ధనం
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
ధనమును డబ్బు, రొక్కము అని కూడా అంటారు. ధనమును ఆంగ్లములో money అంటారు. ధనంతో కొన్ని వస్తువులను కొనవచ్చు, కొన్ని సేవలను పొందవచ్చు. ధనాన్ని లోహంతోను, కాగితం రూపంలోను, ఇతర వస్చేస్తారు.ధనంపై అధికారిక సమాచారం ముద్రితమై ఉంటుంది. ధనమును వివిధ అవసరముల నిమిత్తం అప్పు తీసుకొని తిరిగి చెల్లించవచ్చు. వివిధ దేశములకు సంబంధించిన ప్రభుత్వాలు మానవ సమాజము యొక్క ఆర్థిక పరిస్థితులు మెరుగు పరచడానికి ధన నియంత్రణ చేస్తుంది.
ధనంను సులభంగా గుర్తించగలగడం
[మార్చు]కాగితం రూపంలో లేక నాణేల రూపంలో తయారు చేసిన ధనాన్ని చూడగానే గుర్తించ గలిగేలా దాని విలువ వెంటనే తెలుసుకునేలా వీటిని వాటి విలువను బట్టి ఆకారంలోను, పరిమాణంలోను, నాణ్యతలోను, రంగులలోను మార్పులు కలుగజేస్తారు.
వివిధ దేశాలలో వివిధ పేర్లు, చిహ్నాలు
[మార్చు]ధనాన్ని వివిధ దేశాలలో విభిన్న పేర్లతో పిలవడమే కాకుండా వాటికి వివిధ చిహ్నాలను కూడా ఉపయోగిస్తుంటారు. ఉదాహరణకు అమెరికా డాలర్ చిహ్నం $, అలాగే భారతీయ రూపాయి చిహ్నము ₹.
ధనం ఎల్లప్పుడూ నడుస్తూ ఉండాలి
[మార్చు]రక్తం ఏ విధంగా నిరంతరం గుండెను చేరి శుద్ధి పడుతూ అన్ని శరీర భాగాలను ఆరోగ్యంగా ఉంచుతుందో అలాగే ధనం కూడా క్రమ పద్ధతిలో నిరంతరం నడుస్తూ అన్ని ప్రాంతాలను, ప్రజలందరిని అభివృద్ధి పరుస్తూ ఉంటుంది.
ఇవి కూడా చూడండి
[మార్చు]డబ్బు - క్యాష్