కలిగి ఆ గ్రహం చుట్టూ గల కక్ష్యలో ఒక భౌగోళీక దినములో తిరుగుతుంది. దీనిని జూలై 1, 2013లో కనుగొన్నారు. దీనిని కనుగొన్నాక నెప్ట్యూన్ యొక్క ఉపగ్రహాలలో మనకు తెలిసిన ఉపగ్రహాలు 14 కు పెరిగింది.[1] 1989 లో పంపిన వోయేజెర్ 2కు ఈ ఉపగ్రహం చాలా కాంతి విహీనంగా కనిపించింది. 2004 నుండి 2009 ల మధ్య కాలంలో హబుల్ స్పేస్ టెలిస్కోప్ తీసిన నెప్ట్యూన్ చిత్రాల విశ్లేషణ చేసి SETI సంస్థకు చెందిన మార్క్ షోవాల్టర్ కనుకొన్నాడు[2] దీనికి పెట్టిన పేరు "S/2004 N 1" తాత్కాలికమైనది. "2004" ఈ ఉపగ్రహ సమాచారాన్ని సంపాదించిన మొదటి సంవత్సరాన్ని సూచిస్తుంది. కానీ ఈ ఉపగ్రహం కనుగొన్న సంవత్సరం కాదు.
ఆవిష్కరణ
[మార్చు]మార్క్ షోవాల్టర్ ఎస్/2004 ఎన్ 1 ను జూలై 13, 2013లో హబుల్ టెలిస్కోప్ తీసిన నెప్ట్యూన్ యొక్క వలయాలను 2009 నుండి విశ్లేషించి కనుకొన్నాడు.అతడు ఆ కక్ష్య యొక్క చలనాన్ని, వివిధ దుర్భల చిత్రాల నుండి పానింగ్ (కెమేరా) తో కనుగొనే సాంకేతిక పద్ధతిని ఉపయోగించాడు.[1][3][4] శోధన ప్రాంతంలో వలయాల వ్యాసార్థాలను గుర్తించి ఈ ఉపగ్రహం గూర్చి "ఊహించని రీతిలో" నిర్ణయం తీసుకున్నారు.[5] ఈయన కొత్త ఉపగ్రహాన్ని గుర్తించేందుకు "fairly obvious dot" కనుగొన్నారు. అపుడు 2004 నుండి తీసిన పాత హెచ్.ఎస్.టి చిత్రాలను పదే పదే పరిశీలించి కనుగొనన్నారు." వోయేజర్ 2" అంతరిక్ష నౌక నెప్ట్యూన్ యొక్క యితర అంతర ఉపగ్రహాలను కూడా పరిశీలించింది. కానీ 1989 లో దీనికి సమీపంగా వెళ్ళినప్పటికీ ఈ ఉపగ్రహాన్ని కనుగొనలేకపోయింది. దీనికి కారణము ఇది కాంతివిహీనంగా ఉండటమే..[1] దీనికి సంబంధించిన చిత్రాలు ప్రజల వద్ద అందుబాటులో ఉన్నప్పటికీ ఎవరూ దీనిని కనుగొనలేకపోయారు.S/2004 N 1 అనేది నెప్ట్యూన్ యొక్క తెలిసిన ఉపగ్రహాలలో 14 వది., మొదటిది సెప్టెంబరు 2003 లో కనుగొనబడింది.[4][6]
మూలము
[మార్చు]నెప్ట్యూన్ యొక్క అతి పెద్ద ఉపగ్రహం టైటాన్. గ్రహ చలనానికి వ్యతిరేక దిశలో దాని కక్ష్యలో చలిస్తుంది.దీనిని నెప్ట్యూన్ దాని కూపర్ బెల్ట్ నుండి స్వాధీనం చేసుకొనినట్లు ప్రతిపాదించబదినది. దీనితరువాత నెప్ట్యూన్ యొక్క అసలైన ఉపగ్రహ వ్యవస్థ యేర్పడినది. ముందుగా ఉన్న ఉపగ్రహాల కక్ష్యలు కూడా యిదే మాదిరిగా ఉండవచ్చు.కొన్ని ఉపగ్రహాల తొలగింపు, యితరాల వల్ల వినాశనానికి దారితీయవచ్చు.[7][8] నెప్ట్యూన్ యొక్క ప్రస్తుత అంతర ఉపగ్రహములు రాళ్ళతో కూడి టైటాన్ ఉపగ్రహం యొక్క అలల ఋణత్వరణం కారణంగా యేర్పడి క్రమాభివృద్ధి కలిగి యుంటాయని భావిస్తారు[9]
భౌతిక ధర్మాలు
