Jump to content

కె. శివన్

వికీపీడియా నుండి
డా.కె.శివన్
ఇస్రో చైర్మన్
అంతరిక్ష పరిశోధనా సంస్థ’ (ఇస్రో) చైర్మన్‌
Assumed office
2018 జనవరి 15
అంతకు ముందు వారుఏ.ఎస్. కిరణ్ కుమార్
వ్యక్తిగత వివరాలు
జననం
కైలాసవడివు శివన్‌

1957 ఏప్రిల్ 14
మేల సరక్కలవిలై గ్రామం, నాగర్‌కోయిల్‌, కన్యాకుమారి జిల్లా, తమిళనాడు
పౌరసత్వంభారత దేశం
జాతీయతభారతీయుడు
తల్లిచెల్లమ్‌
తండ్రికైలాస వడివు
చదువుఐఐటీ, బాంబే (పి.హెచ్.డి )

కె. శివన్ భారత శాస్త్రవేత్త, 'భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ' (ఇస్రో) కు తొమ్మిదవ చైర్మన్‌. అతని పూర్తిపేరు కైలాసవడివు శివన్‌. ఇస్రో చైర్మన్ కాక మునుపు శివన్ విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రం డైరెక్టర్ గా విధులు నిర్వహించాడు.

జననం, విద్యాభ్యాసం

[మార్చు]

కైలాసవడివు శివన్‌ 1957 ఏప్రిల్ 14 న, మేల సరక్కలవిలై గ్రామం, నాగర్‌కోయిల్‌, కన్యాకుమారి జిల్లా, తమిళనాడు లో జన్మించాడు. శివన్ తండ్రి కైలాస వడివు వ్యవసాయం చేసేవాడు, తల్లి చెల్లమ్‌ గృహిణి. ఆయన స్థానిక ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి, ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాడు. నాగర్‌కోయిల్‌ హిందూ కాలేజీలో మేథమెటిక్స్‌తో బీఎస్సీ పూర్తి చేశాడు. 1980లో మద్రాస్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ లో ఏరోనాటికల్‌ ఇంజనీరింగ్‌ పూర్తి చేసి, 1982లో బెంగళూరు ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ( ఐఐఎస్‌ ) ఏరోస్పేస్‌ ఇంజినీరింగ్‌ పూర్తి చేశాడు.

వృత్తి జీవితం

[మార్చు]

1982లో ఇస్రో లో ఉద్యోగంలోకి చేరాడు. అక్కడ ఉద్యొగం చేస్తూనే బాంబే ఐఐటీలో ఏరోస్పేస్‌ ఇంజినీరింగ్‌లో పీహెచ్‌డీ కూడా పూర్తి చేశాడు. 2014లో ‘లిక్విడ్‌ ప్రొపెల్షన్‌ సిస్టమ్స్‌ సెంటర్‌’ డైరెక్టర్‌గా ఉన్నాడు. 2015లో ‘విక్రమ్‌ సారాభాయ్‌ అంతరిక్ష కేంద్రం’ డైరెక్టర్‌గా పని చేశాడు..[1]

మూలాలు

[మార్చు]
  1. ఆంధ్రజ్యోతి, ఓపెన్ పేజి (11 September 2019). "నా నిర్ణయం మార్చుకున్నా..!: ఇస్రో చైర్మన్ శివన్". www.andhrajyothy.com. Archived from the original on 11 సెప్టెంబరు 2019. Retrieved 11 September 2019.
"https://te.wikipedia.org/w/index.php?title=కె._శివన్&oldid=3797666" నుండి వెలికితీశారు