Jump to content

భారతీయ రూపాయి చిహ్నం

వికీపీడియా నుండి
(భారతీయ రూపాయి చిహ్నము నుండి దారిమార్పు చెందింది)
భారత రూపాయి చిహ్నం

భారతీయ రూపాయి 2010 లో ఒక చిహ్నాన్ని () సంతరించుకుంది. యూనికోడ్ భాషలో అది U+20B9. HTML భాషలో "&#x 20B9;" మధ్యలో ఖాళీ లేకుండా రాస్తే గుర్తు ( ₹ ) కనబడుతుంది. ఈ చిహ్నం డిజైనును 2010 జూలై 15 నాడు భారతదేశ ప్రభుత్వం ప్రజలకు పరిచయం చేసింది. ఈ చిహ్నం చూడటానికి దేవనాగరి లిపిలోని "र" (ర), ఆంగ్ల భాష అక్షరం "R" (ఆర్) కలగలిపినట్లు వుంటుంది.

2009 వ సంవత్సరంలో రూపాయికి చిహ్నం సమకూర్చేందుకు గాను ఒక పోటీని భారత ప్రభుత్వం నిర్వహించింది. [1] 3,331 ఎంపికల నుండి 5 చిహ్నాలు ఎంపిక చేయబడ్డాయి. వీటిలో నుంచి ఐఐటి గౌహతికి చెందిన డి. ఉదయ్‌కుమార్‌ సమర్పించిన చిహ్నాన్ని మంత్రివర్గం ఎంపికచేసింది. మైక్రోసాఫ్ట్, ఆపిల్ వంటి పెద్ద పెద్ద గణణ యంత్ర (కంప్యూటర్) పరిశ్రమలు ఈ రూపాయి చిహ్నాన్ని కంప్యూటర్ లో ముద్రించేందుకు వీలుగా సాఫ్ట్ వేర్లు తయారు చేశాయి.

చరిత్ర

[మార్చు]
రూపాయి చిహ్నం రూపకర్త ఊదయ్‌కిరణ్

2009 మార్చి 5న భారత ప్రభుత్వం రూపాయి గుర్తు సృష్టించటానికి పోటీ ప్రకటించింది.[1]. 2010 కేంద్ర బడ్జెట్ ప్రసంగంలో ప్రణబ్ ముఖర్జీ ప్రతిపాదిత గుర్తు భారతీయ సంస్కృతి, మూలాలను ప్రతిబింబించాలని అన్నాడు[2]. 3,331 ప్రతిపాదనలు రాగా, వాటిలో ఐదు గుర్తులతో పొట్టిజాబితాలోకి తీసుకొనబడ్డాయి.[3]

అవి నొందితా కొర్రియా మెహ్రోత్రా, హితేష్ పద్మశాలి, షిబిన్ కెకె, షారుఖ్ జె ఇరానీ, డి ఉదయకుమార్ ప్రతిపాదించినవి.[4][3]. వాటినుండి ఒకటి 2010 జూన్ 4న కేంద్రమంత్రివర్గం సమావేశంలో ఎంపిక చేద్దామనుకున్నారు[5]. కాని ఆర్థికమంత్రి అభ్యర్థన మేరకు వాయిదా వేశారు[6]. 2010 జులై 15న నాటి సమావేశంలో ఐఐటి గౌహతిలో ఉపాచార్యులుగా పనిచేస్తున్న ఉదయ కుమార్ ప్రతిపాదన గెలుపొందినట్లుగా ప్రకటించారు[7].[8]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 https://web.archive.org/web/20130531034323/http://finmin.nic.in/the_ministry/dept_eco_affairs/currency_coinage/Comp_Design.pdf
  2. "Cabinet defers decision on rupee symbol". Sify Finance. 24 June 2010. Retrieved 10 July 2010.
  3. 3.0 3.1 "List of Five Entries which have been selected for Final". Ministry of Finance, Govt of India. Archived from the original on 11 జూలై 2010. Retrieved 13 ఆగస్టు 2019.
  4. "Rupee: Which of the 5 final designs do you like?". Rediff Business. 16 June 2010. Retrieved 26 July 2010.
  5. "Rupee to get a symbol today!". Money Control.com. 26 February 2010. Retrieved 10 July 2010.
  6. "Cabinet defers decision on rupee symbol". PTI. 24 June 2010. Archived from the original on 27 జూన్ 2010. Retrieved 10 July 2010.
  7. "Cabinet approves new rupee symbol". Times of India. 15 July 2010. Retrieved 15 July 2010.
  8. "Department of design/ faculty". Iitg.ernet.in.