గుమ్మటం
గుమ్మటం ను ఆంగ్లంలో డోమ్ అనీ ఉర్దూ, పార్శీ భాషలో గుంబద్ (گنبد) అనీ అంటారు. ఒక గది యొక్క సగం పైభాగాన గోపురం ఆకారంలో నిర్మించి ఆ గోళాకారపు నిర్మాణ కింది భాగం బోలుగా (ఖాళీ) ఉన్నట్లయితే ఈ గోళాకారపు నిర్మాణ భాగాన్ని గుమ్మటం లేక డోం అంటారు. చరిత్రలో అనేక చారిత్రక కట్టడాలకు కప్పుగా గుమ్మట నిర్మాణశైలిని ఉపయోగించారు. గోపురం ఆకారంలో నిర్మించిన ఈ డోం నిర్మాణమునకు వివిధ రకాల పదార్థాలను ఉపయోగించారు. అర్ధ వృత్తాకారంలో నిర్మించిన నిరాడంబరమైన భవనాలు, సమాధులను ప్రాచీన మధ్య ప్రాచ్యంలో కనుగొన్నారు. రోమన్లు ఆలయాలను, ప్రభుత్వ భవంతులను అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో డోం ఆకారం వచ్చేలా నిర్మించడం ప్రారంభించడాన్ని రోమన్ భవన నిర్మాణ విప్లవంగా చెప్పవచ్చు. ఒక చదరపు ఆకారపు గది నుండి వృత్తాకార గోపురం వచ్చేలా నిర్మించడాన్ని పురాతన పర్షియన్లు కనిపెట్టారు. సస్సానిద్ సామ్రాజ్యం, పర్షియాలో భారీస్థాయి అర్ధ వృత్తాకార భవన నిర్మాణాలను ప్రారంభించారు, వాటిలో కొన్ని ప్యాలెస్ ఆఫ్ అర్దాషిర్, సర్‍వెస్తాన్, గాలెహ్ దోఖ్తర్.
గుంబద్
[మార్చు]గుంబద్ : డూమ్ లేదా డోమ్ లేదా గుమ్మటం. సాంప్రదాయిక పర్షియన్ నిర్మాణశైలిలో గోంబద్ (ఫార్సీ: گنبد) అని, అరబ్బీ శైలిలోనూ గుంబద్ అని, టర్కీ, సెల్జుక్ శైలిలో కుంబెత్ అనియూ వ్యవహరిస్తారు.
గుంబద్ ల చరిత్ర, ఇస్లామీయ చరిత్రకు పూర్వమే పర్షియా (నేటి ఇరాన్) లో కానవస్తుంది. పార్థియన్ల కాలంలోనే ఈ గుమ్మటాల సంప్రదాయం వుండేది. ససానిద్ ల కాలంలో ఇది సాంప్రదాయకంగా మారింది.
గుంబద్ లేదా గుమ్మటం ఒక స్తూపాకారంలోగల నిర్మాణం. బౌద్ధ నిర్మాణాలలో స్థూపాల మాదిరి నిర్మాణమే ఈ గుంబద్.
ఇస్లాంకు పూర్వం, ఇస్లాంకు తరువాత ముస్లిముల నిర్మాణ శైలిలో సాధారణంగా కానవచ్చే నిర్మాణాకృతి. మస్జిద్ లలోనూ, దర్గాలలోనూ, సమాధులకునూ ఉపయోగించే సాధారణ నిర్మాణాకృతి ఈ గుంబద్. తాజ్ మహల్ నిర్మాణంలోనూ ఈ గుంబద్ ప్రధాన నిర్మాణం.
ఆసియా
[మార్చు]గుంబద్ ఎ ఖిజ్రా లేదా గుంబద్ ఎ ఖజ్రా, ఇది మస్జిద్ ఎ నబవి యొక్క పచ్చ గుమ్మటం. గుంబద్ అనగా గుమ్మటం, ఖజ్రా అనగా ఆకుపచ్చని, వెరసి పచ్చ గుమ్మటం.
భారత్
[మార్చు]తాజ్ మహల్
[మార్చు]షాజహాన్, ముంతాజ్ మహల్ కొరకు ఆగ్రాలో కట్టిన సమాధి.
గోల్ గుంబద్
[మార్చు]గోల్ గుంబద్ (Kannada: ಗೋಲ ಗುಮ್ಮಟ) (Urdu: گول گمبد) కర్ణాటక, బీజాపూర్ లోగల ముహమ్మద్ ఆదిల్ షా యొక్క సమాధి. ఇది ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద గుంబద్. మొదటిది, టర్కీ లోని హాజియా సోఫియా.
గోల్ గుమ్మా
[మార్చు]గోల్ గుమ్మా అనునది, కర్నూలు నవాబ్ యొక్క సమాధి.
ఇతరములు
[మార్చు]చిత్రమాలిక
[మార్చు]-
A compound dome (red) with pendentives (yellow) from a sphere of greater radius than the dome.
-
Painting by Giovanni Paolo Pannini of the Pantheon in Rome, Italy, after its conversion to a church.
-
జెరూసలెం లోని డూమ్ ఆఫ్ రాక్