జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, చంద్రపాలెం
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, చంద్రపాలెం | |
---|---|
స్థానం | |
మధురవాడ, చంద్రంపాలెం, విశాఖపట్నం , | |
సమాచారం | |
రకం | ప్రభుత్వ పాఠశాల |
స్థాపన | 1979 |
ప్రధానోపాధ్యాయులు | రాజబాబు |
బోధనా సిబ్బంది | 88 (2021 సెప్టెంబరు 3 నాటికి) |
విద్యార్ధుల సంఖ్య | 4019 (2021 సెప్టెంబరు 3 నాటికి) |
చంద్రంపాలెం ప్రభుత్వ పాఠశాల, మధురవాడ చంద్రంపాలెంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్,1979లో స్థాపించబడింది.ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ విద్యార్థులు కలిగిన పాఠశాల.[1]ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు తెలుగు ఆంగ్ల మాధ్యమాల్లో విద్యాబోధన జరుగుతున్న చంద్రంపాలెం జడ్పీ ఉన్నత పాఠశాల అన్నింటా ఆదర్శంగా నిలుస్తోంది.2012-15 విద్యా సంవత్సరంలో 1731 మంది విద్యార్థులు ఉండగా 2021 నాటికి 4 వేల పైగా పెరిగారు. నగరానికి 15 కి.మీ. దూరంలో ఉన్న ఈ పాఠశాలలో 30 గ్రామాల విద్యార్థులు చదువుతున్నారు.
చరిత్ర
[మార్చు]ఈ పాఠశాల 1979లో 100 మంది విద్యార్థులతో ఆవిర్భవించింది.నేటికి ఈ స్కూల్‌లో 4 వేల మందికి పైగా విద్యార్థులు చదువుకుంటున్నారు.అత్యధిక మంది పిల్లలు చదువుతున్న ప్రభుత్వ పాఠశాలగా పేరు తెచ్చుకుంది. 2021 సెప్టెంబరు 3 నాటికి ఇక్కడ విద్యార్థుల సంఖ్య 4019. చంద్రంపాలెం పాఠశాలలో చేర్పించేందుకు విశాఖ నగర పరిధిలో ఉన్న 36 కార్పొరేట్ పాఠశాలల నుంచి 720 మందికిపైగా విద్యార్థులు ఇక్కడ చేరారు. ఇక్కడ ఎక్కువగా దిగువ మధ్య తరగతి, పేద కుటుంబాలకు చెందినవారు ఉంటారు. వీరికి తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలల్లో చదివించే ఆర్థిక స్థోమత లేదు. అదేసమయంలో చంద్రంపాలెం పాఠశాలలో మౌలిక సదుపాయాలు, పాఠ్యాంశాల బోధన ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ఉండడంతో మధురవాడ సహా చుట్టుపక్కల ప్రాంతాల వారు ఈ పాఠశాలకే ప్రాధాన్యం ఇస్తున్నారు.[2]దీంతో ప్రతి ఏటా పాఠశాలలో చేరే విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలను కార్పొరేట్ స్కూల్ మాన్పించి ఈ ప్రభుత్వ బడికి పంపుతున్నారు. ప్రతి సంవత్సరం కొత్త అడ్మిషన్లు 80 శాతం పైగా ఆరోతరగతిలోనే ఉంటాయి.[3][4][5]
సౌకర్యాలు
[మార్చు]ఈ పాఠశాలలో 50 కంప్యూటర్లతో పెద్ద ల్యాబ్ ఉంది. ఇక్కడ తరగతులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా నిర్వహిస్తారు.అలాగే ప్రస్తుతం సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో విద్యార్థి దశ నుంచే సైబర్ టెక్నాలజీపై అవగాహన కల్పించేందుకు సైబర్ స్మార్ట్ పేరుతో తరగతులు నిర్వహిస్తున్నారు. ఇ-మెంటరింగ్ పేరుతో ప్రపంచంలోని ఏ సబ్జెట్ ఎక్స్‌పర్ట్‌తోనైనా మాట్లాడే అన్‌లైన్ ప్రోగ్రాం సౌకర్యం కూడా ఉంది.సంగీత వాయిద్య పరికరాలపై శిక్షణ ఇస్తున్నారు.
మూలాలు
[మార్చు]- ↑ May 13, Umamaheswara Rao / TNN /; 2019; Ist, 09:15. "In Chandrampalem, ZP school is a shining model of excellence | Visakhapatnam News - Times of India". The Times of India. Retrieved 2021-09-05.
{{cite web}}
:|last2=
has numeric name (help)CS1 maint: numeric names: authors list (link) - ↑ "సర్కారీ స్కూల్ కిటకిట!". andhrajyothy. Retrieved 2021-09-05.
- ↑ "చంద్రపాలెం ప్రభుత్వ పాఠశాలకు ఆదర్శం". ఈనాడు ఆంధ్ర ప్రదేశ్.
- ↑ Rao, K. Srinivasa (2019-08-05). "విశాఖపట్నం ప్రభుత్వ పాఠశాలకు చాలా డిమాండ్ ఉంది". The Hindu. ISSN 0971-751X. Retrieved 2021-09-05.
- ↑ "చంద్రంపాలెం హైస్కూల్: 'కార్పొరేట్ స్కూల్ మాన్పించి ఈ సర్కారు బడికి పంపిస్తున్నారు'". BBC News తెలుగు. Retrieved 2021-09-05.