Jump to content

జీవ శాస్త్రం

వికీపీడియా నుండి

జీవుల అధ్యయనానికి సంబంధించిన శాస్త్రాన్ని జీవశాస్త్రం (ఆంగ్లం biology) అంటారు. జీవుల ఉద్భావన, లక్షణాలు, వర్గీకరణ, జీవకోటిలో జాతులు, పర్యావరణ చట్రంలో వాటి మనుగడ, ఇలా ఎన్నో కోణాల నుండి జీవశాస్త్రాన్ని అధ్యయనం చెయ్యవచ్చు. కనుక జీవ శాస్త్రము యొక్క పరిధి చాలా విస్త్రుతమైనది. వృక్షశాస్త్రం, జంతుశాస్త్రం, వైద్యశాస్త్రం మొదలైన వర్గాలు చాలరోజులబట్టీ వున్నవే. ఈ రోజులలో ఈ వర్గీకరణ కూడ బాగా వ్యాప్తి చెందింది. జీవి లక్షణాలని అణు (atomic), పరమాణు (molecular) ప్రమాణాలలో అధ్యయనం చేస్తే దానిని అణుజీవశాస్త్రం (మాలిక్యులార్ బయాలజీ) అనీ, జీవరసాయనశాస్త్రం (బయోకెమిస్ట్రీ) అనీ, జీవసాంకేతిక శాస్త్రం (బయోటెక్నాలజీ) అనీ, అణుజన్యుశాస్త్రం (మాలిక్యులార్ జెనెటిక్స్) అనీ అంటున్నారు. జీవి లక్షణాలని జీవకణం స్థాయిలో చదివితే దానిని కణజీవశాస్త్రం (సెల్ బయాలజీ) అనీ, అంగము (organ) స్థాయిలో పరిశీలిస్తే దానిని శరీర నిర్మాణ శాస్త్రము (అనాటమీ) అనీ, జన్యువు నిర్మాణాన్ని, అనువంశికతను జన్యుశాస్త్రం (Genetics), ఇలా రకరకాల కోణాలలో జీవశాస్త్రాన్ని అధ్యయనం చెయ్యవచ్చు.

జీవ వర్గీకరణ సోపాన క్రమం
జీవ వర్గీకరణ సోపాన క్రమం

జీవశాస్త్రం-వర్గీకరణ

[మార్చు]

జీవశాస్త్రాన్ని జీవశాస్త్ర పితామహుడిగా భావించే అరిస్టాటిల్ నుండి కెవాలియర్-స్మిత్ వరకు పలువురు శాస్త్రవేత్తలు వివిధ కాలాలలో వివిధ అంశాల ఆధారంగా పలురకాలుగా వర్గీకరించారు.

జీవుల వర్గీకరణ పట్టిక
క్ర.సం. కాలం శాస్త్రవేత్త రాజ్యాల సంఖ్య వర్గాలు మూలం
1. బి సి 384 అరిస్టాటిల్ 2 1. జంతువులు 2. మొక్కలు [1]
2. 1735 కరోలస్ లిన్నేయస్ 2 1. వెజిటేబిలియా, 2. అనిమాలియా
3. 1866 ఎర్నెస్ట్ హకెల్ 3 1. ప్రొటిస్టా, 2. ప్లాంటే, 3. అనిమాలియా
4. 1925 చాటన్ 2 1. కేంద్రక పూర్వజీవులు, 2. నిజకేంద్రక జీవులు
5. 1938 కోప్‌లాండ్ 4 1. మొనిరా, 2. ప్రొటిస్టా, 3. ప్లాంటే, 4. అనిమాలియా
6. 1969 థామస్ విట్టేకర్ 5 1. మొనిరా, 2. ప్రొటిస్టా, 3. ప్లాంటే, 4. ఫంగీ, 5. అనిమాలియా [2]
7. 1990 ఉజ్ ఎట్ ఆల్ 3 1.బాక్టీరియా, 2. అరాకియా 3. యుకారియా
8. 1998 కెవాలియర్ - స్మిత్ 6 1. బాక్టీరియా, 2. ప్రొటొజోవా, 3.క్రొమిస్టా, 4. ప్లాంటే, 5. ఫంగీ, 6. అనిమాలియా

జీవశాస్త్ర్ర భాగాలు

[మార్చు]

చిత్రమాలిక

[మార్చు]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "విట్టేకర్ జీవుల వర్గీకరణ, సాక్షి-ఎడ్యుకేషన్,17-06-2015". Archived from the original on 2021-01-17. Retrieved 2020-04-10.
  2. జీవశాస్త్రం,9వ తరగతి తె/మా, తెలంగాణ ప్రభుత్వ ప్రచురణ,హైదరాబాద్,2019,పుట-62[permanent dead link]

వెలుపలి లంకెలు

[మార్చు]