Jump to content

తోకచుక్క

వికీపీడియా నుండి
Comet Hale-Bopp
CComet P1 McNaught
సూర్యుని చుట్టూ దీర్ఘవృత్తాకార కక్ష్యలో తోకచుక్క రెండు తోకల్ని గమనించండి.

తోకచుక్కలు (ఆంగ్లం Comets) ఆకాశంలోని చిన్నచిన్న విచిత్రాలు. నక్షత్రాలను చుక్కలంటాము. తోకచుక్కలు నిజంగా చుక్కలు కావు. తోకచుక్కలు సౌరకుటుంబానికి చెందినవి. సంస్కృతంలో తోకచుక్కలను ధూమకేతువు లంటారు. పూర్వకాలంలో తోకచుక్క కనిపిస్తే ఏదో అరిష్టానికి సూచనగా భావించేవారు.

ఇప్పటికి ఇంచుమించు 600 తోకచుక్కలను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. వీటిలో 513 చాలా దీర్ఘకాలికమైనవి.

తోకచుక్క నిర్మాణం

[మార్చు]

తోకచుక్క కక్ష్యలో సూర్యునికి దూరాన ఉన్నప్పుడు అతిశీతలంగా ఉంటుంది. దానిలోని వాయువులు గడ్డకడతాయి. అప్పుడు దానికి తలేకాని తోక ఉండదు. తోకచుక్క తలలో మిథేన్, అమ్మోనియా, నీరు గడ్డకట్టి ఉంటాయి. ఈ గడ్డలోపల ఇనుము, నికెల్, కాల్షియం, మెగ్నీషియం, సిలికాన్, సోడియం మొదలైన మూలకాలు ఉంటాయి. సూర్యుని సమీపిస్తున్న కొద్దీ కేంద్రంలోని మంచు కరిగిపోతుంది. వాయువులు విడిపోతాయి. ఈ వాయుకణాల మీద, ఉల్కాధూళి కణాలమీద సూర్యకాంతి పడి ప్రతిఫలిస్తుంది. ఇదే తోకలాగా ప్రకాశిస్తుంది. ఈ వాయువులను సౌరవాయువులు వెనక్కి త్రోసివేస్తాయి. ఈ కారణం వల్లనే ఎప్పుడూ తోకచుక్క తల సూర్యునివైపు, తోక సూర్యునికి వ్యతిరేక దిశలో ఉంటాయి.

ముఖ్యమైన తోకచుక్కలు

[మార్చు]

హేలీ తోకచుక్క

[మార్చు]

ఇది 1910 సంవత్సరంలోను, 1985 లోను కనిపించిన తోకచుక్క. ఈ తోకచుక్క 76-77 సంవత్సరాల కొకసారి భూమికి దగ్గరగా వస్తుందని మొదటగా కనిపెట్టినవాడు ఎడ్మండ్ హేలీ అనే ఇంగ్లీషు శాస్త్రజ్ఞుడు. ఆయన పేరు మీదనే దానికి 'హేలీ తోకచుక్క' అని పేరు పెట్టారు. హేలీ 1659లో జన్మించాడు. తోకచుక్కల గురించి ఆయన పరిశోధన చేస్తూ పాత రికార్డులని తిరగ వేస్తుండగా, 1531లో కనబడిన ఒక ప్రకాశవంతమైన తోకచుక్క, 1607లో తిరిగి కనబడిందని తెలియవచ్చింది. 1682లో తాను స్వయంగా చూచిన తోకచుక్క అదేనని కూడా ఆయన కనిపెట్టాడు. అతని లెక్క ప్రకారం ఇది తిరిగి 1759లో మళ్ళి కనిపించింది. కానీ 1742 లోనే హేలీ కాలధర్మం చెందాడు.

హేలీ తర్వాత ఈ తోకచుక్క చరిత్ర తవ్వి తీయగా వరుసగా 76 సంవత్సరాల కొకసారి దాన్ని ఎవరో ఒకరు చూస్తూనే వున్నరని తెలిసింది. మానవులు చైనాలో మొదటిసారిగా దాన్ని క్రీస్తుపూర్వం 249 లో చూసినట్టుగా నిర్ధారణ అయింది. 1066లో ఇంగ్లండును నార్మన్ లు జయించినప్పుడు కూడా అదే తోకచుక్క కనబడినట్టు చరిత్రలో ఉంది. ఈ హేలీ తోకచుక్కనే 1910 లో గురజాడ అప్పారావు వర్ణించిన "సంఘ సంస్కరణ ప్రయాణ పతాక". ఈ తోకచుక్క గురించి అమెరికన్ రచయిత మార్క్ ట్వేన్ కథనం ప్రసిద్ధమైనది. మహాకవి శ్రీ శ్రీ కూడా 1910 లోనే జన్మించాడు.

సైడింగ్ స్ప్రింగ్ తోకచుక్క

[మార్చు]

నియోవైజ్ తోకచుక్క

[మార్చు]

నియోవైజ్ తోకచుక్కను 2020 మార్చి 27 వ తేదీన నాసా శాస్త్రవేత్తలు కనుగొన్నారు.

మూలాలు

[మార్చు]

1.అందాల తోకచుక్కలు: విశ్వరూపం: నండూరి రామమోహనరావు, లిఖిత ప్రచురణలు, విజయవాడ, పేజీలు 436-450, 2005.

"https://te.wikipedia.org/w/index.php?title=తోకచుక్క&oldid=4281470" నుండి వెలికితీశారు