గన్ను కృష్ణమూర్తి
గన్ను కృష్ణమూర్తి | |
---|---|
జననం | గన్ను కృష్ణమూర్తి 1945, సెప్టెంబర్ 2 వరంగల్ జిల్లా, నెక్కొండ |
మరణం | 2022, సెప్టెంబరు 9 కామారెడ్డి |
నివాస ప్రాంతం | కామారెడ్డి |
ఇతర పేర్లు | ఎక్స్ రే ప్రభంజనం యుగంధర్ భారతి |
వృత్తి | వాణిజ్య శాస్త్ర ఉపన్యాసకుడు |
ప్రసిద్ధి | కథా రచయిత కవి, విమర్శకుడు |
మతం | హిందూ |
తండ్రి | గన్ను వైకుంఠం |
తల్లి | గన్ను జగదాంబ |
గన్ను కృష్ణమూర్తి (1945, సెప్టెంబరు 2 - 2022, సెప్టెంబరు 9) పేరొందిన తెలంగాణ కవి, రచయిత, విమర్శకుడు.
జననం, విద్య
[మార్చు]ఇతడు 1945, సెప్టెంబర్ 2వ తేదీన గన్ను జగదాంబ, గన్ను వైకుంఠం దంపతులకు వరంగల్ జిల్లా, నెక్కొండ గ్రామంలో జన్మించాడు[1], [2]. ఇతడు వాణిజ్యశాస్త్రంలో స్నాతకోత్తర పట్టా పొందాడు. తరువాత ఎం.ఫిల్., పట్టాను కూడా సంపాదించాడు.
ఉద్యోగం
[మార్చు]ఇతడు కొంతకాలం సర్వే ఆఫ్ ఇండియాలో, మరికొంత కాలం తపాలాశాఖలో ఉద్యోగం చేశాడు. తరువాత వాణిజ్యశాస్త్ర ఉపన్యాసకుడిగా 30 సంవత్సరాలు పనిచేసి 2004లో పదవీ విరమణ చేశాడు.[3]
వ్యక్తిగత జీవితం
[మార్చు]ఆయనకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
రచనలు
[మార్చు]- నాదమే వేదమ్ వేదమే దేవమ్
- తపస్సు (కథా సంపుటి)
- కవితా కాళింది (కవితా సంపుటి)
- కత్తుల కౌగిలి (ప్రతీకాత్మక గేయకథాకావ్యము)
- అడవిపూలు (వచనకవితా సంపుటి)
- మహాప్రభంజనం (సాహిత్య విమర్శ, ప్రతివిమర్శన, స్పందన, ప్రతిస్పందన, పరిశోధన, లేఖ, గల్పిక ఇత్యాదులు)
- రాముడంటే ఎవరు? రామాయణమంటే ఏమిటి? : వాల్మీకి రామాయణం ఒక విశ్వరూప సందర్శనం
- యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ వారి వస్త్రాపహరణం
- అంతరంగ తరంగాలు (మినీ కవితా సంపుటి)
- అంతరంగం (మినీ కవితా సంపుటి)
- మహాసంకల్పం[4] (గేయకావ్యం)
- కృష్ణాయనం (పరిశోధన)
- కృష్ణవేదం (పద్యాలు)
- ఈ మట్టి నన్ను వెళ్ళనీదు
- ఒక మానవతా వృక్షచ్ఛాయలో
- ఏక్ లహర్ సాగర్‌కీ (కవిత)
- ఋషి హృదయం
- కోటి గొంతుకలు (కవితా సంకలనం, సంపాదకత్వం సూరారం శంకర్‌తో కలిసి)
కథలు
[మార్చు]ఇతని కథలు ఆంధ్రపత్రిక, ఆంధ్రభూమి, ఆంధ్రప్రభ, జాగృతి, పుస్తకం తదితర పత్రికలలో అచ్చయ్యాయి. ఇతడు వ్రాసిన కథల పాక్షిక జాబితా:
- అస్థిపంజరం
- ఆకాశం పందిరిక్రింద
- ఎంట్రన్స్ కమ్ ఎగ్జిట్
- ఏటికేతముగట్టి
- ఓ తాగుబోతు కథ
- కట్నం
- కలల టివి పెట్టి
- కోరిక
- గోచిగుడ్డ కథ
- చిట్టిరెడ్డి...
- చిరుగుల ప్రపంచం
- చిల్లర కథ
- చీపురు కట్ట
- చూస్కో నా తడాఖా
- జ్ఞానోదయం
- తపస్సు
- తీరిన కోరిక
- పండగ
- పాపం పందికూన
- పారిపోలేని చిలక
- పీడకల
- పొరపాటు
- బూర్జువా
- మనిషి-జంతువు
- మనుష్యులకోసం
- మల్లెతోట...
- మోడరన్ ఆర్ట్
- రాతిముక్క[5]
- విశ్వాసం
- సచ్చినోడి కథ
- సమ్మె
- సాక్షాత్కారం[6]
- సామాన్యుడి స్వగతం
అవార్డులు
[మార్చు]మరణం
[మార్చు]కృష్ణమూర్తి 2022 సెప్టెంబరు 7న కామారెడ్డిలో రోడ్డు దాటుతూ జరిగిన తీవ్రంగా గాయపడ్డాడు. హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 2022, సెప్టెంబరు 9న మరణించాడు.[9]
మూలాలు
[మార్చు]- ↑ మహాసంకల్పం గ్రంథంలో కందాళై రాఘవాచార్య పరిచయం నుండి[permanent dead link]
- ↑ కథానిలయం వెబ్‌సైట్‌లో గన్ను కృష్ణమూర్తి వివరాలు[permanent dead link]
- ↑ కొత్త కోణాన్ని ఆవిష్కరించా - గన్ను కృష్ణమూర్తి, నవతెలంగాణ
- ↑ అంతర్జాలంలో మహాసంకల్పం[permanent dead link]
- ↑ "రాతిముక్క కథ" (PDF). Archived from the original (PDF) on 2013-05-11. Retrieved 2018-02-04.
- ↑ సాక్షాత్కారం[permanent dead link]
- ↑ "44 మందికి తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారాలు". EENADU. 2022-09-03. Archived from the original on 2022-09-03. Retrieved 2022-09-07.
- ↑ "Telugu University: 44 మందికి తెలుగు వర్సిటీ కీర్తి పురస్కారాలు". Sakshi Education. 2022-09-03. Archived from the original on 2022-09-07. Retrieved 2022-09-07.
- ↑ "కవి గన్ను కృష్ణమూర్తి కన్నుమూత". www.andhrajyothy.com (in ఇంగ్లీష్). 2022-09-10. Archived from the original on 2022-09-10. Retrieved 2022-09-10.