వికీపీడియా:ఏది వికీపీడియా కాదు

వికీపీడియా నుండి
(వికీపీడియా:What Wikipedia is not నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
అడ్డదారి:
WP:NOT
WP:ISNOT

వికీపీడియా ఓ అంతర్జాల (ఆన్‌లైను) విజ్ఞాన సర్వస్వము, దానికోసం ఏర్పడిన ఓ అంతర్జాల (ఆన్‌లైను) సముదాయం. వికీపీడియాలో ఏమేం ఉండాలి అనేందుకు కొన్ని మార్గదర్శకాలు ఉన్నాయి. అందుచేత, వికీపీడియా కానివి కూడా కొన్ని ఉన్నాయి. వాటిని గురించిన వివరాలు.

ఆకృతి

[మార్చు]

వికీపీడియా పుస్తక విజ్ఞానసర్వస్వం కాదు

[మార్చు]
Policy shortcut:

వికీపీడియా పుస్తక విజ్ఞానసర్వస్వం కాదు. ఇక్కడ వ్యాసాల సంఖ్యకు పరిమితి లేదు. అయితే డయలప్ ఇంటర్నెట్ కనెక్షను, మొబైలు బ్రౌజరునూ దృష్టిలో నుంచుకుని, వ్యాసపు సైజును నియంత్రించాలి. అలాగే అందరికీ వర్తించేలా చదవడానికి వీలయ్యే కొన్ని పరిమితులున్నాయి. వ్యాసం ఓ స్థాయికి పెరిగాక, దాన్ని వేరువేరు వ్యాసాలుగా విడగొట్టి, ప్రధాన వ్యాసంలో సారాంశాలను ఉంచడం వ్యాసం అభివృద్ధిలో ఓ భాగం. విజ్ఞాన సర్వస్వం పుస్తకాల్లో చిన్నవిగా ఉండే వ్యాసాలు ఇక్కడ విస్తారంగా, మరిన్ని విశేషాలతో కూడుకుని ఉండొచ్చు.

ఓ వ్యాస విషయానికి దగ్గరగా ఉన్న మరో విషయపు వ్యాసానికి దారిమార్పు చెయ్యాల్సిన అవసరం లేదు. దీని కోసం ప్రత్యేకంగా వ్యాసం రాసి, "ఇవి కూడా చూడండి" విభాగంలో రెండో వ్యాసపు లింకు ఇవ్వవచ్చు.

పాఠ్యం (కంటెంటు)

[మార్చు]

నిజమైన, పనికొచ్చే సమాచారం అనే ఏకైక కారణంతో వికీపీడియాలో పెట్టెయ్యకూడదు. అలాగే లభిస్తున్న ప్రతీ ఒక్క సమాచారాంశాన్నీ ఇక్కడ పెట్టెయ్యకూడదు, విషయానికి సంబంధించిన సారాంశాన్ని మాత్రమే ఇక్కడ రాయాలి. వికీపీడియాకు తగని పాఠ్యమేదో కింద ఇవ్వబడినవి కొన్ని ఉదాహరణలు.

వికీపీడియా నిఘంటువు కాదు

[మార్చు]

వికీపీడియా నిఘంటువు కాదు. పారిభాషిక పదకోశమూ కాదు. దీనికోసం వికీ సోదర ప్రాజెక్టు విక్షనరీ ఉంది. మీకు ఆసక్తి ఉంటే విక్షనరీలో చేయూత నివ్వండి. విక్షనరీ ఇటీవలి మార్పులు కోసం ఇక్కడ చూడండి.

