టి.నందీశ్వర్ గౌడ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
టి.నందీశ్వర్ గౌడ్
టి.నందీశ్వర్ గౌడ్

పదవీ కాలం
2009 – 2014
నియోజకవర్గం పటాన్‌చెరు నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 30 డిసెంబర్ 1962
పటాన్‌చెరు , సంగారెడ్డి జిల్లా
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ
తల్లిదండ్రులు మోహన్ గౌడ్
జీవిత భాగస్వామి సంధ్య
సంతానం అభిషేక్ , ఆశిష్ , అనిషా
నివాసం గౌతమ్ నగర్ , పటాన్‌చెరు , సంగారెడ్డి జిల్లా
వృత్తి రాజకీయ నాయకుడు

టి.నందీశ్వర్ గౌడ్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2009 నుండి 2014 వరకు పటాన్‌చెరు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పనిచేశాడు.

జననం, విద్యాభాస్యం

[మార్చు]

టి.నందీశ్వర్ గౌడ్ 1962లో తెలంగాణ రాష్ట్రం, సంగారెడ్డి జిల్లా, పటాన్‌చెరులో తౌటి మోహన్ గౌడ్, నందమ్మ దంపతులకు జన్మించాడు. ఆయన 1979లో సికింద్రాబాద్ లోని వెస్లీ హై స్కూల్ లో చదివాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

టి.నందీశ్వర్ గౌడ్ 1987లో కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1987లో పటాన్‌చెరు ఎంపీపీగా గెలిచాడు. ఆయన ఉమ్మడి మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాల్లో పనిచేస్తూ నందీశ్వర్ గౌడ్ 1999లో సంగారెడ్డి నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కుర్రా సత్యనారాయణ చేతిలో 17444 ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యాడు. ఆయన 2008లో మెదక్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమితుడయ్యాడు.

టి.నందీశ్వర్ గౌడ్ 2008లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా పటాన్‌చెరు, రామచంద్రాపురం, జిన్నారం మండలాలతో ఏర్పాటైన పటాన్‌చెరు శాసనసభ నియోజకవర్గం నుండి 2009లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎం.సపాన్‌ దేవ్‌ పై ఓట్ల 1247 మెజారిటీతో గెలిచి పటాన్‌చెరు తొలి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.[1] ఆయన 2014లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోయాడు. ఆయన 2017 మే 2న ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్ష్యుడు అమిత్ షా సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరాడు.[2]

టి.నందీశ్వర్ గౌడ్ 2018లో 2018 అక్టోబరు 19న భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరాడు. ఆయన టిడిపికి రాజీనామా చేసి 2019 ఆగస్టు 22న భారతీయ జనతా పార్టీలో చేరాడు. ఆయనను 2023లో జరిగే శాసనసభ ఎన్నికల్లో పటాన్‌చెరు శాసనసభ నియోజకవర్గంనుండి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించగా, ఆయన నవంబరు 09న నామినేషన్ పత్రాలు దాఖలు చేశాడు.[3]

మూలాలు

[మార్చు]
  1. Sakshi (11 November 2018). "మినీ ఇండియా". Archived from the original on 1 ఆగస్టు 2021. Retrieved 1 August 2021.
  2. Deccan Chronicle (2 May 2017). "Chilli row to help Amit Shah raise heat during Telangana tour" (in ఇంగ్లీష్). Archived from the original on 1 ఆగస్టు 2021. Retrieved 1 August 2021.
  3. Andhrajyothy (9 November 2023). "బుల్‌డోజర్స్‌‌తో ర్యాలీగా వెళ్లి నామినేషన్ వేసిన బీజేపీ అభ్యర్థి నందీశ్వర్ గౌడ్". Archived from the original on 9 November 2023. Retrieved 9 November 2023.