[మార్చు]S/2004 N 1 నెప్ట్యూన్ యొక్క యితర ఉపగ్రహాల కంటే దీని తలం దట్టమైన తారుకంటే నల్లగా ఉన్నట్లు భావించబడుతున్నది[3] దీనియొక్క జ్యామితీయ ఆల్బిడో యొక్క అవధి 0.07 నుండి 0.10 వరకు ఉంటుంది.[10] S/2004 N 1 యొక్క స్పష్టమైన పరిమాణం 26.5 ఉండి దాని యొక్క వ్యాసము 16 నుండి 20 కిలోమీటర్లు ఉంటుంది. యిది నెప్ట్యూన్ యొక్క అన్ని ఉపగ్రహాలలో యిప్పటికి అతి చిన్నది. నెప్ట్యూన్ యొక్క వలయాలు, అంతర ఉపగ్రహాల పరారుణ వర్ణపటం HST NICMOS పరికరం ద్వారా అధ్యయనం చేయబడినది[11][12].అదేవిధంగా సౌర వ్యవస్థలోని ఖగోళ వస్తువులపై కనిపించే ఎరుపు రంగు లక్షణం వలెనే యిది కూడా అన్ని తలాలపై కనబడుతుంది. ఈ సమాచారం CH,/లేదా -CN బంధములు కల అర్గానిక్ పదార్థముల వలన తెలుస్తుంది[12].కానీ వర్ణపట స్పష్టత అణువులను గుర్తించేందుకు సరిపడదు. బాహ్య సౌర వ్యవస్థలో నీటి మంచు సమృద్ధిగా ఉంటుదని నమ్మకం ప్రస్తుతం ఉంది. కానీ దానికి వర్ణపట ఋజువులు కనుగొనలేకపోయారు.[12]
కక్ష్య లక్షణములు
[మార్చు]S/2004 N 1 ఉపగ్రహం నెప్ట్యూన్ చుట్టూ ప్రతి 22 గంటల 28.1 నిముషాలు అనగా 0.9362 రోజులలో పరిభ్రమణం చేస్తుంది. దీనిని బట్టి దాని కక్ష్య యొక్క దీర్ఘాక్షం పొడవు 1,05,283 కిలోమీటర్లు ఉంటుంది. యీ విలువ భూమి యొక్క ఉపగ్రహం చంద్రుని కక్ష్య యొక్క దీర్ఘాక్షంలో నాలుగో వంతు ఉంటుంది. యీ విలువ నెప్ట్యూన్ యొక్క వలయాల సరాసరి వ్యాసార్థానికి రెండు రెట్లు ఉంటుంది. దీని వంపు, స్వభావాలు సున్నకు దగ్గరగా ఉంటాయి. దీని కక్ష్య "లారిస్సా(ఉపగ్రహం)", "(ప్రొటెయస్(ఉపగ్రహం)" ల మధ్యగా ఉంటుంది. యిది నెప్ట్యూన్ యొక్క క్రమ ఉపగ్రహాలలో చివరినుండి రెండవది. యిది వ్యాసార్థంలోనూ పరిమాణం లోనూ వృద్ధి చెందియున్న యితర నెప్ట్యూన్ ఉపగ్రహాల చలనానికి వ్యతిరేకదిశలో తిరుగుతున్న అతి చిన్న ఉపగ్రహం. నెప్ట్యూన్ ఉపగ్రహమైన లారిస్సా, S/2004 N 1 లు 3:5 ఆర్బిటాళ్ళ అనునాదంలో ఒక శాతం ఉంటాయి. S/2004 N 1, ప్రోటెయస్ లు 5:6 నిష్పత్తి అనునాదంలో 0.1%లో ఉంటాయి.[Note 1] లారిసా, ప్రోటేయస్ లు 1:2 మాధ్యమిక చలన అనునాదంలో కొన్ని వందల మిలియన్ల సంవత్సరాలనుండి పోవుచున్నవి[13][14]
ప్రాటెయస్,[13] S/2004 N 1 ఉపగ్రహాలు లారిస్సా ఉపగ్రహం నుండి దూరంగా మళ్ళుతున్నవి. ఎందువలనంటే పూర్వపు బయటి నెప్ట్యూన్ యొక్క ఆర్బిట్ యొక్క భ్రమణ కాలం 0.6713 రోజులు[15]., వాటి అలల త్వరణంలో ఉంటే లారిస్సా ఉపగ్రహం ఋణ త్వరణంలో ఉంటుంది.[13]
నామకరణం
[మార్చు]దీని ఆవిస్కరన బృందం దానికి పేరు పెట్టుటకు నెప్ట్యూన్ (పురాణ పాత్ర) యొక్క సంబందం ఉన్న "గ్రేసొ" (పురాణపాత్ర) పేరును IAUకు సూచించింది. ఈ పాత్ర సముద్రదేవుడు.[5] ఈ పేరుని యితర నెప్ట్యూన్ చంద్రుల ఆధారంగా పెట్టడానికి అనుమతి కోరింది.[16]
నోట్సు
[మార్చు]- ↑ Given the moons' respective periods of 0.55465, 0.93618 and 1.12231 days, the actual ratios are 2.962:5.000:5.994.
సూచికలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 "Hubble Finds New Neptune Moon". Space Telescope Science Institute. 2013-07-15. Retrieved 2013-07-15.
- ↑ "Nasa's Hubble telescope discovers new Neptune moon". BBC News. 2013-07-15. Retrieved 2013-07-16.
- ↑ 3.0 3.1 Showalter, M. R. (2013-07-15). "How to Photograph a Racehorse ...and how this relates to a tiny moon of Neptune". cosmicdiary.org/mshowalter/ Mark Showalter's blog. Retrieved 2013-07-16.
- ↑ 4.0 4.1 Grossman, L. (2013-07-15). "Neptune's strange new moon is first found in a decade". newscientist.com/section/space New Scientist space web site. New Scientist. Retrieved 2013-07-18.
- ↑ 5.0 5.1 Klotz, I. (2013-07-15). "Astronomer finds new moon orbiting Neptune". Reuters. Archived from the original on 2013-07-16. Retrieved 2013-07-16.
- ↑ Marsden, Brian G.; S/2002 N 4, MPEC 2003-S107 (30 September 2003)
- ↑ Goldreich, P.; Murray, N.; Longaretti, P. Y.; Banfield, D. (1989). "Neptune's story". Science. 245 (4917): 500–504. Bibcode:1989Sci...245..500G. doi:10.1126/science.245.4917.500. PMID 17750259.
{{cite journal}}
: CS1 maint: multiple names: authors list (link) - ↑ Agnor, C. B.; Hamilton, D. P. (2006-05-11). "Neptune's capture of its moon Triton in a binary–planet gravitational encounter". Nature. 441 (7090): 192–194. Bibcode:2006Natur.441..192A. doi:10.1038/nature04792. PMID 16688170.
- ↑ doi:10.1016/0019-1035(92)90155-Z
This citation will be automatically completed in the next few minutes. You can jump the queue or expand by hand - ↑ doi:10.1016/S0019-1035(03)00002-2
This citation will be automatically completed in the next few minutes. You can jump the queue or expand by hand - ↑ Dumas, C.; Terrile, R. J.; Smith, B. A.; Schneider, G. (2002-03-01). "Astrometry and Near-Infrared Photometry of Neptune's Inner Satellites and Ring Arcs". The Astronomical Journal. 123 (3): 1776–1783. doi:10.1086/339022. ISSN 0004-6256.
- ↑ 12.0 12.1 12.2 Dumas, C.; Smith, B. A.; Terrile, R. J. (2003-08-01). "Hubble Space TelescopeNICMOS Multiband Photometry of Proteus and Puck". The Astronomical Journal. 126 (2): 1080–1085. doi:10.1086/375909. ISSN 0004-6256.
- ↑ 13.0 13.1 13.2 Zhang, K.; Hamilton, D. P. (2007-06-01). "Orbital resonances in the inner neptunian system: I. The 2:1 Proteus–Larissa mean-motion resonance". Icarus. 188 (2): 386–399. doi:10.1016/j.icarus.2006.12.002. ISSN 0019-1035.
- ↑ Zhang, K.; Hamilton, D. P. (2008-01-01). "Orbital resonances in the inner neptunian system: II. Resonant history of Proteus, Larissa, Galatea, and Despina". Icarus. 193 (1): 267–282. doi:10.1016/j.icarus.2007.08.024. ISSN 0019-1035.
- ↑ Williams, David R. (1 September 2004). "Neptune Fact Sheet". NASA. Retrieved 18 July 2013.
- ↑ "Planet and Satellite Names and Discoverers". Gazetteer of Planetary Nomenclature. USGS Astrogeology. Retrieved 2013-07-18.