Jump to content

పాంపే లక్ష్మి

వికీపీడియా నుండి
పాంపే యక్షి
దంతంతో చేసిన యక్షి బొమ్మ (సా.శ. 1 వ శతాబ్దం). సా.శ. 79 లో అగ్నిపర్వత విస్ఫోటనంలో నాశనమైన పాంపే పట్టణ శిథిలాల్లో ఇది దొరికింది.
పదార్థందంతం
పొడవు24.5 cమీ. (9+12 అం.)
కనుగొన్నదిసుమారు 1930–1938
పాంపే
ప్రస్తుతం ఉన్న చోటుఇటలీ లోని రహస్య మ్యూజియమ్‌లో
Identification149425

పాంపే లక్ష్మి అనేది ఏనుగు దంతంతో చేసిన విగ్రహం. సా.శ. 79 లో మౌంట్ వెసూవియస్ అగ్నిపర్వతం విస్ఫోటనం చెందినపుడు ధ్వంసమైన రోమన్ నగరం పాంపే శిథిలాలలో దీన్ని కనుగొన్నారు. దీనిని 1938 లో ఇటాలియన్ పండితుడు అమెడియో మైయురి కనుగొన్నాడు. [1] ఈ విగ్రహం సా.శ. మొదటి శతాబ్దం నాటిది. [2] ఈ విగ్రహం స్త్రీ సౌందర్యానికి, సంతానోత్పత్తికి సంబంధించిన భారతీయ దేవతగా భావిస్తున్నారు. ఈ శిల్పం బహుశా అద్దాన్ని పట్టుకునే కాడ (హ్యాండిల్‌) అయి ఉంటుందని భావిస్తున్నారు. [3] సా.శ. మొదటి శతాబ్దంలో భారతదేశం, రోమ్‌ల మధ్య జరిగిన వాణిజ్యానికి ఈ యక్షి సాక్ష్యం.

తొలుత ఈ విగ్రహాన్ని లక్ష్మిగా భావించారు. అయితే, ఈ విగ్రహ ఆకృతిని - ప్రత్యేకించి బహిర్గతమైన జననేంద్రియాలను - బట్టి ఈ బొమ్మ ఒక యక్షి అయి ఉండవచ్చని భావిస్తున్నారు. లేదా సాంప్రదాయిక గ్రీకు భారతీయ సంస్కృతుల కలయిక ఫలితంగా రూపొందిన బొమ్మ అయ్యే అవకాశం ఉందని వెల్లడిస్తుంది.

ఈ బొమ్మ ఇప్పుడు నేపుల్స్ నేషనల్ ఆర్కియాలజికల్ మ్యూజియంలోని రహస్య మ్యూజియంలో ఉంది. [4]

విశేషాలు

[మార్చు]

ఈ విగ్రహాన్ని 1938 అక్టోబరులో పాంపేలోని కాసా డీ క్వాట్రో స్టిలి పక్కన కనుగొన్నారు. ఆ భవన నిర్మాణ శైలి, దాని ఆకృతిని బట్టి ఇది ఒక వ్యాపారికి చెందినదని భావిస్తున్నారు. [5] ఈ భవనం విలాసవంతమైన భారతీయ వస్తువులతో నిండి ఉంది. సా.శ. మొదటి శతాబ్దంలో రోమన్లకు గ్రీస్ నుండి మాత్రమే కాకుండా మారుమూల సంస్కృతుల నుండి కూడా వచ్చిన పురాతన వస్తువులపై మోజు ఉండేదని దీన్ని బట్టి తెలుస్తోంది. రోమన్లకు ఇతర దేశాలకు చెందిన వస్తువులను కొనుగోలు చేయాలనే కోరిక ఉండేదని కూడా ఇది సూచిస్తోంది. [6]

25 సెం.మీ. ఎత్తైన ఈ విగ్రహానికి సన్నని నడుముతో, విలాసవంతమైన ఆభరణాలతో దాదాపు నగ్నంగా ఉంది. ఆమెకు ఇరువైపులా ఇద్దరు మహిళా సహాయకులు బయటికి చూస్తూ ఉన్నారు. వారు సౌందర్య సాధనాలను పట్టుకుని ఉన్నారు. [7] విగ్రహానికి తల పై నుండి క్రిందికి రంధ్రం ఉంది. ఆ కారణంగా, ఆ విగ్రహం అద్దాన్ని పట్టుకునే కాడ అయి ఉండవచ్చని ఒక సిద్ధాంతం ఉంది. [8]

సా.శ. 79 లో వెసువియస్ పర్వతం విస్ఫోటనం చెందే నాటికి ఈ విగ్రహం పాంపేలో ఉంది అంటే ఆ నాటికి ఇండో-రోమన్ వాణిజ్య సంబంధాలు ఎంత ఎక్కువగా ఉండేవో తెలుపుతోంది. [9] [10] ఈ విగ్రహాన్ని ఆ శతాబ్దపు ప్రథమార్ధంలో భారతదేశంలో రూపొందించినట్లుగా నేపుల్స్ నేషనల్ ఆర్కియాలజికల్ మ్యూజియం తేల్చింది. [11]

వర్తకం

[మార్చు]

