జిల్లా కేంద్ర గ్రంథాలయం ఆదిలాబాద్
జిల్లా గ్రంథాలయ సంస్థ ఆదిలాబాదు తెలంగాణ రాష్ట్రం, ఆదిలాబాదు జిల్లా [1] భుక్తా పూర్ లోని నేతాజీచౌక్ సమీపంలో ఈ జిల్లా గ్రంథాలయం సంస్థ ఉంది. దినిని 1958లో స్థాపించారు. సంచాలకులు పౌర గ్రంథాలయ శాఖా హైదరాబాదు ద్వారా స్థాపించబడినది.జిల్లా గ్రంథాలయ సంస్థ ఆదిలాబాద్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్ర గ్రంథాలయము,ప్రతి మండల కేంద్రాలలో శాఖా గ్రంథాలయాలను ఏర్పాటు చేసినారు.జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి పర్యవేక్షణలో ఈ గ్రంథాలయాలు నిర్వహించబడతాయి[2][3][4][5].
సంకేతాక్షరం | DLA (District Librorary Adilabad) |
---|---|
స్థాపన | 1958 |
ప్రధాన కార్యాలయాలు | ఆదిలాబాద్,తెలంగాణ ఇండియా 504001 |
కార్యస్థానం |
|
ఉత్పాదనs | గ్రంధాలయ సర్వస్వము మాసపత్రిక, పుస్తకాలు, సేవలు |
సేవలు | గ్రంథాలయ సంబంధిత కార్యక్రమాలు, సేవలు |
సభ్యులు | జీవితకాల, వార్షిక, సంస్థాగత, వ్యక్తిగత సభ్యులు |
అధికారిక భాష | తెలుగు |
అధ్యక్షుడు | డా. ఎస్.ఎల్. వైద్య తొలి అధ్యక్షుడు |
కార్యదర్శి | కె.రామారావు తొలి కార్యదర్శి |
బి.సురేందర్ రావు | డా.ఎన్.వేణుగోపాలాచారి |
ముఖ్యమైన వ్యక్తులు | సయ్యదలీ హాష్మి,నాగేశ్వరరావు,పి .సుదర్శన్,పి.బాలక్రిష్ణా రెడ్డి,లక్ష్మీ కాంతారావు,మునీరున్నిసా బేగం,కె.దామోదరరావు |
సిబ్బంది | (ఏడుగురు)డిప్యూటీ లైబ్రేరియన్,అసిస్టెంటు లైబ్రేరియన్,సీనియర్ అసిస్టెంట్,జూనియర్ అసిస్టెంట్,రికార్డ్ అసిస్టెంట్,అటెండర్లు,వాచ్ మెన్లు |
చరిత్ర
[మార్చు]ఆదిలాబాద్ జిల్లాలో 1948 లో గ్రంథాలయోద్యమ ప్రభావము లేదు. 1955 లో హైదరాబాద్ పబ్లిక్ లైబ్రర్సీ చట్టం ఆమోదించడం తో 1957 ఈ బిల్లు లో అమలులో నికి వచ్చింది. 1958 లో ఆదిలాబాద్ జిల్లా గ్రంథాలయ ఉద్యమం ప్రారంభమైంది. ప్రాంతీయ గ్రంథాలయాధికారి అధ్వర్యంలో గ్రంథాలయాల స్థాపన,నిర్వహణ,అభివృద్ది,బాధ్యత నిర్వహించు చుండేను. జిల్లా గ్రంథాలయం సంస్థ తొలి సారిగా మూడు శాఖాలుగా ఏర్పాటు చేశారు. 1960 లో ఈ జిల్లా కేంద్ర గ్రంథాలయానికి ఎన్నికలు జరిగాయి.డా. ఎస్.ఎల్.వైద్య అధ్యక్షులుగా,కె.రామారావు ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైనారు. 1962 లో జరిగిన ఎన్నికల్లో అధ్యక్షులుగా ఎన్.బాలకిషన్ రావు, ఎన్నికై ఐదు సంవత్సరాలు చైర్మెన్ గా పదవీ బాధ్యతలు నిర్వహించారు. 1967 లో జరిగిన ఎన్నికల్లో బి.సురేందర్ రావు చైర్మెన్ గా ఎన్నికై ఐదు సంవత్సరాలు పదవీ బాధ్యతలు నిర్వహించారు. పై ముగ్గురు చైర్మెన్ కాలంలో ఈ ఆదిలాబాద్ గ్రంథాలయ సంస్థ అభివృద్ధి చెందింది.1984 లో డా. వేణుగోపాలాచారి[6],గ్రంథాలయ సంస్థకు మెరుగుపరచుటలోను చాలా కృషి చేశారా. తదనంతరం ఏర్పడిన తెలుగు దేశం ప్రభుత్వం నిర్ణయానుసారంగా జిల్లా గ్రంథాలయ సంస్థలకు నామినేటెడ్ చైర్మెన్ ల నియిమకం జరిగింది.1988 జూన్ 3 న డా.ఎ.వి.దేవరాజుగారు చైర్మెన్ గా నియమితులైయ్యారు[7].
