జీడిమెట్ల చెరువు
స్వరూపం
జీడిమెట్ల చెరువు | |
---|---|
ప్రదేశం | హైదరాబాద్, తెలంగాణ, భారతదేశం |
అక్షాంశ,రేఖాంశాలు | 17°31′26″N 78°28′12″E / 17.524°N 78.470°E |
రకం | జలాశయం |
సరస్సులోకి ప్రవాహం | మూసీనది |
వెలుపలికి ప్రవాహం | మూసీనది |
ప్రవహించే దేశాలు | భారతదేశం |
ఉపరితల వైశాల్యం | 2 కి.మీ2 (0.77 చ. మై.)[1] |
సరాసరి లోతు | 33 అడుగులు (10 మీటర్లు)[2] |
జీడిమెట్ల చెరువు హైదరాబాదు నగరంలో ఐదవ పెద్దచెరువు. దీనిని నక్కసాగర్ చెరువు, కొల్లచెరువు అనికూడా పిలుస్తారు. రెండు కిలోమీటర్లకు పొడవు వెడల్పుతో ఉండే ఈ చెరువు కొంపల్లికి సమీపంలోని జీడీమెట్లలో ఉంది.[3] ఇది చేపల వేట, పిక్నిక్‌లకు అనువైన చెరువు.[4][1]
చరిత్ర
[మార్చు]1897లో నిజాం నవాబులు (మహబూబ్ అలీ ఖాన్) హైదరాబాద్ నగరానికి నీటి వనరులను మెరుగుపర్చడానికి 31 చెరువులలో నిర్మించగా, అందులో ఒకటి ఈ జీడిమెట్ల చెరువు. దీనిని ఫాక్స్ సాగర్ మీద ఒక ఆనకట్టగా నిర్మించారు. నిజాం కాలంలో సమీప గ్రామాలకు తాగునీటిని, సాగునీటిని అందించింది.
మూసినదిలో ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నిర్మాణానికి ముందు ఈ సరస్సు నిర్మించబడింది. ఈ సరస్సు ఒకప్పుడు హుస్సేన్ సాగర్‌తో మూసినది ఉపనది ద్వారా అనుసంధానించబడింది.
ఇతర వివరాలు
[మార్చు]- ఇది ఒకప్పుడు 290 ఎకరాల (1.2 చకిమీ) విస్తీర్ణంలో విస్తరించి ఉండేది. 2014 నాటికి, ఆక్రమణ కారణంగా, ఇది 126 ఎకరాల (0.51 చకిమీ) వైశాల్యం మాత్రమే మిగిలింది.[5]
- చెరువు ఒడ్డున పంప్ హౌస్ గా నిర్మించిన రాతి నిర్మాణం ఇప్పటికీ ఉంది. దీనికిగల ఉక్కు నిర్మాణాలు తుప్పు పట్టాయి.
- ఈ చెరువును శుభ్రపరచడానికి ప్రభుత్వ సంస్థలు, వాలంటీర్లు కొన్ని ప్రయత్నాలు ప్రారంభించారు.[6]
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 M. L., Maitreyi Mellu (2017-11-11). "Efforts to restore Fox Sagar". The Hindu. Hyderabad. Retrieved 2021-03-19.
- ↑ "Two more spells of rain will lift Osman Sagar, Himayat Sagar gates". The New Indian Express. Hyderabad. 2017-10-12. Retrieved 2021-03-19.
- ↑ Syed, Akbar (2017-09-20). "E120-yr-old Fox Sagar now dump for toxic chemicals". Times of India. Hyderabad. Retrieved 2021-03-19.
- ↑ నమస్తే తెలంగాణ, అల్వాల్ చెరువు (15 October 2017). "నగరంలో చెరువులు.. పర్యాటక నెలవులు". Retrieved 2021-03-19.
- ↑ C, Sarala; B, Venkateswara Rao (2014-11-01). HYDROLOGY AND WATERSHED MANAGEMENT. institute of Science & Technology, JNTU. ISBN 9788184249521. Retrieved 2021-03-19.
- ↑ "Rejuvenating Fox Sagar lake". The Hindu. Hyderabad. 2017-02-08. Retrieved 2021-03-19.