పాంపే లక్ష్మికి మూలం ఏదో పురావస్తు పరిశోధనల ఆధారంగా పూర్తిగా ఖచ్చితంగా తెలియదు. ఈ కాలంలో నీరో చక్రవర్తి పాలనలో ఉన్న రోమన్ సామ్రాజ్యానికి భారతదేశానికీ మధ్య అప్పట్లో చురుకైన వాణిజ్యం ఉండేదనేందుకు ఆధారాలు ఉన్నాయి. [12] పొలార్డ్ ప్రకారం, రోమన్ సుదూర వాణిజ్యం కాత్రణంగా, అగస్టస్ పాలనలో ఆ విగ్రహం నగరానికి చేరి ఉండవచ్చని భావిస్తున్నారు. [12] పురావస్తు ఆధారాల ప్రకారం రోమన్ - భారత వాణిజ్యం సా.శ. మొదటి, రెండవ శతాబ్దాలలో ఉచ్ఛస్థాయికి చేరినట్లు తెలుస్తోంది. ఈ వాణిజ్యం అనేక మార్గాల్లో జరిగింది, ఇసిడోర్ ఆఫ్ చరక్స్ పార్థియన్ స్టేషన్‌ల ద్వారా భూమార్గాన, పెరిప్లస్ మారిస్ ఎరిత్రేయి అనే వర్తక మార్గదర్శిని వెల్లడించినట్లు సముద్ర మార్గాన ఈ వాణిజ్యం సాగింది. [12]

భోకర్దాన్ ప్రాంతాన్ని పాలించిన నహపాణుడి కాలంలో ఈ విగ్రహం వెళ్ళి ఉండే అవకాశం ఉంది. బహుశా బరిగాజా ఓడరేవు నుండి రవాణా అయి ఉండవచ్చు. [13]

ఖరోష్ఠి లిపికి చెందిన అక్షరం śi విగ్రహం పునాదిపై చెక్కబడింది. [14]

ఈ విగ్రహాన్ని మథురలో నిర్మించి ఉండవచ్చని మొదట భావించారు. కానీ ధవాలికర్ ప్రకారం, భోకర్దాన్ లో ఇలాంటివే మరో రెండు బొమ్మలు కనుగొనబడినందున దాని ఉత్పత్తి స్థలం భోకర్దాన్ అని ఇప్పుడు భావిస్తున్నారు. [15] భోకర్దాన్ శాతవాహన రాజ్యం లోనిది. వారి సాంస్కృతిక రంగంలో ఒక భాగం. అయితే ఇది కొన్ని దశాబ్దాల పాటు పశ్చిమ సాత్రపుల కింద ఉండి ఉండవచ్చు. రోమన్ ప్రపంచానికి ఎగుమతులు చేసినది వారే అయి ఉండవచ్చు. [16]

పాంపే విగ్రహం పాదం వద్ద ఖరోస్తీలో śi అనే ఒక చిహ్నం కూడా ఉంది. [14] ఆ బొమ్మ భారతదేశం, పాకిస్తాన్ లేదా ఆఫ్ఘనిస్తాన్ యొక్క వాయువ్య ప్రాంతాల నుండి ఉద్భవించి ఉండవచ్చు లేదా కనీసం ఈ ప్రాంతాల గుండా వెళ్లి ఉండవచ్చని ఇది సూచిస్తోంది. [17] ఈ విగ్రహాన్ని కచ్చితంగా సా.శ. 79 కి ముందే తయారు చేయబడింది కాబట్టి, ఇది నిజంగా గాంధారలోనే తయారై ఉంటే, బెగ్రామ్ దంతాలు కూడా సా.శ. 1వ శతాబ్దంలో ఈ కాలానికే చెందినవని చెప్పవచ్చు. [17]

మూలాలు

[మార్చు]
  1. An Indian Statuette from Pompeii, Mirella Levi D' Ancona, Artibus Asiae, Vol. 13, No. 3 (1950), pp. 166–180[permanent dead link]
  2. . "Vol. 32, No. 24, May 8, 1939 of The Classical Weekly on JSTOR".
  3. "Abstracts of Articles". The Classical Weekly. 32 (18): 214–215. 1939. JSTOR 4340562.
  4. "Lakshmi". Museo Archeologico Napoli. Retrieved 4 February 2017.
  5. Parker, Grant (2002). "Ex Oriente Luxuria: Indian Commodities and Roman Experience". Journal of the Economic and Social History of the Orient. 45 (1): 40–95. ISSN 0022-4995.
  6. Beard, Mary (2010). Pompeii: The Life of a Roman Town. Profile Books. p. 24. ISBN 978-1847650641.
  7. Beard, Mary (2010). Pompeii: The Life of a Roman Town. Profile Books. p. 24. ISBN 978-1847650641.
  8. "Abstracts of Articles". The Classical Weekly. 32 (18): 214–215. 1939. JSTOR 4340562.
  9. Beard, Mary (2010). Pompeii: The Life of a Roman Town. Profile Books. p. 24. ISBN 978-1847650641.
  10. Secrets of Pompeii: Everyday Life in Ancient Rome.
  11. "Lakshmi". Museo Archeologico Napoli. Retrieved 4 February 2017.
  12. 12.0 12.1 12.2 . "Indian Spices and Roman "Magic" in Imperial and Late Antique Indomediterranea".
  13. Brancaccio, Pia (2010). The Buddhist Caves at Aurangabad: Transformations in Art and Religion (in ఇంగ్లీష్). Brill. p. 64 Note 94. ISBN 978-9004185258.
  14. 14.0 14.1 Statuetta eburnea di arte indiana a Pompei, Maiuri p. 112 ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; "Maiuri" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు
  15. Dhavalikar, M. K. (1999). "Chapter 4: Maharashatra: Environmental and Historical Process". In Kulkarni, A. R.; Wagle, N. K. (eds.). Region, Nationality and Religion. Popular Prakashan. p. 46. ISBN 9788171548552.
  16. Brancaccio, Pia (2010). The Buddhist Caves at Aurangabad: Transformations in Art and Religion. Brill. p. 64 Note 94. ISBN 978-9004185258.
  17. 17.0 17.1 Afghanistan: Forging Civilizations Along the Silk Road, Joan Aruz, Elisabetta Valtz Fino, Metropolitan Museum of Art, 2012 p. 75