పుస్తకాలు
[మార్చు]ఈ ఆదిలాబాద్ గ్రంథాలయ సంస్థకు రాజారామ్ మోహన్ రాయ్ ఫౌండేషన్ వారు గ్రంథాలయానికి కోన్ని గ్రంథాలు సరఫరా చేశారు. దానితో పాతవి కొత్తవి మొత్తం గ్రంథాలు కలిపి 54 వేల పై చిలుకు గ్రంథాలున్నాయి. అవి తెలుగు,హిందీ,ఆంగ్లం, ఉర్దు,సంస్కృతం,మరాఠీ, భాషలందు ఉన్నవి. దానితో పాటు గృపు వన్, టూ, వివిధ పోటి పరీక్షలకు ఉపయోగ పడే పుస్తకాలు కూడా అందుబాటులో ఉంటాయి. దిన పత్రికలు,వారపత్రికలు,పక్ష పత్రికలు,మాస పత్రికలు ,వివిధ భాషలో బాల సాహితీ గ్రంథాలు, రిఫరెన్ను గ్రంథాములు పాఠకులకు ,విద్యార్థుల అవసరమైన కాఫిలు, పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి[8].
మూలాలు
[మార్చు]- ↑ Today, Telangana (2022-03-22). "Telangana: Libraries become reliable destinations to job seekers". Telangana Today (in ఇంగ్లీష్). Retrieved 2024-07-21.
- ↑ "దశాబ్ధాల కాలం నాటి గ్రంథాలయం ఇదే.. కచ్చితంగా తెలుసుకోవాల్సిందే." News18 తెలుగు. 2024-05-26. Retrieved 2024-07-21.
- ↑ "Central Library Adilabad - Opening Hours, Reviews & Photos [2024]". TRIP.COM (in ఇంగ్లీష్). Retrieved 2024-07-21.
- ↑ "Central Library, Bhuktapur". www.mappls.com (in ఇంగ్లీష్). Retrieved 2024-07-21.
- ↑ "Authorised Dealer : Found 26 Authorised Dealers of Videocon in Adilabad (Andhra Pradesh)". www.authoriseddealer.com. Retrieved 2024-07-21.
- ↑ Sumithra (2022-12-29). "తెలంగాణ ఇరిగేషన్ కార్పొరేషన్ చైర్మన్ గా వేణుగోపాల చారి". www.dishadaily.com. Retrieved 2024-07-21.
- ↑ "ఈనాడు : Eenadu Telugu News Paper | Eenadu ePaper | Eenadu Andhra Pradesh | Eenadu Telangana | Eenadu Hyderabad". epaper.eenadu.net. Retrieved 2024-10-25.
- ↑ "గ్రంథాలయాన్ని సందర్శించిన డిగ్రీ విద్యార్థులు". EENADU. Retrieved 2024-07-21.