Jump to content

వికీపీడియా:బాటు

వికీపీడియా నుండి
(వికీపీడియా:బాట్లు నుండి దారిమార్పు చెందింది)
అడ్డదారి:
WP:BOT
WP:BOTS

బాట్ అనేది తనంతట తానుగా నడుస్తూ వికీపీడియాలో ఉన్న వ్యాసాలకు మార్పులు-చేర్పులు చేస్తుంది. వికీపిడియా బాట్‌ల వాడుకను అంతగా ఆమోదించదు. ఎందుకంటే అది తన సర్వర్‌ల పైన భారం మోపటమే కాకుండా, బాట్లు చేసిన మార్పులను నియంత్రించటం కూడా కొంచెం కష్టం కాబట్టి.

అందుకనే మనుషులు చేసే కూర్పులకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి, ఎంతో జాగ్రత్తగా రూపొందించిన బాట్‌లను మాత్రమే అనుమతినివ్వాలి. అయితే మనుషులు చేయలేని కొన్ని పనులు బాట్‌ల ద్వారా చేయించుకోవచ్చు. బాట్లను మనము వ్యాసాలు సృష్టించటానికి, ఇతరులు సృష్టించిన వ్యాసాలకు మార్పులు చేయటానికి, లేదా ఇప్పటికే ఉన్న వ్యాసాలను నిర్మూలించటానికి వాడుకోవచ్చు. ఎంతో బాగా నిర్మించామనుకున్న బాట్‌లో కూడా కొన్ని లోపాలు ఉండే అవకాశం ఉంది. కాబట్టి బాట్‌లను చాలా జాగ్రత్తగా వాడవలసి ఉన్నది.

బాట్ హోదా ఎందుకు పొందాలి?

[మార్చు]

బాట్‌లు మార్పులు చేర్పులు చేసేటప్పుడు చాలా త్వరత్వరగా చేసేస్తూ ఉంటాయి, అవి చేసే మార్పులు ఒక నియంత్రిత పద్ధతిలో ఉంటాయని భావిస్తారు కాబట్టి అవి డిఫాల్టుగా ఇటీవలి మార్పులు పేజీలో కనిపించాల్సిన అవసరంలేదు. అంతేకాదు బాట్‌లు చేసే మార్పులు "ఇటీవలి మార్పులు" పేజీలో కనిపించినచో అసలు మనుషులు చేసే మార్పులు మరుగున పడిపోయే అవకాశం వుంది.

వీటన్నిటికీ విరుగుడుగా బాట్లకు బాట్ హోదా అనేదానిని కల్పించు కోవలిసిన అవసరం ఎంతయినా ఉంది. అలా బాట్ హోదా కలిగిన వాడుకరి (బాట్) తాను చేసిన మార్పులు డిఫాల్టుగా "ఇటీవలి మార్పులు" పేజీలో కనిపించటం జరుగదు. కాకపోతే మిగతా అన్ని చోట్లా (వ్యాస చరిత్ర మొదలయినవి) అవి చేసిన మార్పులు కనిపిస్తూ ఉంటాయి. ఇలా చేయటం వలన బాట్లు సాధారణ సభ్యులకు అడంకిగా ఉండవు, ఎవరో దుశ్చర్యకు పాల్పడుతున్నారనే అభిప్రాయానికి లోనవ్వరు. ఇటీవలి మార్పులు పేజీలో కూడా బాటు చేసిన మార్పులు చూడాలనుకున్నప్పుడల్లా ఆ పేజీ పై భాగంలో ఉన్న "ఇటీవలి మార్పుల ఎంపికలు" లో "బాట్లను చూపించు" నొక్కితే బాట్లు చేసిన ఇటీవలి మార్పులను కూడా చూపిస్తుంది.

బాట్ హోదా ఎలా పొందాలి?

[మార్చు]
  1. మొదటగా మీ బాట్‌కు ఒక వాడుకరి పేజీని తయారు చేయండి. అందులో ఈ క్రింది వివరములు పేర్కొనండి:
    • మీ బాట్ నిర్మాణమునకు ఎటువంటి సాంకేతికతను వాడారు, (pywikipedia, మొదలగునవి)
    • అది నడుచుటకు మనుషుల సహాయం అవరమా లేదా అనేదానిని వివరించండి.
    • ఏ ఏ సమయాలలో మీ బాట్ నడుస్తుంటుంది.
    • ఆ బాట్‌ను ఎవరు నడుపుతుంటారో వారి గురించి కూడా వివరించండి.
  2. ఆ తరువాత మీ బాట్‌కు నిర్వాహకుల దగ్గర లేదా తెలుగు వికీపీడియాలో బాగా అనుభవం ఉన్న వాడుకరుల దగ్గర ఆమోదం సంపాదించండి. వారి ఆమోదం సంపాదించటానికై ఈ క్రింది సమాచారం తెలుపండి.
    • మీ బాట్ నిర్మాణమునకు ఎటువంటి సాంకేతికతను వాడారు, (pywikipedia, మొదలగునవి)
    • అది నడుచుటకు మనుషుల సహాయం అవరమా లేదా అనేదానిని వివరించండి.
    • ఏ ఏ సమయాలలో మీ బాట్ నడుస్తుంటుంది.
    • తరువాత మీ బాట్‌ను ఎందుకు ఆమోదించాలో, తెలుగు వికీపీడియాకు దాని వలన ఏమి లాభాలు ఉంటాయో వివరించండి. ఇక్కడ మీ బాట్ ఏమి చేస్తుందో కూడా వివరిస్తే మంచిది.
  3. పైన తెలిపిన విధముగా మీ బాట్ యొక్క సమాచారాన్ని ఆమోదం కోసం ఇక్కడ ఉంచి, తరువాత ఇతర వాడుకరుల అంగీకారం కోసం నిరీక్షించండి.

అలా నిర్వాహకుల అంగీకారం సంపాదించిన తరువాత మీ బాటును కొంత సమయం నడిపి పరీక్షించండి. అంటే ఈ దశలో మీరు తయారు చేసిన బాట్ సరిగానే పని చేస్తుందని నిరూపించాలన్న మాట. అలా అందరి ఆమోదం పొందిన తరువాత మీ బాట్‌కు అధికారులు (బ్యూరోక్రాట్) "బాట్ హోదా" కల్పించగలరు.

ఇవి కూడా చూడండి

[మార్చు]