తెలంగాణ రాష్ట్ర గెస్ట్‌హౌజ్
రాష్ట్ర గెస్ట్‌హౌజ్ | |
---|---|
సాధారణ సమాచారం | |
పట్టణం లేదా నగరం | హైదరాబాదు, తెలంగాణ |
దేశం | భారతదేశం |
నిర్మాణ ప్రారంభం | 2004 |
వ్యయం | ₹8.1 కోట్లు |
క్లయింట్ | తెలంగాణ రాష్ట్రం |
సాంకేతిక విషయములు | |
పరిమాణం | 2 ఎకరాలు |
నేల వైశాల్యం | 25,500 చదరపు అడుగులు |
తెలంగాణ రాష్ట్ర గెస్ట్‌హౌజ్ తెలంగాణ రాష్ట్ర అధికారిక అతిథిగృహం. హైదరాబాదులోని పంజగుట్టలో ఈ గృహం తెలంగాణ ముఖ్యమంత్రి అధికారిక కార్యాలయమైన ప్రగతి భవన్ లో భాగంగా ఉంది.[1] ప్రస్తుతం ఇది ఇన్స్పెక్టర్ జనరల్ కార్యాలయం (భద్రత) గా మార్చబడింది.
చరిత్ర
[మార్చు]తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అధికారిక నివాసంగా ఉండేది. 2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఈ క్యాంప్ కార్యాలయం నిర్మించబడింది. తొలిసారిగా వై.యస్. రాజశేఖరరెడ్డి 2005 నుండి 2009లో మరణించేవరకు ఐదేళ్లపాటు ఇందులోనే ఉన్నాడు.[2]
క్యాంప్ ఆఫీస్
[మార్చు]సిఎం క్యాంప్ కార్యాలయంలో రెండు అంతస్తుల ప్రాంగణంలో కార్యాలయం, నివాసం ఉన్నాయి. 25,500 చదరపు అడుగుల విస్తీర్ణంతో 2-ఎకరాల (8,100 మీ 2) లో విస్తరించి ఉంది. వాస్తు ప్రకారం నిర్మించబడిన ఈ భవనానికి తూర్పు, ఉత్తర దిశలలో రోడ్లు ఉన్నాయి. ఈ భవన ప్రాంగణంలో 2007లో ప్రాంగణంలో 2,500 చదరపు అడుగుల (230 మీ 2) లో 1.15 కోట్ల వ్యయంతో ఒక థియేటర్ నిర్మించబడింది. దీనిలో అత్యాధునిక రికార్డింగ్, ఆన్లైన్ ఎడిటింగ్ పరికరాలు ఉన్నాయి.
నివసించిన ముఖ్యమంత్రులు
[మార్చు]- వై.యస్. రాజశేఖరరెడ్డి (2005 - 2009)
- కొణిజేటి రోశయ్య (కార్యాలయంగా మాత్రమే ఉపయోగించాడు)
- నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి (2010 - 2014)
- కల్వకుంట్ల చంద్రశేఖరరావు (2014 జూన్ - 2016 నవంబరు)
రాష్ట్ర విభజన తరువాత
[మార్చు]తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఈ క్యాంప్ కార్యాలయం తెలంగాణ ముఖ్యమంత్రి నివాసంగా మారింది. లేక్‌వ్యూ గెస్ట్‌హౌస్ వద్ద ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఇవ్వబడింది.[3]
- కె. చంద్రశేఖర్ రావు ( 2014 జూన్ 22 - 2015) [4]
ప్రస్తుతం
[మార్చు]ప్రస్తుతం దీనిని తెలంగాణ ముఖ్యమంత్రి అతిథిగృహంగా ఉపయోగిస్తున్నారు.
ఇవికూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "CM to shift to camp office today after vastu changes - The Times of India". timesofindia.indiatimes.com. Retrieved 31 August 2019.
- ↑ "CM to move into Camp home". deccanchronicle.com. Deccan Chronicle. 7 డిసెంబరు 2010. Archived from the original on 8 డిసెంబరు 2010. Retrieved 31 ఆగస్టు 2019.
{{cite web}}
: More than one of|archivedate=
and|archive-date=
specified (help); More than one of|archiveurl=
and|archive-url=
specified (help) - ↑ "Telangana CM K Chandrasekhar Rao chooses to stay at camp office". deccanchronicle.com. Retrieved 31 August 2019.
- ↑ "KCR moves in to Begumpet camp office - The Times of India". timesofindia.indiatimes.com. Retrieved 31 August 2019.