నెపోలియన్ (సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నెపోలియన్
దర్శకత్వంఆనంద్ రవి
రచనఆనంద్ రవి
నిర్మాతభోగేంద్ర గుప్తా
తారాగణంఆనంద్ రవి, రవివర్మ, కోమలి ప్రసాద్
ఛాయాగ్రహణంమార్గల్ డేవిడ్
కూర్పుకార్తీక్ శ్రీనివాస్
సంగీతంసిద్ధార్థ్ సదాశివుని
నిర్మాణ
సంస్థ
ఆచార్య క్రియేషన్స్
విడుదల తేదీ
2017 నవంబరు 24 (2017-11-24)
సినిమా నిడివి
119 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

నెపోలియన్ 2017, నవంబరు 24న విడుదలైన తెలుగు క్రైం థ్రిల్లర్ చలనచిత్రం.[1] ఆచార్య క్రియేషన్స్ పతాకంపై భోగేంద్ర గుప్తా నిర్మాణ సారథ్యంలో ఆనంద్ రవి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఆనంద్ రవి, రవివర్మ, కోమలి ముఖ్య పాత్రలు పోషించగా, సిద్ధార్థ్ సదాశివుని సంగీతం అందించాడు.[2]

కథ[మార్చు]

నెపోలియ‌న్ (ఆనంద్ ర‌వి) త‌న నీడ పోయిందంటూ పోలీస్‌స్టేష‌న్‌లో ఫిర్యాదు చేయడంతో అది సంచ‌ల‌న విష‌యంగా మారుతుంది. అంతేకాకుండా త‌న‌కి దేవుడు క‌ల‌లోకి వ‌చ్చి చెప్పాడంటూ ఓ హ‌త్య కేసు గురించి చెబుతాడు. ఇంత‌లో నెపోలియ‌న్ త‌న భ‌ర్త అంటూ స్ర‌వంతి (కోమ‌లి) పోలీస్ స్టేష‌న్‌కి వ‌చ్చి, అత‌ని అస‌లు పేరు అశోక్‌కుమార్ అని చెబుతుంది. నెపోలియ‌న్ మాత్రం తాను స్ర‌వంతి భ‌ర్త కాద‌ని చెబుతాడు. ఇంత‌కీ నెపోలియ‌న్‌కి హ‌త్య కేసు విష‌యం ఎలా తెలిసింది, ఆ హ‌త్య‌తో అత‌నికున్న సంబంధమేమిటి, స‌్ర‌వంతి చెప్పిన‌ట్టుగా అత‌ను ఆమె భ‌ర్తేనా కాదా అన్నది మిగతా కథ.[3][4]

తారాగణం[మార్చు]

సాంకేతికవర్గం[మార్చు]

  • రచన, దర్శకత్వం: ఆనంద్ రవి
  • నిర్మాత: భోగేంద్ర గుప్తా
  • సంగీతం: సిద్ధార్థ్ సదాశివుని
  • ఛాయాగ్రహణం: మార్గల్ డేవిడ్
  • కూర్పు: కార్తీక్ శ్రీనివాస్
  • నిర్మాణ సంస్థ: ఆచార్య క్రియేషన్స్

పాటలు[మార్చు]

ఈ చిత్రానికి సిద్ధార్థ్ సదాశివుని సంగీతం అందించాడు.[5]

  • వింతలు వింతలు
  • ప్రాణమా
  • లెజెండ్ ఆఫ్ నెపోలియన్

మూలాలు[మార్చు]

  1. "Napoleon Review". IndiaGlitz. 24 November 2017. Retrieved 25 February 2019.
  2. "Napoleon Movie Review". Archived from the original on 2018-08-03. Retrieved 2019-02-24.
  3. తెలుగు360, సినిమా రివ్యూ (24 November 2017). "Napoleon Telugu Movie Review". www.telugu360.com. Retrieved 17 August 2020.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
  4. Sakshi (24 November 2017). "'నెపోలియన్' మూవీ రివ్యూ". Sakshi. Archived from the original on 8 జూన్ 2021. Retrieved 8 June 2021.
  5. Naa Songs, Songs (4 December 2017). "Napoleon Songs". www.naasongs.com. Retrieved 17 August 2020.[permanent dead link]

ఇతర లంకెలు[మార్చు]