తెలుగు జర్నలిజం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వివేకవర్థని పత్రిక

ఇతర భారతీయ భాషలలాగానే తొలి తెలుగు పత్రికలు క్రైస్తవమత బోధకులు ప్రారంభించారు. 1835లో బ‌‍‌‌‌‌ ళ్ళారి కేంద్రంగా మద్రాసులో ప్రచురించబడిన సత్యదూత మాసపత్రిక తొలి తెలుగు పత్రిక. ఆ తరువాత హితవాది అనే వారపత్రిక ప్రచురించబడింది. కాకినాడ నుండి కెనడియన్ బాప్టిస్టు మిషన్ ప్రచురించిన రావి అనే పత్రికలో మతవిషయాలతో పాటు వార్తలు వుండేవి. సామాజిక, భాషాభివృద్ధి ధ్యేయంగా కందుకూరి వీరేశలింగం పంతులు నడిపిన వివేకవర్ధని వార పత్రిక, దానితో పోటీగా వేంకటరత్నం పంతులు పంతులు నడిపిన ఆంధ్ర భాషా సంజీవిని తొలి అధ్యాయం మొదలైందని చెప్పవచ్చు.[1]

వారపత్రికలలో ఆంధ్రప్రకాశిక అనే తెలుగు వార్తా పత్రిక మద్రాసు నుండి 1886లో ఎ.పి.పార్ధసారధి వెలువడించాడు. ఈ పత్రిక జాతీయ కాంగ్రెస్ ను సమర్ధించేది. 25 సంవత్సరాలుతరువాత వారానికి రెండుసార్లు విడుదలై ఆ తరువాత కొన్నాళ్లికి వారపత్రికగా మారింది. 1920దశకంలో నిలిచిపోయింది.

శశిలేఖ (1894) తెలుగు ప్రాంతాల ఏకీకరణకు పోరాడిన తొలి పత్రిక. ఆ తరువాత తెలుగు పత్రికలలో ప్రథమంగా దేవగుప్త శేషశాయి రావు దేశాభిమాని అనే పక్ష పత్రికను స్థాపించి దానిని దినపత్రికగా మార్చాడు. అదేకాలంలో భాషా ఉద్యమం జరిగింది. ఆంధ్ర సాహిత్య పరిషత్ పత్రిక 1911 లో వ్యావహారిక భాషని సమర్థించింది. ఆధునిక తెలుగు పునాదులు విశ్వనాధ సత్యనారాయణ, రామకోటేశ్వరరావు నడిపిన జనతా అనబడే పత్రికలో పడ్డాయి.

ఆంధ్రుల పత్రికలలో విజయవంతంగా నడిచిన తొలి తెలుగు పత్రిక ఆంధ్రప్రత్రిక . ఇది 1908లో కాశీనాధుని నాగేశ్వరరావు పంతులు వారపత్రికగా స్థాపించాడు. శేషగిరిరావు సంపాదకత్వంలో వృద్ధి చెందింది. ఆ తరువాత దినపత్రికగా మారింది. దీనితో పాటు సాహిత్య పత్రిక భారతి ప్రజాదరణ పొందింది. ఈ పత్రిక గాంధీజీ జీవనవిలువలని ప్రచారం చేసింది.1965లో విజయవాడకు ఆ తరువాత హైదరాబాదు కేంద్రంనుండి ముద్రించబడింది.

ఆంధ్ర పత్రిక తోపోటీగా ఆంధ్రప్రభని ఖాసా సుబ్బారావు సంపాదకత్వంలో ఎక్స్‌ప్రెస్ గ్రూప్ 1938లో స్థాపించింది. నార్ల వెంకటేశ్వరరావు సారథ్యంలో అభివృద్ధి చెందింది.

2007-08 ఆర్ఎన్ఐ (RNI) గణాంకాల ప్రకారం 2168 తెలుగు పత్రికలు ( 405 దినపత్రికలు, 372 వారపత్రికలు, 340 పక్ష పత్రికలు, 971 మాసపత్రికలు) . ఐఆర్ఎస్ (IRS) Q-2,తెలుగు న్యూస్ ఏజెన్సీ లో INB గుర్తింపు పొందిన BHARAT NEWS INTERNATIONAL BNI ANI లు ఉన్నాయి 2011 ప్రకారం అధిక చదువరులనుకలిగివున్న పత్రికలలో ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి, ప్రజాశక్తి, విశాలాంధ్ర, ఆంధ్రభూమి, ఆంధ్రప్రభ, ఉన్నాయి.

మూలాలు[మార్చు]

  1. "History of Telugu Journalism in India -Dr. Mrinal Chatterjee". Archived from the original on 2014-02-16. Retrieved 2014-03-18.

బయటిలింకులు[మార్చు]