వికీపీడియా వ్యాసాలు:
 1. నిర్వచనాలు చెప్పే నిఘంటువు కాదు. వికీపీడియా నిఘంటువు కాదు కాబట్టి, కేవలం పదానికి నిర్వచనం రాసేందుకు మాత్రమే పేజీ సృష్టించకండి. కొన్ని విషయాలకు సంబంధించి వ్యాసం నిర్వచనంతోటే మొదలు కావాల్సి రావడం తప్పనిసరి కావచ్చు. నిర్వచనం తప్ప మరేమీ లేని వ్యాసం మీ దృష్టికి వచ్చినపుడు ఆ పేజీలో ఇంకేమైనా రాయగలరేమో చూడండి. సంఖ్యలకు ఇచ్చే సాంస్కృతిక అర్థాలు దీనికి మినహాయింపు.
 2. అలాంటి నిర్వచనాల జాబితా కూడా కాదు. అయితే, అయోమయ నివృత్తి కోసం ఒక పదానికి చెందిన సమానార్థకాల జాబితా పెట్టవచ్చు. కొన్ని ప్రత్యేక రంగాలకు సంబంధించిన పదాల కోశం కూడా వికీపీడియాలో పెట్టవచ్చు.
 3. వినియోగ మార్గదర్శిని గానీ, వాడుకపదాలు, జాతీయాల మార్గదర్శిని గానీ కాదు. వికీపీడియా పదాలను, జాతీయాలను ఎలా వాడాలో చెప్పే మార్గదర్శిని కాదు. ఎలా మాట్లాడాలో ప్రజలకు శిక్షణనిచ్చే స్థలం కాదు.

వికీపీడియా ఒక వ్యక్తిగత ఆలోచన లేదా అభిప్రాయం కాదు

[మార్చు]

వికీపీడియా మీ ఆలోచనలు, అభిప్రాయాలు, విశ్లేషణలు ప్రచురించే స్థలం కాదు. వికీపీడియాలో..

 1. ప్రాథమిక (మౌలిక) పరిశోధన కూడదు: కొత్త సిద్ధాంతాలు, పరిష్కారాల ప్రతిపాదన, కొత్త ఉపాయాలు, కొత్త నిర్వచనాలు, కొత్త పదాల సృష్టి వికీపీడియాలో కూడదు. వికీపీడియా:మౌలిక పరిశోధన కూడదు చూడండి. మీవద్ద అలాంటి మౌలిక పరిశోధన ఉంటే సమీక్ష కోసం దాన్ని తగిన పత్రికలు, వేదికలకు సమర్పించండి. సమీక్ష తరువాత అది విజ్ఞానంలో భాగంగా చేరితే అపుడు వికీపీడియా దానిపై వ్యాసాన్ని ప్రచురిస్తుంది.
 2. విమర్శనాత్మక సమీక్షలు: జీవిత కథలు, కళకు, కళాసృష్టికి సంబంధిచిన వ్యాసాలు వికీపీడియాలో ఉండవచ్చు. కళపై విమర్శనాత్మక వ్యాసాలు ఉండవచ్చు, కానీ అవి ఇప్పటికే ప్రచురితమైన విమర్శపై ఆధారితంగా ఉండాలి. కింద 5 వ అంశం చూడండి.
 3. వ్యక్తిగత వ్యాసావళి: వికీపీడియా ఏదైనా విషయంపై మీ అభిప్రాయాలు వెల్లడించే వేదిక కాదు. మీ అభిప్రాయాన్ని చేర్చాల్సిన అసాధారణ అవసరం ఏర్పడితే ఆ పనిని (మీరు వెలిబుచ్చిన అభిప్రాయాన్ని వికీపీడియాలో రాసే పనిని) ఇతరులను చెయ్యనివ్వండి, మీరు చెయ్యకండి.
 4. ప్రస్తుత ఘటనలపై అభిప్రాయాలు: పై విషయానికే చెందిన ఓ ప్రత్యేక సందర్భం ఇది. ప్రస్తుతం జరుగుతున్న ఘటనలపై మీ అభిప్రాయాలు ఇక్కడ వెల్లడించరాదు.
 5. చర్చా వేదికలు: ఇక్కడ మనం చేసే పని విజ్ఞాన సర్వస్వం తయారు చెయ్యడం. దానికి సంబంధించిన చర్చ కోసం సభ్యుల లేదా వ్యాసపు చర్చాపేజీలను వాడండి. అది కూడా వ్యాసాన్ని ఎలా మెరుగు పరచాలనే విషయానికే పరిమితం చెయ్యండి. ఏ చర్చనైనా వ్యాసాల్లో చెయ్యకండి.
 6. జర్నలిజము: వికీపీడియా ఎప్పటికప్పుడు వేడివేడిగా వార్తలందించే వార్తా వెబ్‌సైటు కాదు.

