Jump to content

తెభాగా ఉద్యమం

వికీపీడియా నుండి

తెభాగా ఉద్యమం భారతదేశ స్వాతంత్ర్య సంగ్రామ చరమాంకంలో జరిగిన ముఖ్యమైన కార్మిక ఉద్యమం. ఇది 1946-47 సంవత్సరాలలో అప్పటి ఉమ్మడి బెంగాల్ లో కిసాన్ సభ ఆధ్వర్యంలో జరిగిన ఉద్యమం.

చరిత్ర

[మార్చు]

ఆ కాలంలో కౌలుదార్లు భూస్వాములకు పంట కోతలో సగభాగం ఇవ్వాలనే నిబంధన ఉండేది. తెభాగా ఉద్యమం ద్వారా ఆ భాగాన్ని మూడో వంతుకి కుదించాలని ప్రధానంగా పోరు జరిగింది.[1]

చాలా ప్రాంతాల్లో ఈ ఉద్యమం హింసాత్మకమైంది. భూస్వాములు పరారయ్యారు. ఆ విధంగా భూమి సింహభాగం కిసాన్ సభ చేతుల్లోకి వెళ్ళింది. 1946లో కౌలుదార్లు మూడో భాగం మాత్రమే పంటలో భూస్వాములకు ఇస్తామని, బట్వాడా జరిగే వరకు ధాన్యం కౌలుదార్ల అధీనంలో గోదాముల్లో ఉండాలని ఉద్యమించారు. ప్రభుత్వానికి బెంగాల్ లాండ్ రెవెన్యూ కమిషన్ ఇచ్చిన నివేదికలో కౌలుదార్లు అడిగిన డిమాండ్లకు దగ్గరగా సూచనలు ఉండటంతో కౌలుదార్లు మరింత ఉత్సాహంగా ఉద్యమంలో పాల్గొన్నారు. ఉద్యమం మెల్లిగా జోతేదార్లకు, బార్గదార్లకు మధ్య వైరాలకు దారి తీసింది.

ఉద్యమానికి జవాబుగా ముస్లిం లీగ్ ప్రభుత్వం బెంగాల్ ప్రాంతంలో బార్గదారీ చట్టాన్ని అమలులోకి తెచ్చింది. ఆ చట్టం ప్రకారం కౌలుదార్లు మూడో వంతు భాగం భూస్వాములకు చెలించాలి. కానీ ఈ చట్టం పూర్తి మలుకు నోచుకోలేదు. బెంగాల్ లాండ్ రెవెన్యూ కమిషన్ (ఫ్లడ్ కమిషన్) కూడా కౌలుదార్ల పక్షంలోనే తమ సూచనలను ఇచ్చింది.

ప్రముఖ ఉద్యమ నాయకులు

[మార్చు]
  • ఇలా మిత్ర
  • కన్‌సారీ హల్ధర్
  • మణి సింగ్
  • బిష్ణు చట్టోపాధ్యాయ్
  • ఎం.ఏ. రసూల్
  • మణి గుహ
  • చారు మజూందార్
  • అబానీ లాహిరి
  • గురుదాస్ తాలుక్‌దర్
  • సమర్ గాంగులీ
  • బిమల మాజీ
  • సుధీర్ ముఖర్జీ
  • స్సుదీపా సేన్
  • మణి కృష్ణ సేన్
  • సుబోధ్ రాయ్
  • బుడి మా

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Asok Majumdar (2011). The Tebhaga Movement : Politics of Peasant Protest in Bengal 1946-1950. Aakar Books. p. 13. ISBN 978-9350021590.