Jump to content

పవిత్ర జయరామ్

వికీపీడియా నుండి
పవిత్ర జయరామ్
జననంఏప్రిల్ 14
మరణం2024 మే 12
మరణ కారణంరోడ్డు ప్రమాదం
జాతీయతభారతీయురాలు
వృత్తినటి

పవిత్ర జయరామ్, తెలుగు, కన్నడ భాషా టెలివిజన్ రంగాలకు చెందిన భారతీయ నటి. జీ తెలుగులో ప్రసారమవుతున్న త్రిన‌య‌ని సీరియ‌ల్‌లో తిలోత్త‌మ అనే నెగిటివ్ రోల్ పోషించిన ఆమె మంచి గుర్తింపును తెచ్చుకుంది.

తెలుగులో నిన్నే పెళ్లాడ‌తా ధారావాహికతో పరిచయం అయిన ఆమె, స్వ‌ర్ణా ప్యాలెస్‌, కోడ‌ళ్లు మీకు జోహ‌ర్లు అనే సీరియ‌ల్స్‌లోనూ ప్ర‌తినాయిక పాత్ర‌ల‌తో మెప్పించింది.[1]

కెరీర్

[మార్చు]

కర్ణాకటలోని మాండ్యా ప్రాంతానికి చెందిన ఆమె రోబో ఫ్యామిలీ అనే క‌న్న‌డ‌ సీరియ‌ల్ ద్వారా అరంగేట్రం చేసింది. అక్కడ వ‌రుస‌గా పలు సీరియ‌ల్స్‌ల‌లో న‌టించి మంచి గుర్తింపును తెచ్చుకున్న ఆమె, నిన్నే పెళ్లాడ‌తా ధారావాహికతో తెలుగు నాట అడుగుపెట్టింది.

వ్యక్తిగత జీవితం

[మార్చు]

చిన్న‌త‌నంలోనే పెళ్లి చేసుకున్న ఆమె భ‌ర్త‌కు దూరంగా ఉంటోంది. కాగా ఆమెకు ఒక కుమారుడు, ఒక కూతురు ఉన్నారు.

మరణం

[మార్చు]

ఆమె మహబూబ్​నగర్ జిల్లా శేరిపల్లి వద్ద 2024 మే 12న జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందింది. బెంగళూరు నుంచి షూటింగ్ కోసం హైదరాబాద్ కారులో వస్తుండగా ఈ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.[2]

మూలాలు

[మార్చు]
  1. "హౌజ్‌ కీపర్‌గా, సేల్స్‌ గర్ల్‌గా చేశా: ప్రముఖ నటి పవిత్ర | Sakshi". web.archive.org. 2024-05-12. Archived from the original on 2024-05-12. Retrieved 2024-05-12.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. "Pavithra Jayaram: ఘోర ప్ర‌మాదం.. తెలుగు సీరియ‌ల్ న‌టి దుర్మ‌ర‌ణం | Trinayani Serial Actress Pavithra Jayaram Died At Accident ktr". web.archive.org. 2024-05-12. Archived from the original on 2024-05-12. Retrieved 2024-05-12.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)