కర్బన వలయం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.7.2) (యంత్రము కలుపుతున్నది: is:Hringrás kolefnis
చి r2.7.2+) (యంత్రము కలుపుతున్నది: tr:Karbon döngüsü
పంక్తి 48: పంక్తి 48:
[[sv:Kolcykeln]]
[[sv:Kolcykeln]]
[[th:วัฏจักรคาร์บอน]]
[[th:วัฏจักรคาร์บอน]]
[[tr:Karbon döngüsü]]
[[uk:Вуглецевий цикл]]
[[uk:Вуглецевий цикл]]
[[ur:کاربن چکر]]
[[ur:کاربن چکر]]

17:42, 17 మే 2012 నాటి కూర్పు

కర్బన వలయం

కర్బన వలయం లేదా కార్బన్‌ సైకిల్‌ లేదా కర్బన ఆవృతం అంటే వాతావరణంలోని కార్బన్‌ డయాక్సైడులోని కర్బనము‌ ప్రాణులలోకి ప్రవేశించి, తిరిగి వాతావరణంలోకి విడుదల కావడం.

మొక్కలు సూర్యరశ్మి సాయంతో గాలిలోని కార్బన్‌ డయాక్సైడు నుండి కార్బన్‌ను కిరణజన్య సంయోగక్రియ ద్వారా గ్రహిస్తాయి. ఈ కార్బన్‌, కార్బోహైడ్రేట్స్ ‌లాంటిపదార్థాలుగా మార్పు చెంది మొక్కలకు కావలసిన శక్తిని ఇస్తుంది. రాత్రి వేళల్లోమొక్కలు శ్వాసక్రియలో భాగంగా కార్బన్‌ డయాక్సైడును వదిలి ఆక్సిజన్ ‌నుపీల్చుకుంటాయి. మొక్కలను ఆహారంగా తీసుకున్నప్పుడు వాటిలోని కార్బన్‌,జీవుల శరీరంలోకి చేరుకుంటుంది. జీవులు శ్వాసించే ప్రక్రియలో ఆక్సిజన్‌నుపీల్చుకుని కార్బన్‌ డయాక్సైడును వ్యర్థ పదార్థ రూపంలో వాతావరణంలోకివదులుతాయి. జీవుల విసర్జనల్లోని కార్బన్‌ కూడా వాతావరణంలో కలుస్తుంది.అలాగే సముద్రం లోని నీటిలో కార్బన్‌ డయాక్సైడు కొంతమేర కరిగిపోగా కొంత ఆవిరై గాలిలోకి చేరుతుంది. మరికొంత సముద్ర ప్రాణులు స్వీకరిస్తాయి.జలచరాలు చనిపోయినప్పుడు వాటి అవశేషాల్లో కార్బన్‌ నిక్షిప్తమై ఉంటుంది.మొక్కలు, జంతువులు చనిపోయినప్పుడు కార్బన్‌ డయాక్సైడు విడుదలఅవుతుంది. మొక్కల్లో ఉండే కార్బన్‌ బొగ్గు, సహజవాయువు, పెట్రోలు లాంటిఇంధనాల్లో ఉండడం వల్ల వాటిని మండించినప్పుడు కూడా కార్బన్‌ డయాక్సైడులోనికార్బన్‌ వాతావరణంలోకి చేరుకుంటుంది. ఈ మొత్తం వలయాన్నే కర్బన ఆవృతంఅంటారు.[1]

మూలాలు

  1. ఈనాడు శుక్రవారం మార్చి 26, 2010, హాయ్ బుజ్జీ శీర్షిక