Jump to content

క్రేన్ (యంత్రం)

వికీపీడియా నుండి
భవన నిర్మాణాల్లో ఉపయోగించే భారీ క్రేను

క్రేన్ (ఆంగ్లం Crane) బరువైన వస్తువులను ఎత్తడానికి ఉపయోగించే ఒక యంత్రం. ఇవి చిన్న నిర్మాణాలు, రవాణాల మొదలుకొని పెద్ద ఆకాశ హర్మ్యాల నిర్మాణంలో విశేషంగా ఉపయోగపడతాయి. ప్రాచీన కాలంలో కుండలను, మట్టి పాత్రలను మంటల్లో కాల్చడానికి క్రేన్ల సహాయం తీసుకునే వారు. ట్రామెల్ సహాయంతో ఎత్తును సరి చేస్తూ ఉపయోగించే వారు.