జి. ఎం. సి. బాలయోగి క్రీడాస్థలము
Location | హైదరాబాదు తెలంగాణ |
---|---|
Owner | Sports Authority of Telangana |
Surface | గడ్డి |
జి. ఎం. సి. బాలయోగి క్రీడాస్థలము (English: G. M. C. Balayogi Athletic Stadium) భారతదేశం లోణి తెలంగాణ రాష్ట్ర ముఖ్య పట్టణమైన హైదరాబాదు లోని క్రీడా స్టేడియం. దీని సామర్థ్యం 30,000 మంది వీక్షకులకు అందుబాటులో ఉంటుంది.[1]
క్రీడాస్థలము
[మార్చు]ఇది ఒక అధునాతన క్రీడాస్థలము. ఇందులో 8 వరుసల సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్ ఉంటుంది. ఇందులో 4 వరుసల సింథటిక్ ప్రాక్టీసు ట్రాక్ ఉంటుంది. దీని ఉపయోగం రాత్రి పగలు జరిగే క్రీడలకు నవీన కాంతులను వెదజల్లడమే. ఈ స్టేడియం పేరును హెలీకాప్టర్ ప్రమాదంలో మరణించిన మాజీ లోక్ సభ స్పీకరు జి.ఎం.సి.బాలయోగి జ్ఞాపకార్థం పెట్టబడింది.
2003 ఆఫ్రో ఆసియన్ క్రీడలు ఈ స్టేడియంలోనే జరిగాయి. ఈ క్రీడల ప్రారంభ వేడుకలను సుమారు 30,000 మంది ప్రజలు వీక్షించారు. ఈ ప్రారంభ వేడుకలు సుమారు 2 గంటల 40 నిమిషా ల అధ్బుతమైన లేసర్ షోతో కూడుకొని జరిగినవి.
17°26′46″N 78°20′39″E / 17.446241°N 78.344214°E
2010 డిసెంబరు 26 న 2800 మంది కూచిపూడి నాట్యకారులు గిన్నిస్ బుక్లో స్థానం సంపాదించుటకు విశేషమైన ప్రదర్శనను ఈ స్టేడియం లోనే నిర్వహించారు.[2]
తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో ఈ స్టేడియం పేరును భాగ్యరెడ్డి వర్మ క్రీడామైదానముగా నామకరణం చేశారు.
మూలాలు
[మార్చు]- ↑ "www.worldstadiums.com". Archived from the original on 2011-09-24. Retrieved 2014-10-09.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2012-10-17. Retrieved 2014-10-09.