కుందురువారిపాలెం
"కుందురువారిపాలెం" పల్నాడు జిల్లా, ముప్పాళ్ళ (పల్నాడు జిల్లా) మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్ నం. 522 408., ఎస్.టి.డి కోడ్ = 08641
కుందురువారిపాలెం గ్రామం - సంక్షిప్త చరిత్ర
సుమారుగా 1820వ సంవత్సరం కాలంలో మొట్ట మొదటిగా "కందుల"వారు (కమ్మ కులస్థులు) వినుకొండ ప్రాంతం దగ్గర గల వీరాయపాలెం,భూమాయపాలెం నుండి ఈ గ్రామప్రాంతంలోకి వచ్చి నివాసం ఏర్పరుచుకుందాం అని అనుకున్నారు,కానీ ఆ గ్రామ పరిసరాలు అన్నీ చిట్టి అడవి లా ఉండేది,నివాసానికి అనుకూలంగా అక్కడ ఉన్న చెట్లను,పొదళ్ళను తొలగించసాగారు.ఆ సమయంలో అడవి జంతువుల బాధ ఎక్కువగా ఉండటం వల్ల ఇక్కడ నివసించడానికి అనువుగా లేదని భావించి సరిహద్దుగా గల దొండపాడు,ములకలూరు గ్రామాలకు చేరారు.వారి తరువాత "కుందురు"వారు (రెడ్డి కులస్థులు) వచ్చి నివాసానికి అనుకూలంగా ఉందని గ్రామంలో నివసించసాగారు.వారికి కూడా అడవి జంతువుల బాధ తప్పలేదు. వారు కూడా ఇక ఇక్కడనుండి వెళ్లిపోదాం అని నిశ్చయించుకొనగా,అప్పటి గవర్నమెంటు వారు మేము రక్షణ కల్పిస్తామని,అక్కడే ఉండమని కోరగా...సరేనని
స్థిరనివాసంలేర్పరుచుకొని నివసించసాగారు. అప్పుడు "కందుల" వారు లోగడ మనం నివాసయోగ్యం కాదని భావించిన ప్రాంతంలో ఎవరో నివసిస్తున్నారు అని తెలుసుకొని మనం కూడా మరల అక్కడే ఉందాం అని నిశ్చయించుకొని వచ్చి స్థిర నివాసము ఏర్పరుచుకున్నారు.తరువాత ఆ గ్రామానికి పేరు పెడదామని అనుకొనగా కందులవారు ముందు మేము వచ్చాం కనుక మా ఇంటి పేరుమీదగా "కందులవారిపాలెం" పెడదామనగా కాదు, మీరు వచ్చి నివసించకుండా వెళ్లారు, మేము వచ్చి నివసించసాగాం కనుక మా ఇంటి పేరు మీదగా "కుందురువారిపాలెం" అని పెట్టాలి అని ఇరువురు సందిగ్ధంలో ఉండగా ప్రభుత్వ అధికారులు మీరు నివసించకుండా వెళ్లారు,కానీ వీళ్ళు ఇక్కడే నివసించసాగారు.కనుక కుందురువారిపాలెం అని పెట్టడమే సరైనదని చెప్పగా అందుకు ఇరువురు అంగీకరించి కుందురువారిపాలెం అని నామకరణం చేసారు.వారు ఇరువురు అన్నదమ్ములుగా జీవించసాగిస్తారు.అప్పుడు50 మందితో ఏర్పడ్డ గ్రామం క్రమేణ పూర్వగ్రామం గోళ్ళపాడు,కుందురువారిపాలెం రెండు గ్రామాలు ఒకే పంచాయితీగా కొనసాగగా,2001 నుండి కుందురువారిపాలెం నూతన పంచాయితీగా ఏర్పడింది.కందుల వారు వారికి అండగా బొక్కిసం వారిని,కుందురు వారు వారికి అండగా చయికం వారిని తోడుగా తెచ్చుకున్నారు.ఆ తరువాత ఒక్కొక్కరుగా బ్రాహ్మణ,వైశ్య,యాదవ,తొగటీయ,వడ్డెర,బోయ,కుమ్మరి,ఏకలవ్య,రజక,మాల,మాదిగ కులస్థులు,ముస్లింలు వచ్చి నివాసాలు ఏర్పరుచుకొని నివసిస్తున్నారు.
గ్రామ పంచాయితీ.
[మార్చు]ఈ గ్రామ పంచాయితీ సర్పంచులు:- (గోళ్లపాడు పంచాయతీలో భాగం)
1.కందుల నరసింహం మొట్టమొదటి
2.అలవాల పుల్లారెడ్డి 1953౼1956
3.కందుల పెద్దన్న 1956౼1964
4.చయికం హానిమిరెడ్డి 1964౼1988
5.పరిటాల సాంబశివరావు 1988౼1995
6.ప్రత్యేక అధికారి 1995౼2001
కుందురువారిపాలెం ప్రత్యేక పంచాయితీగా ఏర్పాటు.
7.మేడా వెంకటేశ్వర్లు 2001౼2006
8.చింకా అర్జునరావు 2006౼2012
9.కందుల మస్తానరావు 2012
10.అల్లం రామ్మోహనప్రతాపరెడ్డి 2013౼2018