కాలాబెన్ డెల్కర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కాలాబెన్ డెల్కర్
కాలాబెన్ డెల్కర్


పదవీ కాలం
2 నవంబర్ 2021 – ప్రస్తుతం
ముందు మోహన్ భాయ్ సంజీభాయ్ డెల్కర్
నియోజకవర్గం దాద్రా నగర్ హవేలీ

వ్యక్తిగత వివరాలు

జననం (1971-08-21) 1971 ఆగస్టు 21 (వయసు 53)[1]
సుఖాల, వల్సాద్ , గుజరాత్
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ (2024-ప్రస్తుతం)
ఇతర రాజకీయ పార్టీలు శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ థాకరే) (2021-2024)
తల్లిదండ్రులు శంకర్‌భాయ్ జీవ్‌భాయ్ పటేల్, సీతాబెన్
జీవిత భాగస్వామి మోహన్ భాయ్ సంజీభాయ్ డెల్కర్
నివాసం డెల్కర్ హౌస్, శ్రీ వినోబా భావే సివిల్ హాస్పిటల్ ఎదురుగా, సంజిభాయ్ డెల్కర్ మార్గ్, సిల్వాస్సా, దాద్రా, నగర్ హవేలీ, డామన్, డయ్యూ
పూర్వ విద్యార్థి వీర్ నర్మద్ సౌత్ గుజరాత్ యూనివర్సిటీ
మూలం [1]

కాలాబెన్ మోహన్‌భాయ్ డెల్కర్ భారతదేశానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె దాద్రా నగర్ హవేలీ లోక్‌సభ నియోజకవర్గం నుండి రెండుసార్లు లోక్‌సభ సభ్యురాలిగా ఎన్నికైంది. [2][3][4]

రాజకీయ జీవితం

[మార్చు]

కాలాబెన్ డెల్కర్ తన భర్త దాద్రా నగర్ హవేలీ ఎంపీ మోహన్ డెల్కర్ 22 ఫిబ్రవరి 2021న ముంబైలో ఆత్మహత్య చేసుకోవడంతో ఈ లోక్‌సభ స్థానం ఖాళీ అయింది. కాలాబెన్ డెల్కర్ ఆ తరువాత శివసేనలో చేరి ఈ ఉప ఎన్నికలలో పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి మహేశ్ గవిత్‌పై 47447 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి లోక్‌సభ సభ్యురాలిగా ఎన్నికైంది. ఆమె 2024లో భారతీయ జనతా పార్టీలో చేరి 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి అజిత్ రామ్‌జీభాయ్ మహాలాపై 57584 ఓట్ల మెజారిటీతో గెలిచి వరుసగా రెండోసారి లోక్‌సభ సభ్యురాలిగా ఎన్నికైంది.[5]

మూలాలు

[మార్చు]
  1. "Certificate of Domicile/Permanent Resident Certificate". p. 8. Retrieved 5 November 2021.
  2. The Indian Express (2 November 2021). "Kalaben Delkar wins in Dadra and Nagar Haveli, gets Shiv Sena its first Lok Sabha seat outside Maharashtra". Archived from the original on 16 July 2024. Retrieved 16 July 2024.
  3. The Times of India (3 November 2021). "Kalaben Delkar wins Dadra and Nagar Haveli, Shiv Sena's 1st Lok Sabha seat outside Maharashtra". Archived from the original on 16 July 2024. Retrieved 16 July 2024.
  4. "Dadra and Nagar Haveli LS bypoll | Shiv Sena wins by a margin of 51,269 votes". The Hindu. 2021-11-02. ISSN 0971-751X. Retrieved 2023-05-20.
  5. Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - Dadar & Nagar Haveli". Archived from the original on 22 July 2024. Retrieved 22 July 2024.