వికీపీడియా ప్రచార వాహనం కాదు

[మార్చు]

వికీపీడియా ప్రచార వాహనం కాదు. కాబట్టి వికీపీడియా..

 1. ప్రచార వేదిక కాదు: వికీపీడియా ఏదైనా విషయాన్ని ప్రచారం చేసే వేదిక కాదు.
 2. సొంత డబ్బా కాదు: మీ గురించి, మీరేం చేసారు, చేస్తున్నారు, ఏయే ప్రాజెక్టుల్లో పని చేస్తున్నారు మొదలైనవి రాసుకునే వీలు వికీపీడియాలో ఉన్నప్పటికీ, అన్ని పేజీలకు లాగానే ఆ పేజీలు కూడా విజ్ఞాన సర్వస్వం ప్రమాణాలు పాటించాలని గుర్తుంచుకోండి. మరీ అతిగా లింకులు ఇచ్చుకోవడం వంటివి చెయ్యరాదు.
 3. వ్యాపార ప్రకటనా స్థలం కాదు: సంస్థలు, ఉత్పత్తుల గురించి వ్యాసాలు రాయవచ్చు. అయితే అవి నిష్పాక్షికంగా, విషయ ప్రధానంగా ఉండాలి. వ్యాసంలోని విషయాలన్నీ నిర్ధారణ చేసుకునేందుకు వీలుగా ఉండాలి. అంచేతనే, చిన్న చితకా సంస్థల గురించి రాసిన వ్యాసాలు ఆమోదయోగ్యం కాకపోవచ్చు. వ్యాస విషయానికి సంబంధించినవైతే సంస్థల వెబ్‌సైట్లకు బయటి లింకులు కూడా ఇవ్వవచ్చు. వికీపీడియా ఏ వ్యాపార సంస్థకు గానీ, వ్యాపారానికి గానీ ప్రచారం చెయ్యదు.

వికీపీడియా ఇతర సైట్లకు మిర్రరు గానీ, లింకులు, బొమ్మలు, మీడియా ఫైళ్ళ ఖజానా గానీ కాదు

[మార్చు]

వికీపీడియా ఇతర సైట్లకు మిర్రరు గానీ, లింకులు, బొమ్మలు, మీడియా ఫైళ్ళ ఖజానా గానీ కాదు. ఇక్కడ తయారయ్యే ప్రతీ వ్యాసంలోనూ నిర్దాక్షిణ్యంగా మార్పుచేర్పులు చేసి, వ్యాసాన్ని తుదిరూపుకు తీసుకురావాలి. ఇక్కడ మీరు ఏది రాసినా, దాన్ని GNU FDL కు అనుగుణంగా విడుదల చేస్తున్నట్లే. వికీపీడియా వ్యాసాలు-

 1. బయటి లింకుల సంగ్రహమో లేక ఇంటర్నెట్ డైరెక్టరీల సంగ్రహమో కాదు: వ్యాస విషయానికి సంబంధించిన బయటి లింకులను చేర్చడంలో తప్పేమీ లేదు. అయితే మరీ వ్యాసాన్ని మింగేసే స్థాయిలో ఎక్కువ లింకులు చేర్చకూడదు.
 2. అంతర్గత లింకుల సమాహారం కాదు: అయోమయ నివృత్తి పేజీలు తప్పించి, ఏ పేజీ కూడా అంతర్గతలింకుల జాబితా లాగా ఉండకూడదు.
 3. సార్వజనికమైన వనరుల సంగ్రహం కాదు: చారిత్రక దస్తావేజులు, పుస్తకాలు, ఉత్తరాలు, చట్టాలు మొదలైన వాటి పూర్తి పాఠాలను యథాతథంగా వికీపీడియా వ్యాసాల్లో పెట్టరాదు. అలాంటి పూర్తి పాఠాలు పెట్టేందుకు అనువైన స్థలం వికీసోర్సు. అయితే అలాంటి సార్వజనిక వనరుల లోని విషయాలను వికీపీడియా వ్యాసాల్లో వాడుకోవచ్చు.
 4. ఏ వ్యాసానికీ సంబంధం లేని ఫోటోలు, బొమ్మలు, ఇతర మీడియా ఫైళ్ళ సంగ్రహం కాదు: వ్యాసానికి సంబంధం లేని, వివరాలేమీ లేని ఫొటోలు, బొమ్మలను ఇక్కడ ఎక్కించవద్దు. అలాంటి వాటిని వికీమీడియా కామన్స్ లో పెట్టండి.

