అనుదైర్ఘ్య తరంగాలు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి Wikipedia python library
చి Wikipedia python library
పంక్తి 6: పంక్తి 6:
== అనుదైర్ఘ్య తరంగాలకు ఉదాహరణలు==
== అనుదైర్ఘ్య తరంగాలకు ఉదాహరణలు==
[[దస్త్రం:Longitudinal waves.png|450px|right|thumb|గంట నుండి వెలువడే శబ్ద తరంగాలు(అనుదైర్ఘ్య తరంగాలు)]]
[[దస్త్రం:Longitudinal waves.png|450px|right|thumb|గంట నుండి వెలువడే శబ్ద తరంగాలు(అనుదైర్ఘ్య తరంగాలు)]]
* [[ధ్వని]] తరంగాలు ([[అనుదైర్ఘ్య తరంగాలు]])
* [[ధ్వని]] తరంగాలు ([[అనుదైర్ఘ్య తరంగాలు]])
* స్ప్రింగు లో యేర్పడే తరంగాలు.
* స్ప్రింగు లో యేర్పడే తరంగాలు.



20:31, 18 జూన్ 2014 నాటి కూర్పు

యానకంలో తరంగ ప్రసారదిశ కు యానకంలోని కణాల కంపన దిశ సమాంతరంగా ఉంటే వాటిని అనుదైర్ఘ్య తరంగాలు అందురు. ఉదాహరణకు శబ్ద తరంగాలు శబ్ద జనకం నుండి అన్ని పైపుల కు ప్రయాణిస్తాయి. అవి ప్రసారణకు యానకం అవసరం.వీటిలో యానకంలోని కణాలు మాధ్యమిక స్థానం నుండి ఇరువైపుల కంపిస్తాయి. శక్తిని ఒకచోటి నుండి వేరొక చోటికి ప్రయాణం చెందిస్తాయి.

తరంగం

యానకంలో ఏర్పడిన అలజడి (disturbance), యానక కణాల ఆవర్తన (periodic) చలనం వల్ల, ఒక చోటు నుంచి మరొక చోటుకి ప్రసారితమయ్యే ప్రక్రియను తరంగము (ఆంగ్లం: wave) అని అంటారు.

  • తరంగ ప్రసార ప్రక్రియలో యానక కణాలు, తమ మాథ్యమిక స్థానానికి రెండువైపులా కంపనం చేస్తాయి తప్ప తరంగంతో పాటు ముందుకు ప్రయాణించవు. శక్తికి ప్రతిరూపమైన అలజడి, ఒక కణం నుంచి మరో కణానికి బదిలీ అవుతూ ముందుకు సాగుతుంది. తరంగాలన్నీ శక్తిని జనక స్థానం నుండి ముందుకు తీసుకుని పోతాయి.

అనుదైర్ఘ్య తరంగాలకు ఉదాహరణలు

గంట నుండి వెలువడే శబ్ద తరంగాలు(అనుదైర్ఘ్య తరంగాలు)

లక్షణాలు

  • యానకంలో తరంగ ప్రసారదిశ కు యానకంలోని కణాల కంపన దిశ సమాంతరంగా ఉంటే వాటిని అనుదైర్ఘ్య తరంగాలు అందురు.
  • ఈ తరంగాల ప్రసారానికి స్థితిస్థాపకత మరియు జడత్వం కలిగిన యానకం అవసరం.(గాలి,ద్రవపదార్థం లేక ఘన పదార్థం)
  • ఇవి పురోగామి తరంగాలు.ఇవి అన్నిపైపులా ముందుకు పోతాయి.
  • ఈ తరంగాలకు ఉదాహరణ ధ్వని తరంగాలు.
  • వీటిలో కణాలు దగ్గరగా ఉన్న ప్రాంతాలను "సంపీడనాలు" , కణాలు దూరంగా ఉన్న ప్రాంతాలను "విరళీకరణాలు" అందురు.
  • రెండు వరుస సంపీడనాల మధ్య దూరం గాని లేదా రెండు వరుస విరళీకరణాల మధ్య దూరం గాని "తరంగ దైర్ఘ్యం" అవుతుంది.
  • ఈ తరంగాలు శూన్యంలో ప్రసారం చేయలేవు.
  • ఈ తరంగాలు ఏదయినా అడ్డంకి వచ్చినపుడు అవి 180 డిగ్రీలు పరావర్తనం చెంది మరల వెనుకకు వస్థాయి. అపుడు స్థిర తరంగాలు యేర్పడుతాయి.