Jump to content

పిన్నెల్లి రామకృష్ణారెడ్డి

వికీపీడియా నుండి
పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి
పిన్నెల్లి రామకృష్ణారెడ్డి


ఎమ్మెల్యే , ప్రభుత్వ విప్‌‌
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2019 - 3 జూన్ 2024
తరువాత జూలకంటి బ్రహ్మానంద రెడ్డి
నియోజకవర్గం మాచెర్ల నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1970
కండ్లకుంట , వెల్దుర్తి మండలం , గుంటూరు జిల్లా , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, భారతదేశం
రాజకీయ పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ
తల్లిదండ్రులు వెంకటేశ్వర రెడ్డి
జీవిత భాగస్వామి రమాదేవి
బంధువులు పిన్నెల్లి లక్ష్మారెడ్డి పెద్దనాన్న [1]
సంతానం వీరాంజనేయ గౌతమ్‌రెడ్డి, సంయుక్త రెడ్డి
నివాసం మాచెర్ల

పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ప్రస్తుతం మాచెర్ల నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా, ప్రభుత్వ విప్‌‌గా ఉన్నాడు.

జననం, విద్యాభాస్యం

[మార్చు]

పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , గుంటూరు జిల్లా, వెల్దుర్తి మండలం , కండ్లకుంట గ్రామంలో 1970లో జన్మించాడు. ఆయన 1986-1988 వరకు నరసరావుపేటలో ఇంటర్మీడియట్ పూర్తి చేసి, 1991లో గుంటూరు లోని ఎ.సి.కాలేజ్ లో బి.కామ్ పూర్తి చేశాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1996లో యూత్‌ కాంగ్రెస్‌ జిల్లా కార్యదర్శి పదవీ బాధ్యతలు చేపట్టాడు. ఆయన 2004 నుండి 2009 వరకు వెల్దుర్తి జెడ్పిటిసిగా పని చేశాడు. రామకృష్ణా రెడ్డి 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మాచెర్ల నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మానంద రెడ్డి పై 9785 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.[2] వై యెస్ రాజశేఖర్ రెడ్డి మరణాంతరం తన పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి 2012లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు. 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో వైఎస్సాఆర్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చిరుమామిళ్ల మధుబాబుపై 16200 ఓట్ల మెజారిటీతో రెండోసారి అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.[3] ఆయన 2014, 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సాఆర్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసి అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.[4] ఆయనను 2019లో వైఎస్సాఆర్‌సీపీ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ విప్‌‌గా నియమించింది.

వివాదం

[మార్చు]

మే 13, 2024 లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి మాచర్ల నియోజకవర్గంలోని రెంటచింతల మండలం పాల్వాయి గేట్ 202 పోలింగ్ కేంద్రంలో పోలింగ్ బూత్‌లో జొరబడి ఈవీఎంను ధ్వంసం చేశాడు.[5][6] ఈ సంఘటన అక్కడే ఉన్న కెమెరాలో రికార్డు అయ్యింది. దీని ఆధారంగా అతని మీద ఐపీసీలోని143, 147, 448, 427, 353, 452, 120బి, తోపాటు ప్రజాప్రాతినిధ్య చట్టం, పీడీపీపీ చట్టం, ఆర్పీ చట్టం 131, 135లోని పలు సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.[7]

మాచర్ల నియోజకవర్గంలో పోలింగ్ రోజున తీవ్ర స్థాయి ఘర్షణలు చోటు చేసుకోగా, ఆయనను ఆ రోజున సాయంత్రం గృహనిర్బంధంలో ఉంచారు. తర్వాత అల్లర్లపై పోలీసుల విచారణ ప్రారంభం కావడంతో 14 నుండి ఆజ్ఞాతంలోకి వెళ్లాడు. ఈవీఎంను పగలగొట్టిన వ్యవహారాన్ని ఈసీ సీరియస్‌గా తీసుకుని ఆయన అరెస్టునకు ఆదేశించింది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు లుక్‌ఔట్ నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలో ఆయన ఏపీ హైకోర్టును ఆశ్రయించగా జూన్‌ 5 ఉదయం 10 గంటల వరకు పిన్నెల్లిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.[8][9]

మూలాలు

[మార్చు]
  1. Sakshi (31 May 2019). "వారసులొచ్చారు." Archived from the original on 5 జనవరి 2022. Retrieved 5 January 2022.
  2. Sakshi (22 March 2019). "పౌరుషాల గడ్డ ..మాచర్ల". Archived from the original on 28 September 2021. Retrieved 28 September 2021.
  3. Sakshi (19 March 2019). "గుంటూరు జిల్లా.. అసెంబ్లీ అభ్యర్థుల జాబితా." Archived from the original on 28 September 2021. Retrieved 28 September 2021.
  4. Sakshi (2019). "Macherla Constituency Winner List in AP Elections 2019". Archived from the original on 28 September 2021. Retrieved 28 September 2021.
  5. TV9 Telugu (22 May 2024). "ఈవీఎంను ధ్వంసం చేసిన ఎమ్మెల్యే పిన్నెల్లి.. వీడియో వైరల్". Archived from the original on 22 May 2024. Retrieved 22 May 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  6. "AP Elections: ఈవీఎంను ధ్వంసం చేసిన వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి.. సీసీటీవీ ఫుటేజ్‌ వైరల్‌". EENADU. Retrieved 2024-05-22.
  7. "పిన్నెల్లి అరెస్టుకు రంగం సిద్ధం.. లుకౌట్ నోటీసులు.. 7 ఏళ్లు జైలు శిక్ష..?". 22 May 2024. Archived from the original on 22 May 2024. Retrieved 22 May 2024.
  8. 10TV Telugu (23 May 2024). "పిన్నెల్లికి హైకోర్టులో బిగ్ రిలీఫ్" (in Telugu). Archived from the original on 24 May 2024. Retrieved 24 May 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  9. The Hindu (23 May 2024). "EVM damage case: A.P. High Court grants interim protection to Macherla MLA Pinnelli Ramakrishna Reddy till June 5" (in Indian English). Archived from the original on 24 May 2024. Retrieved 24 May 2024.