జమ్మి కోనేటిరావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జమ్మి కోనేటిరావు

జమ్మి కోనేటిరావు తెలుగులో విజ్ఞానశాస్త్ర విషయాలపై రచనలు చేసే అతికొద్ది మంది రచయితలలో ఒకడు.

విశేషాలు[మార్చు]

ఇతడు 1929, మార్చి 1వ తేదీన జన్మించాడు. ఇతడు విశాఖపట్టణంకు చెందినవాడు. వృత్తిరీత్యా జంతుశాస్త్ర అధ్యాపకుడు. తెలుగు సైన్సు రచయితల సంఘం[Science Writers Association in Telugu (SWATI) ]ను స్థాపించాడు. తరువాత ఈ సంస్థ న్యూఢిల్లీలోని ఇండియన్ సైన్స్ రైటర్స్ అసోసియేషన్ (ISWA) కు అనుబంధంగా మారింది. అతని భార్య పేరుమీద జమ్మి శకుంతల అవార్డును నెలకొల్పి ప్రతియేటా ఒక సైన్సు రచయితకు జాతీయ సైన్స్ దినం రోజు ఆ అవార్డును ప్రదానం చేశాడు. ఈ అవార్డును పొందిన వారిలో కె.ఆర్.కె.మోహన్, మహీధర నళినీమోహన్, ఆర్.ఎల్.ఎన్.శాస్త్రి, బి.జి.వి.నరసింహారావు, సి.వి.సర్వేశ్వరశర్మ మొదలైనవారు ఉన్నారు. ఇతడు 80కి పైగా తెలుగులో శాస్త్ర సంబంధమైన గ్రంథాలు రచించాడు. 1954నుండి ఇతని రచనావ్యాసంగం మొదలై ఇప్పటి వరకు దాదాపు అన్ని ప్రముఖ ఇంగ్లీషు, తెలుగు దిన, వార, మాస, త్రైమాస పత్రికలలో వెయ్యికి పైగా వైజ్ఞానిక వ్యాసాలు వ్రాశాడు. వందకు పైగా రేడియో ప్రసంగాలు చేశాడు.

శీర్షికలు[మార్చు]

ఇతడు వివిధ పత్రికలలో అనేక శీర్షికలు నిర్వహించాడు. వాటిలో కొన్ని ఈ విధంగా ఉన్నాయి.

  • రంగులరాట్నం
  • తెలుసుకుందాం
  • విజ్ఞానవీచికలు
  • ప్రాణిపథం
  • సర్పవేదం
  • సర్పసంహిత
  • మానవ పరిణామము
  • ఆటలో అరటిపండు
  • మీ ఇంగ్లీషుకు మెరుగు
  • వన్యజీవులు
  • అస్తవ్యస్తాక్షరి
  • వినువీధి

రచనలు[మార్చు]

  1. పాడి పరిశ్రమ<
  2. జంతుపరిణామము
  3. కోళ్ల పెంపకం
  4. జంతు శాస్త్రం ఇంగ్లీషు - తెలుగు నిఘంటువు
  5. ఖగోళ శాస్త్రము - దాని చరిత్ర
  6. విజ్ఞానసర్వస్వ ఖగోళ శాస్త్ర నిఘంటువు
  7. విజ్ఞానసర్వస్వ వైద్యనిఘంటువు
  8. సూక్ష్మక్రిమి అన్వేషకులు (అనువాదం)
  9. కొన్ని సామాన్యవ్యాధులు
  10. విజ్ఞాన విశేషాలు

అనువాదాలు[మార్చు]

  1. ఎస్. ప్రధాన్. పంటతెగుళ్లు-కీటకాలు. Translated by జమ్మి కోనేటిరావు. నేషనల్ బుక్ ట్రస్ట్. Retrieved 2020-07-11.

పురస్కారాలు[మార్చు]

  • సి.బి.శర్మ నేషనల్ అవార్డ్ ఫర్ సైన్స్ కమ్యూనికేషన్స్ - 2006

మూలాలు[మార్చు]

ఇవి కూడా చదవండి[మార్చు]