జాతీయ వినియోగదారుల హక్కుల పరిరక్షణ కమిషన్
స్వరూపం
జాతీయ వినియోగదారుల హక్కుల పరిరక్షణ కమిషన్ | |
---|---|
సంస్థ అవలోకనం | |
స్థాపనం | 1988[1] |
అధికార పరిధి | భారతదేశం |
ప్రధాన కార్యాలయం | న్యూఢిల్లీ[2] |
ఏజెన్సీ కార్యనిర్వాహకుడు/ | జస్టిస్ ఆర్.కె. అగర్వాల్, ఛైర్మన్ |
జాతీయ వినియోగదారుల హక్కుల పరిరక్షణ కమిషన్ (ఆంగ్లం:National Consumer Disputes Redressal Commission) 1986లో చట్టం అమల్లోకి వచ్చి కమిషన్ 1988లో ఏర్పడింది. ఇది శాసనబద్ధమైన సంస్థ. 2024 నాటికి, పాట్నా, మద్రాస్ హైకోర్టుల మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అమరేశ్వర్ ప్రతాప్ సాహి నేతృత్వం వహిస్తున్నారు.[1]
నిర్మాణం, నియామకం, పదవీ కాలం
[మార్చు]జాతీయ వినియోగదారుల హక్కుల పరిరక్షణ కమిషన్‌లో ఒక చైర్మన్, 10 మంది సభ్యులు ఉంటారు. వీరి పదవీ కాలం 3 సంవత్సరాలు. వీరి నియామకం, తొలగింపు అధికారాలు కేంద్ర ప్రభుత్వానికే ఉంటాయి.[3]
విధులు
[మార్చు]- హానికరమైన వస్తువులు లేదా సేవల నుంచి వినియోగదారులను రక్షించడం
- కోటి రూపాయల ఆస్తి విలువ గల వస్తువులపై కమిషన్ విచారిస్తుంది.
- విచారణలో ఏకీకృత విచారణ పద్ధతిని అమలు చేయడం.
- ఈ కమిషన్ వినియోగదారులకు ఆరు హక్కులను కల్పించాలి.
1.భద్రతా హక్కు 2.అవగాహన హక్కు 3. ఎంపిక హక్కు 4. సమాచారం తెలుసుకునే హక్కు 5.సమస్య పరిష్కారం హక్కు 6. విన్నవించుకునే హక్కు [4]
జరిమానాలు, శిక్షలు
[మార్చు]- వాణిజ్య ప్రకటన ద్వారా తప్పుదోవ పట్టిస్తే రూ.10 లక్షల జరిమానా, రెండేండ్ల జైలు
- రెండోసారి నేరం రుజువైతే రూ.50 లక్షల జరిమానాతో పాటు జైలు శిక్ష
- ఆఫ్‌లైన్‌తో పాటు ఆన్‌లైన్ లావాదేవీలకు చట్టం వర్తింపు
- ఎలక్ట్రానిక్ మార్గాలు, టెలీషాపింగ్, ప్రత్యక్ష అమ్మకం, బహుళస్థాయి మార్కెటింగ్ వివాదాల పరిష్కారం
ఫీజులు
[మార్చు]- రూ.లక్ష నుంచి 5లక్షల లోపు విలువైన వివాదాలకు ఫీజు ఉండదు
- రూ.5 నుంచి 10లక్షల లోపు రూ.200
- రూ.10నుంచి రూ.20 లక్షలలోపు రూ.400
- రూ.20లక్షల నుంచి రూ.50లక్షల వరకు రూ.వెయ్యి
- రూ.50లక్షల నుంచి రూ.కోటి వరకు రూ.2 వేల నామమాత్రపు ఫీజు మాత్రమే వినియోగదారుడు చెల్లించాలి.[5]
ఇవి కూడా చుడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 "NCDRC Website Home Page". NCDRC. Archived from the original on 21 July 2011. Retrieved 18 December 2012.
- ↑ "NCDRC - Contact Info". NCDRC. Archived from the original on 28 జనవరి 2013. Retrieved 25 ఆగస్టు 2021.
- ↑ Andrajyothy (2 January 2018). "వినియోగదారుల హక్కులివే..తెలుసుకుంటే చిక్కులుండవు!". Archived from the original on 25 ఆగస్టు 2021. Retrieved 25 August 2021.
- ↑ Sakshi (2015). "జాతీయ కమిషన్లు-విధులు" (in ఇంగ్లీష్). Archived from the original on 24 ఆగస్టు 2021. Retrieved 24 August 2021.
- ↑ Namasthe Telangana (15 March 2021). "హక్కుల కోసం న్యాయపోరాటం". Archived from the original on 25 ఆగస్టు 2021. Retrieved 25 August 2021.