ఏదులాబాద్ చెరువు
Appearance
ఏదులాబాద్ చెరువు | |
---|---|
ప్రదేశం | ఏదులాబాద్, ఘటకేసర్ మండలం, మేడ్చెల్-మల్కాజ్‌గిరి జిల్లా, తెలంగాణ రాష్ట్రం |
అక్షాంశ,రేఖాంశాలు | 17°25′29″N 78°41′44″E / 17.42483°N 78.69560°E |
ప్రవహించే దేశాలు | భారతదేశం |
ఉపరితల వైశాల్యం | 5 కి.మీ2 (1.9 చ. మై.)[1] |
ఉపరితల ఎత్తు | 1,759 అడుగు (536 మీటర్లు) |
ప్రాంతాలు | హైదరాబాదు, ఘటకేసర్ |
ఏదులాబాద్ చెరువు ( ఏదులాబాదు జలాశయం) తెలంగాణ రాష్ట్రం, మేడ్చెల్-మల్కాజ్‌గిరి జిల్లా, ఘటకేసర్ మండలం, ఏదులాబాద్ గ్రామంలో ఉన్న చెరువు.[1][2] ఘటకేసర్ మండలంలోనే పెద్ద చెరువైన ఏదులాబాదు చెరువు 590 ఎకరాల్లో విస్తరించి ఉంది.
చరిత్ర
[మార్చు]5వందల ఏళ్ళ చరిత్ర గల ఈ చెరువు ప్రస్తుతం 650 కుటుంబాలకు జీవనాధారంగా ఉంది. ఇది చుట్టుప్రక్కల ఉన్న గ్రామాల్లోని ప్రజల దాహార్తిని తీర్చడమేకాకుండా సుమారుగా మూడువేల ఎకరాలకు సాగు నీరును కూడా అందిస్తోంది.[3]
ఇతర వివరాలు
[మార్చు]- పటాన్ చెరువు నుండి వచ్చిన పారిశ్రామిక మురుగునీరు, వ్యర్థాలు వల్ల ఈ సరస్సును కలుషితమై చాలా చేపలు మరణించడమేకాకుండా 2002లో చెరువు పక్కనున్నవారి అనారోగ్యానికి కారణమయ్యాయి.[1]
- పరిశ్రమల నుండి వచ్చే మురుగునీటి రసాయనాల వల్ల ఈ చెరువులోని నీరు గులాబీ రంగులోకి మారిపోయింది.[4]
- ఇందులోని నీరు కాలుషితమవడం వల్ల వరి పంటలో తాలు ఎక్కువై, వరిగింజలు గట్టితనంను కోల్పోతున్నాయి. పంటల నాణ్యత తగ్గి, మార్కెట్లో గిరాకి తగ్గింది.
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 "Polluted lake spells doom for fish". The Hindu.
- ↑ "Terror threat looms large as Hyderabad set for Ganesh nimjjan". The Times of India.
- ↑ మన తెలంగాణ, రంగారెడ్డి (27 March 2016). "ఏదులాబాదు చెరువుకు 'మూసీ' ముప్పు". Ramesh Chauhan. Archived from the original on 8 ఫిబ్రవరి 2020. Retrieved 8 February 2020.
- ↑ "Nature-Nurture" (PDF). www.adb.org.