తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ
Appearance
రకం | తెలంగాణ ప్రభుత్వ సంస్థ |
---|---|
కేంద్రీకరణ | పంట నిల్వకు గోదాంల నిర్మాణం, మౌలిక సదుపాయాల కల్పన |
కార్యస్థానం | |
అధికారిక భాష | తెలుగు, ఉర్దూ |
తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ అనేది తెలంగాణ ప్రభుత్వానికి చెందిన సంస్థ. 2018లో ఈ సంస్థ భారతదేశంలోనే ప్రథమస్థానంలో నిలిచింది. తెలంగాణలో పండించే పంటలను నిల్వ చేయడానికి కోటి టన్నుల సామర్ద్యంగల గోదాంల నిర్మాణం, మౌలిక సదుపాయాల కల్పన లక్ష్యంగా ఈ సంస్థ పనిచేస్తోంది.[1]
ప్రారంభం
[మార్చు]తెలంగాణ రాష్ట్రంలో పంటల నిల్వలకోసం, వ్యవసాయ ఉత్పత్తులు, విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ పనిముట్లు, నోటిఫైడ్ వస్తువుల కొనుగోలు-అమ్మకాల కోసం తెలంగాణ ప్రభుత్వంచే తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ప్రారంభించబడింది.
విధులు
[మార్చు]- తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విధానానికి అనుగుణంగా అటువంటి ప్రదేశాలలో గిడ్డంగులను నిర్మించడానికి భూమిని సేకరించడం.
- వ్యవసాయ ఉత్పత్తులు, విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ పనిముట్లు, నోటిఫైడ్ వస్తువుల కొనుగోలు-అమ్మకం, నిల్వ-పంపిణీల కోసం సెంట్రల్ వేర్‌హౌసింగ్ కార్పోరేషన్ లేదా ప్రభుత్వ ఏజెంట్‌గా వ్యవహరించడం.
- రైతులకు వారి ఉత్పత్తులు, ఇతర నోటిఫైడ్ వస్తువుల నిల్వల కోసం తగినంత, శాస్త్రీయ మౌలిక సదుపాయాలను అందించడం.
- ఉత్పత్తులు గోదాములకు, బయటికి రవాణా చేయడానికి సౌకర్యాలను ఏర్పాటు చేయడం.
- నిల్వ నష్టాన్ని తగ్గించడానికి, గ్రామీణ లిక్విడిటీని మెరుగుపరచడానికి రైతులకు సులభంగా అందుబాటులో ఉండేలా చేయడం
- వ్యవసాయ వస్తువుల అస్థిర మార్కెట్ ధరల నుండి సాధ్యమైన మేరకు అధిగమించడానికి మార్కెట్‌కు మద్దతు ఇవ్వడం
చైర్మన్లు
[మార్చు]- తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఏర్పడిన తరువాత తొలి చైర్మన్‌గా మందుల సామేల్ బాధ్యతలు చేపట్టాడు. చైర్మన్ పదవీ కాలాన్ని మరో ఏడాదిపాటు పొడిగిస్తూ వ్యవసాయ శాఖ కార్యదర్శి డాక్టర్ బి.జనార్దన్‌రెడ్డి 2020, జూలై 15న జీవో నెం.308ను జారీ చేశాడు.[2]
- 2021 డిసెంబరు 15న సాయిచంద్ సంస్థకు రెండవ చైర్మన్ గా నియమితుడై[3] 2021, డిసెంబరు 24న కార్పోరేషన్ చైర్మెన్‌గా భాద్యతలు చేపట్టాడు.[4]
ఫలితాలు
[మార్చు]- 2017, 2018 సంవత్సరాలకు తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థకు 26.74 కోట్ల రూపాయలు లాభం వచ్చింది. ఈ లాభాల్లో 3.50 కోట్ల రూపాయలు డివిడెండ్‌గా ప్రకటించగా, ఇందులో 50 శాతం రాష్ట్ర ప్రభుత్వానికి, 50 శాతం కేంద్ర గిడ్డంగుల సంస్థకు లభించాయి.[5]
- తెలంగాణలో వ్యవసాయోత్పత్తులు రికార్డు స్థాయిలో పెరగడంతో ప్రభుత్వ గోదాముల్లోనే ప్రస్తుతం ఉన్న 24 లక్షల టన్నుల నిల్వ సామర్థ్యాన్ని 64 లక్షల టన్నులకు పెంచింది. 2014లో రాష్ట్రం ఏర్పడిన సమయంలో కేవలం నాలుగు లక్షల టన్నుల నిల్వ సామర్థ్యం నుండి 2021 ఆగస్టు నాటికి 16 రెట్లు పెరిగింది.[1]
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 "Telangana: Godown storage capacity to rise 16-fold". Telangana Today (in అమెరికన్ ఇంగ్లీష్). 2021-08-29. Archived from the original on 2021-08-30. Retrieved 2022-01-11.
- ↑ "గిడ్డంగుల సంస్థ చైర్మన్ పదవీ కాలం పొడిగింపు". andhrajyothy. Archived from the original on 2022-01-11. Retrieved 2022-01-11.
- ↑ Namasthe Telangana (15 December 2021). "మూడు కార్పొరేషన్లకు చైర్మన్ల నియామకం.. ఉత్తర్వులు జారీ". www.ntnews.com. Archived from the original on 15 December 2021. Retrieved 11 January 2022.
- ↑ Dishadaily (దిశ) (24 December 2021). "గిడ్డంగుల కార్పోరేషన్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన సాయిచంద్". www.dishadaily.com. Archived from the original on 25 December 2021. Retrieved 11 January 2022.
- ↑ "రాష్ట్ర గిడ్డంగుల సంస్థకు 26 కోట్ల లాభం". www.andhrabhoomi.net. 2019-07-04. Archived from the original on 2019-07-04. Retrieved 2022-01-11.
బయటి లింకులు
[మార్చు]- అధికారిక వైబ్సైటు Archived 2022-01-11 at the Wayback Machine