ఏరువాక పున్నమి
వర్షఋతువులో జ్యేష్ఠశుద్ధ పూర్ణిమను తెలుగు రైతులు ఏరువాక పున్నమిగా జరుపుకుంటారు. తొలకరి జల్లుల ఆగమనంతో రైతులు ఆనందోత్సాహాల మధ్య అరక దున్నటంతో పొలం పనులు మొదలుపెడతారు.
ఏరు అంటే దున్నడానికి సిద్ధం చేసిన నాగలి అని, ఏరువాక అంటే దున్నడానికి ప్రారంభమనీ అర్థం. అంటే వ్యవసాయం మొదలుపెట్టడం. సాంప్రదాయికంగా రైతులు ఏరువాక పున్నమిని పండుగలా జరుపుకుంటారు. ఆ రోజు ఎద్దులను కడిగి చక్కగా అలంకరిస్తారు. వాటికి పొంగలి పెడుతారు. అనంతరం రైతులందరూ సామూహికంగా ఎద్దులను తోలుకుని పొలాలకు వెళ్లి దుక్కి దున్నుతారు. [1]
ఆరోజున ఆడపడుచులు పుట్టింటికి వస్తారు. ఈ పండుగనాడు చేసే మరో ముఖ్యమైన వేడుక ఎడ్ల పందేలు. ఎద్దులను బాగా అలంకరించి పరిగెత్తిస్తారు. వాటి వెనుక యువకులు పరుగులు తీస్తారు. అంతేకాకుండా ఎద్దులకు బండలు (బరువైన రాళ్ళూ) కట్టి పరుగులు తీయిస్తారు. దీన్ని బండలాగుడు పోటీ అంటారు.
ఏరువాక పౌర్ణమి రోజునే ఇళ్ళలో పనిచేసే జీతగాళ్ళ సంవత్సరం ముగిసి కొత్త సంవత్సరం మొదలవుతుంది.
సాహిత్యంలో ఏరువాక
[మార్చు]ఏరువాక పున్నమిని “వప్పమంగల దివసం” గా రైతాంగం జరుపుకునే వారని జాతక కధల ద్వారా తెలుస్తోంది.[2]
తెలుగు సినిమాల్లో కూడా ఏరువాక ప్రముఖంగా కనిపించింది. రోజులు మారాయి సినిమా కోసం ఏరువాక నేపథ్యంలో కొసరాజు రాఘవయ్య చౌదరి కింది పాట రాసాడు.
“ఏరువాక సాగారో రన్నో చిన్ననా...
నీ కష్టమంతా తీరునురో రన్నో చిన్నన్నా...”
మూలాలు
[మార్చు]- ↑ "ఏరువాక పున్నమి". ఈనాడు.
- ↑ "ఏరువాక పున్నమి". తెలుగువన్. Archived from the original on 2017-09-14. Retrieved 2017-09-14.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)