12 యాంగ్రీ మెన్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి యంత్రము మార్పులు చేస్తున్నది: es:12 Angry Men (película de 1957)
చి యంత్రము కలుపుతున్నది: bg:Дванадесет разгневени мъже
పంక్తి 44: పంక్తి 44:


[[en:12 Angry Men (1957 film)]]
[[en:12 Angry Men (1957 film)]]
[[bg:Дванадесет разгневени мъже]]
[[ca:Dotze homes sense pietat]]
[[ca:Dotze homes sense pietat]]
[[cs:Dvanáct rozhněvaných mužů (film, 1957)]]
[[cs:Dvanáct rozhněvaných mužů (film, 1957)]]

16:51, 11 మార్చి 2010 నాటి కూర్పు

12 Angry Men
original film poster
దర్శకత్వంSidney Lumet
రచనReginald Rose
నిర్మాతHenry Fonda
Reginald Rose
తారాగణంHenry Fonda
ఛాయాగ్రహణంBoris Kaufman
కూర్పుCarl Lerner
సంగీతంKenyon Hopkins
పంపిణీదార్లుUnited Artists
విడుదల తేదీs
United States:
April 13, 1957
సినిమా నిడివి
96 minutes
భాషEnglish
బడ్జెట్US$340,000 (estimated)

12 యాంగ్రీ మెన్ అనే నాటకం ఆధారంగా 1957 లో ఈ చిత్రం నిర్మించబడినది. అనుమానితుడు అయిన వ్యక్తి నిరపరాధి అని నమ్మిన ఒక న్యాయనిర్ణేత అనుమానితుడు అపరాధి అని నమ్మే మిగతా 11 మంది నిర్ణయాలను తన ఆలోచనలతో మరియూ ఊహాశక్తితో ఎలా మార్చగలిగాడు అన్నది ఈ చిత్ర కథాంశం.

కథాంశం

ఒక కుర్రవాడు తన తండ్రిని హత్య చేసాడన్న ఆరోపణ పైన కోర్టులో వాదోపవాదాలు ముగుస్తాయి. అమెరికన్ చట్ట ప్రకారం న్యాయనిర్ణేతలయిన 12 మంది తమలో తాము చర్చించుకొని ఏకగ్రీవంగా ఒప్పుకున్నపుడే దోషిని శిక్షించవచ్చు. ఏ ఒక్కరు ఒప్పుకొనకపోయినా తిరిగి విచారణ మొదలవుతుంది.

12 మంది న్యాయనిర్ణేతలు ఒక గదిలోకి వెళ్ళి నిజంగా ఆ కుర్రవాడు చేసాడా లేదా అన్న విషయం పైన చర్చించడం మొదలు పెడతారు. కోర్టులో సాక్షులు చెప్పిన దానిని బట్టి, మరి కొన్ని ఆధారాల ఆధారంగా ఆ కుర్రవాడు తన తండ్రిని హత్య చేసాడు అని 11 మంది న్యాయనిర్ణేతలు నిర్ణయిస్తారు. కేవలం ఒక్క న్యాయనిర్ణేత మాత్రం ఆ కుర్రవాడు హత్య చేసాడనడానికి ఆధారాలు లేవని, ఆ కుర్రవాడు హత్య చేసి ఉండడని అంటాడు.

ఆ ఒక్క న్యాయనిర్ణేత తన అభిప్రాయాలను తెలియజేసి, పలు సన్నివేశాలను ఊహించి ఆ కుర్రవాడు హత్య చేసి ఉండడు అని ఒక్కొక్క న్యాయనిర్ణేతను ఒప్పిస్తూ చివరగా 11 మందిని ఒప్పించడంతో ఆ కుర్రవాడు నిర్దోషి అని అందరూ ఒప్పుకుంటారు.

నిర్మాణం

దాదాపు మొత్తం సినిమా కేవలం ఒక గది ఉన్న సెట్‌లో తీయబడడం ఈ సినిమా విశిష్టత. మూడు నిమిషాలు మినహా మొత్తం సినిమా 16 x 24 అడుగుల గదిలో జరుగుతుంది. కథాంతంలో ఇద్దరు న్యాయనిర్ణేతలు తమ పేర్లు ఒకరికొకరు చెప్పుకోవడం మినహా సినిమా మొత్తంలో మరొక పేరు వినపడదు. 'కుర్రవాడు ' 'వృద్దుడు ' 'ఎదురింటిలో ఉన్న స్త్రీ ' అంటూ సంబోధనలు సాగుతాయి.

ఎంతో శ్రమించి రిహార్సిల్స్ చేయడం వలన కేవలం మూడు వారాలలో $350,000 ఖర్చుతో సినిమా నిర్మాణం పూర్తి అయినది..

స్పందన

విడుదల తర్వాత ఈ చిత్రం విమర్శకులనుండి సైతం గొప్ప పేరు తెచ్చుకుంది. కానీ అప్పటికే ప్రసిద్ది పొందుతున్న కలర్ సినిమాల వల్ల బ్లాక్ అండ్ వైట్‌లో నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద ఆశించినమేరకు కలెక్షన్లు రాబట్టలేకపోయింది. ఈ చిత్రం మూడు ఆస్కార్ అవార్డులకు ఎన్నికయింది. 8వ న్యాయనిర్ణేతగా హెన్రీ ఫోండా నటించిన పాత్ర 20వ శతాబ్దపు 50 గొప్ప పాత్రలలో 28వ స్థానంలో నిలిచింది. కోర్టు డ్రామాకు సంబంధించిన చిత్రాలలో ఇది రెండవ అత్యుత్తమ చిత్రంగా పేరుపొందింది. ఈ చిత్రం అమెరికన్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ 10 టాప్ 10 చిత్రాలు జాబితాలో కోర్ట్ రూం డ్రామా విభాగంలో రెండవ స్థానంలో నిలిచింది.

విడులయినపుడు ఘన విజయం సాధించని ఈ చిత్రం కాలక్రమంలో ఎంతో గొప్ప పేరు తెచ్చుకొని గొప్ప చిత్రాల జాబితాలో చేరింది. ఎన్నో సంస్థలు తమ ఉద్యోగులకు 'ఆలోచనా ధోరణి ' గురించి బోధించడానికి ఈ చిత్రాన్ని ఉపయోగిస్తున్నాయి.

బయటి లింకులు