పులికాట్ సరస్సు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పులికాట్ సరస్సులో పడవ

పులికాట్ సరస్సు ఆంధ్రప్రదేశ్ లోని అతిపెద్ద సరస్సు, భారతదేశంలో రెండవ పెద్ద సరస్సు. ఇది ఉప్పునీటి సరస్సు అయినప్పటికి, సముద్రపు నీరు, మంచి నీరు కలగలిసి ఉండటం వలన సముద్రపు నీరంత ఉప్పగా ఉండదు. దీని అసలు పేరు ప్రళయ కావేరి. అది పులికాటుగా మారింది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రధానంగా తిరుపతి జిల్లాలో దాదాపు 250 చ.కి.మీ. వైశాల్యంలో వ్యాపించి ఉంది. వర్షాకాలంలో ఇది 460 చ.కి.మీ. వరకు పెరుగుతుంది. భారతదేశ కోరమాండల్ తీరములో చిల్కా సరస్సు తర్వాత రెండవ అతిపెద్ద సరస్సు. శ్రీహరికోట ద్వీపము పులికాట్ సరస్సును బంగాళా ఖాతము నుండి వేరు చేస్తున్నది. పులికాట్ సరస్సు యొక్క దక్షిణపు ఒడ్డున తమిళనాడు రాష్ట్రములోని తిరువళ్ళువర్ జిల్లాలో పులికాట్ పట్టణం ఉంది. ఇక్కడ పులికాట్ పక్షుల సంరక్షణ కేంద్రం ఉంది.


పులికాట్ సరస్సు 60 కిలోమీటర్ల పొడవు, ప్రదేశాన్ని బట్టి 0.2 నుండి 17.5 కిలోమీటర్ల వెడల్పు ఉంది.

తిరుపతి జిల్లాలో శ్రీ కాళహస్తికి 27 కి.మీ. దూరంలో ఉన్న ఈ చెరువు ఎన్నో జాతుల పక్షులకు, ప్రకృతి సంపదకు నిలయం.

చరిత్ర

[మార్చు]
పులికాట్ పట్టణములో డచ్చివారి చారిత్రాత్మక శ్మశానవాటిక

ఒకటవ శతాబ్దానికి చెందిన ఒక అనామక రచయిత రాసిన Periplus of the Erythraean Sea అనే గ్రంథంలో పులికాట్ ను భారతదేశ తూర్పు తీరం వెంబడి ఉన్న మూడు ఓడరేవుల్లో ఒకటిగా పేర్కొన్నాడు. రెండవ శతాబ్దంలో టాలెమీ పొందుపరిచిన ఓడరేవుల జాబితాలో ఇది కూడా ఉంది.

13 వ శతాబ్దంలో మక్కాలో కొత్తగా నియమితులైన ఖలీఫాకు కప్పం కట్టడానికి నిరాకరించడంతో వారిని అక్కడ నుంచి బహిష్కరించడంతో వారు నాలుగు ఓడల్లో పడవల్లో బయలు దేరి ఈ తీరానికి వలస వచ్చారు. తర్వాత పోర్చుగీసు వారు ఈ ప్రాంతంలో 1515 ప్రాంతంలో ఒక చర్చిని కూడా నిర్మించారు. దాని తాలూకు శిథిలాలు నేటికీ ఈ ప్రాంతంలో కనిపిస్తాయి. తర్వాత డచ్ వారు కూడా ఇక్కడికి వచ్చారు. 1700 సంవత్సరం నాటికి బ్రిటీష్ ఈస్టిండియా కంపెనీవారు దక్షిణ భారతదేశంలో నెలకొల్పిన అతికొద్ది వర్తకస్థానాల్లో పులికాట్ కూడా ఒకటిగా ఉండేది.[1]

భౌగోళిక స్వరూపం

[మార్చు]

ఈ సరస్సు 13.33° - 13.66° ఉత్తరం, 80.23° to 80.25°తూర్పు అక్షాంశ రేఖాంశాల మధ్య విస్తరించి ఉంది. ఎండిపోయిన భాగం కూడా పరిగణనలోకి తీసుకుంటే ఉత్తరం 14.0° దాకా విస్తరించి ఉంది. ఈ సరస్సులో 84% ఆంధ్రప్రదేశ్ లోనూ, 16% తమిళనాడులోనూ విస్తరించి ఉంది.

సాహిత్యంలో పులికాట్‌

[మార్చు]

పులికాట్‌ సరస్సు, అక్కడి ప్రజల జీవనము నేపథ్యంగా స.వెం.రమేష్ ప్రళయకావేరి కథలు అనే కథల సంపుటి రచించాడు.

మూలాలు

[మార్చు]
  1. వెంకట శివరావు, దిగవల్లి (1944). కథలు-గాథలు (1 ed.). విజయవాడ: దిగవల్లి వెంకట శివరావు. pp. 127–140. Retrieved 1 December 2014.

చిత్రమాలిక

[మార్చు]