చండి
చండి | |
---|---|
దేవనాగరి | चण्डी |
అనుబంధం | దేవి, ఆది పరాశక్తి |
మంత్రం | ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్చే |
భర్త / భార్య | అష్ట భైరవ |
వాహనం | సింహం |
చండి లేదా చండిక ఒక హిందూ దేవత. ఈమె మహాలక్ష్మి, మహా సరస్వతి, మహాకాళి స్వరూపిణి, పరదేవతా స్వరూపం.[1] ఇచ్ఛా శక్తి, జ్ఞానశక్తి, క్రియా శక్తిల కలయిక. పార్వతి లేదా ఆది పరాశక్తి యొక్క రౌద్ర రూపంగానూ అభివర్ణించబడింది. శ్వేతాశ్వతరోపనిషత్తు ప్రకారం పరాశక్తి అంటే బ్రహ్మమనియే. ఈ పరాశక్తి రూపమైన చండి కూడా బ్రహ్మస్వరూపమే. దేవి మహత్మ్యంలో పలుచోట్ల ఆమె గురించిన ప్రస్తావన ఉంది.
పదవ్యుత్పత్తి
[మార్చు]చండి అనే పదం చండ అనే సంస్కృత పదం నుంచి వచ్చింది. సంస్కృతంలో చండ అంటే ఛేదించగల అని అర్థం.[2]
చండీ హోమం
[మార్చు]హిందూ సంప్రదాయాల్లో చండీ హోమానికి విశేష ప్రాధాన్యత ఉంది. ఈ హోమాన్ని భారతదేశమంతటా వేర్వేరు సమయాల్లో, ముఖ్యంగా నవరాత్రుల సమయంలో ఎక్కువగా నిర్వహిస్తూ ఉంటారు. ఈ హోమం జరిపేటప్పుడు దుర్గ సప్తశతిలోని మంత్రాల వల్లిస్తారు. దీని తరువాత నవాక్షరి మంత్రం, కుమారి పూజ, సువాసిని పూజల్లాంటివి చేయడం కూడా పరిపాటి.[3]
మూలాలు
[మార్చు]- ↑ పోతుకూచి, శ్రీరామమూర్తి (1982). శ్రీచండీ సప్తశతి మీమాంస. తెనాలి: సాధన గ్రంథ మండలి. Archived from the original on 5 సెప్టెంబరు 2017. Retrieved 12 July 2017.
- ↑ Learn the Worship of Goddess Chandi
- ↑ Brown, C. Mackenzie (1990). The Triumph of the Goddess: The Canonical Models and Theological Visions of the Devi-Bhagavata Purana. Albany: State University of New York Press