వికీపీడియా ఉచితంగా స్పేసు ఇచ్చే వెబ్‌హోస్టు కాదు

[మార్చు]

వికీపీడియాలో మీ సొంత వెబ్‌సైటు, బ్లాగు, వికీ మొదలైనవి పెట్టరాదు. వికీ టెక్నాలజీ వాడి ఏదైనా చెయ్యాలని మీకు ఆసక్తి ఉంటే దానికి చాలా సైట్లున్నాయి (ఉచితంగా గానీ, డబ్బులకు గానీ). అలాగే మీరే స్వంత సర్వరులో వికీ సాఫ్టువేరును స్థాపించుకోవచ్చు. వికీపీడియా-

 1. మీ వ్యక్తిగత పేజీలు కాదు: వికీపీడియనులకు తమ స్వంత పేజీలున్నాయి. కానీ వాటిని తమ వికీపీడియా పనికి సంబంధించిన వాటికి మాత్రమే వాడాలి. వికీయేతర పనుల కోసం పేజీలు అవసరమైతే ఇంటర్నెట్లో దొరికే అనేక ఉచిత సేవలను వాడుకోండి.
 2. ఫైళ్ళు దాచిపెట్టుకునే స్థలం కాదు: వ్యాసాలకు అవసరమైన ఫైళ్ళను మాత్రమే అప్‌లోడు చెయ్యండి; అలా కానివి ఏవైనా సరే తొలగిస్తారు. మీ దగ్గర అదనంగా బొమ్మలుంటే వాటిని కామన్స్ లోకి అప్‌లోడు చెయ్యండి, అవసరమైనప్పుడు వాడుకోవచ్చు.

వికీపీడియా వార్తాపత్రిక కాదు

[మార్చు]

విశిష్టత ఉన్న, నిర్ధారించుకోదగ్గ వార్తాంశాల కోసం వికీపీడియాలో వ్యాసాలు రాయవచ్చు. కానీ అంతమాత్రాన వార్తల్లో వచ్చే ప్రతీ ఒక్క చిన్న అంశానికీ ఇక్కడ చోటులేదు.

 1. ఒరిజినల్ రిపోర్టులు కూడదు: వికీపీడియా తాజావార్తలను ప్రచురించే పత్రిక కాదు.
 2. వార్తల నివేదిక కాదు: వికీపీడియా పత్రికల్లో వచ్చిన వార్తల నివేదికను ప్రచురించే స్థలం కాదు. వార్తల ప్రాముఖ్యతను బట్టి వాటికి వికీ వ్యాసాల్లో చోటు కల్పించవచ్చు. ఉదాహరణకు "రేపు భారత ఆస్ట్రేలియాల మధ్య క్రికెట్ పోటీ జరగనుంది" అనే వార్తను వికీలో పెట్టాల్సిన పనిలేదు. కానీ "భారత సైన్యం నియంత్రణ రేఖను దాటి లక్ష్యిత దాడులు చేసింది" అనే వార్తకు ఆ ప్రాముఖ్యత ఉంది.
 3. ఎవరెవరు ఎంతెంతవారు అనే జాబితా కాదు. సంఘటన ముఖ్యమైనంత మాత్రాన అందులో ప్రమేయమున్న ప్రతీ ఒక్కరూ అంత ముఖ్యమైనవారు కాకపోవచ్చు.
 4. దైనందిని కాదు: వ్యక్తులు ముఖ్యమైనవారే అయినప్పటికీ, వారికి ప్రమేయమున్న ప్రతీ సంఘటనా ముఖ్యమైనదే కానక్కరలేదు. "ఇస్రో డైరెక్టరు మానవ సహిత యాత్ర తేదీని ప్రకటించారు" అనే వార్త వికీపీడియార్హమే. అంత మాత్రాన, "ఇస్రో డైరెక్టరు తన స్నేహితుడి కూతురు పెళ్ళికి రామాపురం వచ్చారు" అనేది కాదు.

