వికీపీడియా:తటస్థ దృక్కోణం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి Bot: Migrating 89 interwiki links, now provided by Wikidata on d:q4656487 (translate me)
చి Bot: Migrating 1 interwiki links, now provided by Wikidata on d:q4656487 (translate me)
పంక్తి 53: పంక్తి 53:
[[వర్గం:Wikipedia official policy|{{PAGENAME}}]]
[[వర్గం:Wikipedia official policy|{{PAGENAME}}]]


[[min:Wikipedia:Suduik pandang netral]]
[[qu:Wikipidiya:Mana hukllap qhawariyninlla]]
[[qu:Wikipidiya:Mana hukllap qhawariyninlla]]

20:42, 11 మార్చి 2013 నాటి కూర్పు

సంక్షిప్తంగా ఈ పేజీలోని విషయం: వికీపీడియాలోని వ్యాసాలన్నీ తటస్థ దృక్కోణంతో రాయాలనేది వికీపీడియా విధానం. అన్ని ప్రముఖ దృక్కోణాలు, ప్రధానమైన చిన్న, చిన్న దృక్కోణాలను వ్యాసాలు నిష్పాక్షికంగా ప్రతిబింబించాలి.

తటస్థ దృక్కోణం అనేది వికీమీడియా మౌలిక సూత్రాలలో ఒకటి. వికీపీడియాలోని అన్ని వ్యాసాలు మరియు విజ్ఞాన సర్వస్వపు అంశాలు అన్ని ప్రముఖ దృక్పధాలను, మరియు ప్రధానమైన ఇతర దృక్పధాలకు ప్రాతినిధ్యం కలిగించాలి. నమ్మదగిన ఆధారాలున్న, ఇతర వేదికలలో ప్రచురింపబడిన, అన్ని దృక్పధాలకూ స్థానం ఉండాలి.


వికీపీడియా విషయ సంగ్రహానికి సంబంధించినవి మూడు ముఖ్యమైన విధానాలున్నాయి. అవి:


ఈ మూడు విధానాలు కలిసి వికీపీడియాలో ఉంచదగిన విషయం మౌలిక పరిధులను నిర్దేశిస్తాయి. ఒక వ్యాసపు నాణ్యతను, వికీపీడియా ప్రమాణికతను నిర్ణయిస్తాయి. కాబట్టి వీటిని సంయుక్తంగా పరిశీలించాలి గాని, విడివిడిగా చూడరాదు. సభ్యులంతా వీటి గురించి బాగా తెలుసుకొని ఉండాలి. ఈ మూడు సూత్రాలను దేనికదే విడివిడిగా కాక సంయుక్తంగా, విచక్షణతో అమలు చేయాలి. అంతే కాకుండా ఈ మౌలిక సూత్రాలను సభ్యుల ఏకాభిప్రాయంతో కూడా రద్దుచేయరాదు. ఈ మౌలిక సూత్రాల ఆచరణను, వివరణను మరింత మెరుగుపరచే దిశలో మాత్రమే ఈ పాలిసీల పేజీలను దిద్దవచ్చును.

ఉపోద్ఘాతం

వికీపీడియాలోని వ్యాసాలన్నీ తటస్థ దృక్కోణంతో రాయాలనేది వికీపీడియా విధానం. అన్ని ప్రముఖ దృక్కోణాలు, ప్రధానమైన చిన్న, చిన్న దృక్కోణాలను వ్యాసాలు నిష్పాక్షికంగా ప్రతిబింబించాలి. తేలిగ్గా అపార్ధం చేసునే అవకాశం గల విధానమిది. వికీపీడియా గొప్పతనమేమిటంటే, వ్యాసాలు పక్షపాత రహితంగా ఉండేందుకు ఇక్కడి సభ్యులంతా కృషిచేస్తారు.


నిష్పాక్షికంగా రాయడానికి సాధన అవసరం. ఇది ఎలా రాయాలనే విషయమై అనుభవజ్ఞులైన సభ్యులు తమ సలహాలను ఒక పాఠంగా రాయాలని కోరుతున్నాం.


తటస్థత - ప్రాధమిక భావన

వికీపీడియా లో "నిష్పాక్షికత", "తటస్థ దృక్కోణం" అనే వాటిని మామూలు అర్ధానికి భిన్నంగా, చాలా ఖచ్చితమైన అర్ధంలో వాడతాము:

వ్యాసాలు చర్చలను నిష్పాక్షికంగా వివరించాలి గానీ, చర్చలో ఏదో ఒక పక్షం గురించి బోధించ కూడదు. ప్రజలు సాధారణంగా అంతర్గతంగా పక్షపాతం కలిగి ఉంటారు గనుక, ఇది కష్టమైన విషయమే. కనుకనే వ్యాసాలలో ప్రధాన దృక్పధాలకు అన్నింటికీ సముచితమైన స్థానం కల్పించమని కోరుతున్నాం. ఈ దృక్కోణం సరైనది, మరొకటి సరి కానిది, ఇంకొకటి హానికరమైనది - వంటి వ్రాతలు కాని, సూచనలు కాని వ్యాసాలలో అసలు తగవు.
తటస్థ దృక్కోణం ముందుగా ఇలా నిర్వచించారు.


ఆంగ్ల వికీలో సంబంధిత వ్యాసాలు