Jump to content

జోసెఫ్ కబిలా

వికీపీడియా నుండి
జోసెఫ్ కబీలా
కాంగో అధ్యక్షుడు
Assumed office
2001 జనవరి 17
అంతకు ముందు వారులారెంట్ డీజైర్ కబీలా
Assumed office
2019 మార్చి 15
వ్యక్తిగత వివరాలు
జననం1971 జూన్ 4
కీవ్ పట్టణం కాంగో
రాజకీయ పార్టీపీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ
జీవిత భాగస్వామిఒలీవియా
కళాశాలకాంగో విశ్వవిద్యాలయం
Military service
Rankమేజర్ జనరల్

జోసెఫ్ కబిలా కాంగో దేశానికి చెందిన రాజకీయ నాయకుడు. 2001 నుంచి 2019 వరకు కాంగో అధ్యక్షుడిగా పనిచేశాడు స కాంగో పూర్వపు అధ్యక్షుడు లారెంట్-డిసిరే కబిలా జోసెఫ్ కబీలా తండ్రి.

బాల్యం

[మార్చు]

జోసెఫ్ కబీలా 1971 జూన్ 4న జన్మించారు. జోసెఫ్ కబీలా టాంజానియాలో జన్మించాడని, కాంగో ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తుంటాయి. కాంగో మాజీ అధ్యక్షుడు లారెంట్-డిసిరే కబిలా ఇతని తండ్రి.[1]

జోసెఫ్ కబీలా బాల్యం నుంచే రాజకీయాల మీద ఆసక్తి ఉండేది. తండ్రి కూడా రాజకీయ నాయకుడు కావడంతో ఆ ఆసక్తి మరింత పెరిగింది. బాల్యం నుంచే జోసెఫ్ కబీలా కాంగో రాజకీయాలను గమనిస్తూ ఉండేవాడు. జోసెఫ్ కబీలా విద్య అంతా దక్షిణాఫ్రికాలో గడిచింది.

రాజకీయ జీవితం

[మార్చు]

కాంగో అధ్యక్షుడు

[మార్చు]
2002లో కబిలా, థాబో ఎంబెకీ, జార్జ్ డబ్ల్యూ. బుష్, పాల్ కగామేతో కలిసి.

లారెంట్ డిజైర్ కబీలా హత్యతో జోసెఫ్ కబీలా 2001 జనవరి 26న కాంగో అధ్యక్ష పీఠాన్ని అధిష్టించారు. 29 సంవత్సరాలు వయసులోనే కాంగో దేశానికి అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. చుట్టుపక్కల దేశాలతో చాలా సన్నిహితంగా ఉండేవాడు. ఎక్కువగా ఉగాండా దేశానికి సహాయపడేవాడు. కాంగో ప్రజల సొమ్మును ఇతర దేశాలకు దోచుపెడుతున్నాడని కాంగో ప్రతిపక్ష పార్టీలు నిరసనలు ధర్నా చేపట్టాయి.కాంగో దేశానికి అత్యధిక కాలం అధ్యక్షుడిగా పనిచేసిన వ్యక్తిగా రికార్డ్ సృష్టించాడు.కాంగో అధ్యక్ష ఎన్నికలకు 2001 నుంచి 2019 వరకు నాలుగు సార్లు ఎన్నికలు జరగగా జోసెఫ్ కబీ లానే నాలుగు సార్లు అధ్యక్షుడుగా ఎన్నికయ్యాడు ‌.

మూలాలు

[మార్చు]
  1. Stearns, Jason (2011). Dancing in the glory of monsters : the collapse of the Congo and the great war of Africa. New York: PublicAffairs. p. 310. ISBN 978-1-61039-107-8. OCLC 657595549.