కృష్ణమూర్తి సుబ్రమణియన్
కృష్ణమూర్తి సుబ్రమణియన్ | |||
---|---|---|---|
17th Chief Economic Adviser to the Government of India | |||
In office 7 డిసెంబరు 2018 – 8 అక్టోబరు 2021 | |||
ప్రధాన మంత్రి | నరేంద్ర మోడీ | ||
మినిస్టర్ | నిర్మలా సీతారామన్ | ||
అంతకు ముందు వారు | అరవింద్ సుబ్రమణియన్ | ||
తరువాత వారు | వి అనంత నాగేశ్వరన్ | ||
వ్యక్తిగత వివరాలు | |||
జననం | భిలాయి, చత్తీస్ గడ్ | 1971 మే 5||
జాతీయత | భారతీయ | ||
కళాశాల | ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, కాన్పూర్ (బె.టెక్) ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, కలకత్తా (ఎం.బి.ఎ) చికాగో విశ్వవిద్యాలయం (ఎం.బి.ఎ, పి.హెచ్.డి) | ||
నైపుణ్యం | ఆర్ధిక శాస్త్ర వేత్త | ||
|
కృష్ణమూర్తి వెంకట సుబ్రమణియన్( Krishnamurthy Venkata Subramanian ) (జననం మే 5, 1971) ఒక భారతీయ ఆర్థికవేత్త, భారత ప్రభుత్వ మాజీ ప్రధాన ఆర్థిక సలహాదారు (సి. ఇ.ఎ). ఈ పదివిలో 7 డిసెంబర్ 2018 నుండి అక్టోబర్ 2021 వరకు ఉన్నాడు.
జీవితం
[మార్చు]చత్తీస్ గఢ్ లోని భిలాయ్ లో తమిళ కుటుంబంలో జన్మించాడు. అతడుఎం జి ఎం సీనియర్ సెకండరీ స్కూల్ సెక్టార్ VI , భిలాయి లో తన పాఠశాల విద్యను పూర్తి చేశాడు. సుబ్రమణియన్ 1994 సంవత్సరంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాన్పూర్ (ఐఐటి కాన్పూర్) నుండి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ పూర్తి చేసి, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లో సీనియర్ ఎనలిస్ట్, మేనేజర్ గా మూడేళ్లు పనిచేసిన తర్వాత, ఆర్థిక శాస్త్రంలో ఎంబీఏ చేయడానికి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్ కలకత్తా ( ఐ.ఐ.ఎం కలకత్తా) , అతడి ప్రతిభకు ఎక్సైడ్ ఇండియా, బిపిఎల్ ఇండియా బహుమతులు గెలుచుకున్నాడు, ఐ.ఐ.ఎం డైరెక్టర్ "మోస్ట్ ప్రోగ్రెస్సి" పతకం లభించింది. ఆ తరువాత సుబ్రమణియన్ మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ( ఎం.బి.ఎ ), చికాగో బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుండి ఫైనాన్షియల్ ఎకనామిక్స్ లో డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ (పిహెచ్ డి) పట్టా పొందాడు . లుయిగి జింగాలెస్, రఘురామ్ రాజన్ పర్యవేక్షణలో ఆయన పి.హెచ్.డి పూర్తి చేశాడు.[1]
వృత్తి
[మార్చు]భారతదేశం ప్రధాన ఆర్థిక, కార్పొరేట్ సంస్కరణల్లో భాగంగా సుబ్రమణియన్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిపుణుల కమిటీలలో పనిచేశాడు.[2] జేపీ మోర్గాన్ చేజ్, ఐసీఐసీఐ బ్యాంక్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ పనిచేశాడు.సుబ్రమణియన్ బంధన్ బ్యాంక్, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ బ్యాంక్ మేనేజ్ మెంట్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అకాడమీలో బోర్డు సభ్యుడిగా ఉన్నాడు, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలోని ఎమోరీ విశ్వవిద్యాలయం లో గోయిజుయెటా బిజినెస్ స్కూల్ లో ఫైనాన్స్ ఫ్యాకల్టీలో భా గంగా ఉన్నాడు.[3][4] సుబ్రమణియన్ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ISB)లో ఫైనాన్స్ అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నాడు.[5][6]
రచనలు
[మార్చు]సుబ్రమణియన్ జాతీయ , అంతర్జాతీయ జర్నల్స్ లో తమ వ్యాసాలను రాయడం జరిగింది. సహరచయితలతో కలిసి పుస్తకములు ( హ్యాండ్ బుక్స్ , మోనోగ్రాఫ్స్ ) కూడ రాయడం జరిగింది. [7]
మూలాలు
[మార్చు]- ↑ "Prof K Subramanian". www.iitk.ac.in. Retrieved 2022-04-29.
- ↑ "Krishnamurthy Subramanian appointed new Chief Economic Adviser". The Indian Express (in ఇంగ్లీష్). 2018-12-08. Retrieved 2022-04-29.
- ↑ Desk, B. Q. "Krishnamurthy Subramanian Appointed As The Next Chief Economic Adviser". BloombergQuint (in ఇంగ్లీష్). Retrieved 2022-04-29.
- ↑ "Govt appoints Krishnamurthy Subramanian as Chief Economic Adviser for 3 years". Moneycontrol (in ఇంగ్లీష్). Retrieved 2022-04-29.
- ↑ Team, BS Web (2018-12-07). "Academic Krishnamurthy Subramanian is India's new chief economic adviser". Business Standard India. Retrieved 2022-04-29.
- ↑ "Subramanian Krishnamurthy". www.isb.edu (in ఇంగ్లీష్). Retrieved 2022-04-29.
- ↑ "Krishnamurthy Subramanian" (PDF). brookings.edu/. Retrieved 29 April 2022.