దివ్యజ్ఞాన సమాజం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి యంత్రము కలుపుతున్నది: he:האגודה התאוסופית
చి యంత్రము కలుపుతున్నది: ca:Societat Teosòfica
పంక్తి 19: పంక్తి 19:


[[en:Theosophical Society]]
[[en:Theosophical Society]]
[[ca:Societat Teosòfica]]
[[da:Det Teosofiske Samfund]]
[[da:Det Teosofiske Samfund]]
[[de:Theosophische Gesellschaft]]
[[de:Theosophische Gesellschaft]]

09:45, 17 జూన్ 2010 నాటి కూర్పు

దివ్యజ్ఞాన సమాజం వారి చిహ్నము

దివ్యజ్ఞాన సమాజము అమెరికా లోని న్యూయార్క్ నగరం లో 1875 లో హెలీనా బ్లావట్‌స్కీ, హెన్రీ స్టీల్ ఆల్కాట్ , విలియం క్వాన్ జడ్జ్ మరియు ఇతరుల చే స్థాపించబడింది. దీన్ని స్థాపించిన కొన్ని సంవత్సరాల తర్వాత బ్లావట్‌స్కీ, ఆల్కాట్ చెన్నై వచ్చి అడయార్ అనే ప్రాంతంలో ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ వారు ఆసియా దేశాలలోని ఇతర మతాలను కూడా అధ్యయనం చేయాలని భావించారు.

లక్ష్యాలు

సధీర్ఘమైన చర్చలు, పునశ్చరణలు జరిపి ఈ సమాజం యొక్క లక్ష్యాలను ఈ క్రింది విధంగా పేర్కొన్నారు.

  1. జాతి, లింగ, వర్ణ, మత, కులాలకు అతీతంగా మానవజాతిలో సార్వత్రిక సార్వభౌమత్వాన్ని పెంపొందించడం.
  2. వివిధ మతాలని, తత్వశాస్త్రాన్ని, సైన్సు అధ్యయనాన్ని ప్రోత్సహించడం
  3. ప్రకృతిలోనూ, మానవునిలోనూ దాగున్న నిగూఢ రహస్యాలను పరిశోధించడం

ఇవి కాకుండా 1889లో బ్లావట్‌స్కీ తాను వచ్చే జన్మలో ప్రపంచ గురువుగా జన్మిస్తాననీ, అందుకు మానవాళిని సంసిద్ధులను చేయడమే సంస్థ యొక్క అసలైన ఉద్దేశ్యమనీ కొంతమంది విద్యార్థులతో పేర్కొన్నాడు. ఇదే విషయాన్ని అనీబిసెంట్ కూడా బ్లావట్‌స్కీ చనిపోయిన ఐదు సంవత్సరాల తర్వాత 1896 లో పునరుద్ఘాటించింది. [1] బ్లావట్‌స్కీ స్వీయ రచనల్లో తన పునర్జన్మకు కనీసం ఒక శతాబ్ద కాలం పట్టవచ్చని ప్రస్తావించాడు.[2].

జిడ్డు క్రిష్ణమూర్తి

1909 సంవత్సరంలో ఈ ఉద్యమంలో ఒక నాయకుడైన లీడ్‌బెల్ట్ జిడ్డు కృష్ణమూర్తి ని తమ భవిష్య నాయకుడిగా భావించాడు. కృష్ణమూర్తి కుటుంబం జనవరి 1909 న చెన్నైలోని ప్రధాన కార్యాలయానికి మారారు. 1925 సంవత్సరం నుంచి ఆయన క్రమంగా ఈ ఉద్యమం నుంచి వేరుపడడం ప్రారంభించాడు. 1931 లో దాన్ని పూర్తిగా వదిలిపెట్టేశాడు.

మూలాలు

  1. Krishnamurti: The Years of Awakening, Mary Lutyens (John Murray) 1975, p.12
  2. Blavatsky Collected Writings Volume XII, page 492