జాతీయ బాలికా దినోత్సవం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జాతీయ బాలికా దినోత్సవం
జాతీయ బాలికా దినోత్సవం
2009లో అప్పటి మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి రేణుకా చౌదరి న్యూ ఢిల్లీలో జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా ఆడపిల్లల సంక్షేమం కోసం కొత్త కార్యక్రమాలు, లోగో, క్యాలెండర్‌ను విడుదల చేశారు.
జరుపుకొనేవారుభారతదేశం
ప్రాముఖ్యతభారతదేశంలో ఆడపిల్లలు ఎదుర్కొంటున్న విద్య, పోషకాహారం, బాల్య వివాహాలు, చట్టపరమైన హక్కులు , వైద్య సంరక్షణ, రక్షణ, గౌరవం వంటి సమస్యలపై అవగాహన కల్పించడం.
ప్రారంభం2008
జరుపుకొనే రోజు24 జనవరి
ఆవృత్తివార్షికం
అనుకూలనంప్రతి ఏటా ఇదే రోజు

జాతీయ బాలికా దినోత్సవం (ఆంగ్లం: National Girl Child Day) ప్రతి సంవత్సరం జనవరి 24న నిర్వహించబడుతుంది.[1] సమాజంలో బాలికల సంరక్షణ, హక్కులు, ఆరోగ్యం, విద్య, సామాజిక ఎదుగుదల మొదలైన అంశాలపై ఈ బాలికా దినోత్సవం రోజున అవగాహన కల్పిస్తారు.

ప్రారంభం[మార్చు]

ఆడపిల్ల అనగానే సమాజంలో చిన్నచూపు చూస్తున్నారు. అంతేకాకుండా కడుపులో బిడ్డ ఆడపిల్ల అని తెలియగానే భ్రూణ హత్యలకు పాల్పడుతున్నారు. పుట్టిన తరువాత అనేక ఆంక్షలు విధిస్తున్నారు. వాటిని నిర్మూలించి ఆడపిల్లలపై ప్రత్యేక దృష్టిసారించే దిశగా భారత ప్రభుత్వం ‘నేషనల్ గర్ల్స్ డెవలప్మెంట్ మిషన్‘ పేరుతో ఒక కార్యక్రమం రూపొందించింది. అందులో భాగంగా 2008లో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంతో జాతీయ బాలికా దినోత్సవాన్ని ప్రారంభించడం జరిగింది.[2]

కార్యక్రమాలు[మార్చు]

సమాజంలో బాలికలు ఎదుర్కొన్న సమస్యలు గురించి ప్రజలలో అవగాహన పెంచడానికి జరుపుకుంటారు. బాలిక శిశువు గురించి అసమానత్వం విద్య, పోషణ, చట్టపరమైన హక్కులు, వైద్య సంరక్షణ, రక్షణ, గౌరవం, బాల్య వివాహంల గురించి అవగాహన కార్యక్రమాలు చేస్తారు.[3]

సమాజంలో మహిళల హోదాను ప్రోత్సహించటానికి జరుపుకుంటారు. అమ్మాయిలు సాధారణంగా వారి జీవితంలో ఎదుర్కొంటున్న వివిధ రకాల సాంఘిక వివక్ష, దోపిడీని తొలగించడం చాలా అవసరం. సమాజంలో మహిళల అవసరం గురించి అవగాహన పెంచడానికి, వివిధ రాజకీయ, కమ్యూనిటీ నాయకులు సమాన విద్య, ప్రాథమిక స్వేచ్ఛ కోసం అమ్మాయిలు గురించి ప్రజలకు చెప్పడం జరుగుతుంది .

ఇవికూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. ప్రజాశక్తి, ఎడిటోరియల్ (23 January 2019). "బాలికలకు భరోసా!". వాసిలి సురేష్‌. Archived from the original on 25 January 2019. Retrieved 25 January 2019.
  2. నమస్తే తెలంగాణ, వార్తలు (24 January 2019). "నేడు జాతీయ బాలికల దినోత్సవం". Archived from the original on 25 January 2019. Retrieved 25 January 2019.
  3. ప్రజాశక్తి, జాతీయం (25 January 2019). "మెరుగైన రేపటి భవితవ్యం కోసం బాలికలకు సాధికారత". Archived from the original on 25 January 2019. Retrieved 25 January 2019.