Jump to content

క్రిస్టియన్ ఆలివర్

వికీపీడియా నుండి
క్రిస్టియన్ ఆలివర్
ట్రిబెకా ఫిల్మ్ ఫెస్టివల్ 2008లో క్రిస్టియన్ ఆలివర్
జననం
క్రిస్టియన్ క్లెప్సర్

(1972-03-03)1972 మార్చి 3
సెల్లే, లోయర్ సాక్సోనీ, పశ్చిమ జర్మనీ
మరణం2024 జనవరి 4(2024-01-04) (వయసు 51)
కరేబియన్ సముద్రం
(బెక్వియా, సెయింట్ విన్సెంట్, గ్రెనడైన్స్ తీరంలో)
మరణ కారణంవిమాన ప్రమాదం
క్రియాశీల సంవత్సరాలు1994–2024
జీవిత భాగస్వామి
జెస్సికా మజూర్
(m. 2010; div. 2021)
పిల్లలు2, అన్నీక్ (10),
మడితా క్లెప్సర్ (12)

క్రిస్టియన్ ఆలివర్ (ఆంగ్లం: Christian Oliver; 1972 మార్చి 3 - 2024 జనవరి 4) జర్మన్ సంతతికి చెందిన ప్రముఖ హాలీవుడ్‌ నటుడు.[1] ఆయన ప్రధానంగా కోబ్రా 11 టెలివిజన్ సిరీస్‌లో తన పాత్రకు ప్రసిద్ధి చెందాడు.

కెరీర్

[మార్చు]

పశ్చిమ జర్మనీలోని సెల్లేలో క్రిస్టియన్ క్లెప్సర్‌గా ఆయన జన్మించి,[2] ఫ్రాంక్‌ఫర్ట్ ఆమ్ మెయిన్‌లో పెరిగాడు.[3] ఆయన మోడల్‌గా ఎదగడానికి యునైటెడ్ స్టేట్స్‌కు మకాం మార్చాడు. ఆ తరువాత, ఆయన న్యూయార్క్, లాస్ ఏంజిల్స్‌లలో కూడా నటన పాఠాలు నేర్చుకున్నాడు.[4] 2002 నుండి 2004 వరకు, ఆయన జర్మన్ యాక్షన్ టీవీ సిరీస్ కోబ్రా 11కు చెందిన 28 ఎపిసోడ్‌లలో నటించాడు.

మరణం

[మార్చు]

క్రిస్టియన్ ఆలివర్ 51 ఏళ్ల వయసులో 2024 జనవరి 4న విమాన ప్రమాదంలో తన ఇద్దరు కుమార్తెలతో సహా మరణించాడు.[5] వెకేషన్‌లో భాగంగా భారతకాలమానం ప్రకారం 2024 జనవరి 4న క్రిస్టియన్ ఆలివర్ తన కుటుంబంతో కలిసి గ్రెనడైన్స్‌లోని బెక్వియా ద్వీపం విమానాశ్రయం నుంచి సెయింట్ లూసియాకు బయలుదేరాడు. బెక్వియాలో టేక్‌ఆఫ్‌ అయిన కొద్దిసేపటికే విమానంలో సాంకేతిక లోపం ఏర్పడి కరీబియన్‌ సముద్రంలో కుప్పకూలింది.[6]

మూలాలు

[మార్చు]
  1. Waldon, Dave (2013-11-01). "Christian Oliver: Action figure". Appeal-Democrat. Archived from the original on 13 December 2019. Retrieved 2015-01-16.
  2. Moreau, Justin (5 January 2024). "'Speed Racer' Actor Christian Oliver and His Two Young Daughters Killed in Caribbean Plane Crash". Variety. Retrieved 5 January 2024.
  3. Archive (2024-01-05). "Actor Christian Oliver, two daughters killed in plane crash". New York Post (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2024-01-06.
  4. "Speed Racer star Christian Oliver and two daughters killed in plane crash". The Independent (in ఇంగ్లీష్). 2024-01-05. Archived from the original on 6 January 2024. Retrieved 2024-01-06.
  5. "ప్రమాదం.. కూతుళ్లతో సహా ప్రముఖ నటుడి దుర్మరణం | Hollywood Actor Christian Oliver Died His Daughters In Plane Crash - Sakshi". web.archive.org. 2024-01-06. Archived from the original on 2024-01-06. Retrieved 2024-01-06.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  6. Farrell, Paul (2024-01-05). "US tourist and two daughters killed along with American pilot in crash". Mail Online. Archived from the original on 5 January 2024. Retrieved 2024-01-05.Details here: