పాత్రికేయవిద్య
Appearance
ఈ వ్యాసంలో మూలాలను ఇవ్వలేదు. |
జర్నలిజం లేదా పాత్రికేయవిద్య అంటే సమాజంలో జరుగుతూన్న వాస్తవ సంఘటలను ప్రజా మాధ్యమాల ద్వారా ప్రసారం చెయ్యడానికి వాటిని పాత్రికేయులు లేదా ఇతరులు రాత, దృశ్య, శ్రవణ రీతులలో తయారుచేసే కార్యకలాపం. సమాజం గురించి సమాజానికే తెలియజేయడం, అంతర్గతంగానే ఉండిపోయే విషయాలను బహిర్గతం చెయ్యడం పాత్రికేయవిద్య ఉద్దేశాలు.
చరిత్ర
[మార్చు]14వ శతాబ్దం నాటికే ఇటలీ, జర్మన్ దేశాల నగరాలలో వ్యాపారస్థులు ముఖ్యమైన వార్తా సంఘటనలను చేతిరాత పత్రాలలో కూర్చి వాటిని తమ వ్యాపార సంబంధీకులతో పంచుకునేవారు. ఈ పత్రాలకు ముద్రణ యంత్రాన్ని వాడుకోవాలన్న ఆలోచన 1600 కాలంలో మొదటగా జర్మనీలో వచ్చింది. కొన్ని దశాబ్దాల తర్వాత, పారిస్, లండన్ లలోని జాతీయ ప్రభుత్వాలు అధికారిక వార్తాలేఖలను ముద్రించడం మొదలుపెట్టాయి.