వికీపీడియా భవిష్యత్తు చూసే మాయాదర్పణం కాదు

[మార్చు]

భావి ఘటనలు విజ్ఞాన సర్వస్వంలో భాగం కావు. జరిగేదాకా అసలవి జరుగుతాయో లేదో చెప్పలేని ఘటనలైతే మరీను.

 1. ఘటనా క్రమాన్ని ముందే నిర్ణయించినంత మాత్రాన ఆ ఘటనలు వ్యాసాలుగా పనికిరావు: ఉదాహరణకు 2028 ఒలింపిక్స్ గురించి ఇప్పటి నుండే వ్యాసం రాయడం సమంజసంగా ఉండదు. వచ్చే సంవత్సరం కూడా సూర్యుడు తూర్పునే ఉదయిస్తాడు అన్నంత ఖచ్చితంగా జరిగే ఘటనల గురించి రాయవచ్చేమోగానీ, ఇలాంటి విషయాల మీద వ్యాసాలు కూడదు.
 2. అలాగే భవిష్యత్తులో ఫలానా ఘటన జరిగితే ఈ పేరు పెడదాం అని ముందే పేర్లు నిర్ణయించుకుని పెట్టే విషయాలు కొన్ని ఉన్నాయి. అలాంటి విషయాలకు వ్యాసాలు రాయరాదు. ఉదాహరణకు తుఫానులకు పేర్లు పెట్టే పద్ధతి. 2010లో వచ్చే తుపానులకు ఫలానా పేర్లు పెడదాం అని ముందే పేర్ల జాబితా తయారు చేసి పెట్టుకుంటారు. ఎలాగూ పేర్లు పెట్టేసారు కదా అని వ్యాసాలు రాసెయ్యకూడదు.
 3. భవిష్యత్తు గురించిన లెక్కలు, ఊహలు, "భవిష్యత్తు చరిత్రల" గురించి చెప్పే రచనలు వికీపీడియాలో కూడవు. ఇవి మౌలిక పరిశోధన కిందకి వస్తాయి. అయితే అలాంటి తార్కిక, సంబద్ధ వ్యాసాల గురించి వికీపీడియాలో రాయవచ్చు. స్టార్ వార్స్ గురించి వ్యాసం రాయవచ్చు కానీ "నాలుగో ప్రపంచ యుద్ధంలో వాడబోయే ఆయుధాలు" అనే వ్యాసానికిక్కడ చోటులేదు.

వికీపీడియా విచక్షణా రహితమైన సమాచార సంగ్రహం కాదు

[మార్చు]

వికీపీడియా విచక్షణా రహితమైన సమాచార సంగ్రహం కాదు. నూటికి నూరుపాళ్ళూ నిజమైన ప్రతి విషయమూ వికీపీడియాలో చేర్చదగినదేం కాదు. వికీపీడియా వ్యాసాలు..

 1. సృజనాత్మక కృతుల సంగ్రహాన్ని ప్రచురించే సైటు కాదు. సృజనాత్మక కృతులను (ఉదాహరణకు సాహితీ కృతులు, చిత్రాలు, వీడియో గేములు, డాక్యుమెంటరీలు, పరిశోధనా ప్రచురణలు, ఆధ్యాత్మిక గ్రంథాలు మొదలైనవి) వికీపీడియా విజ్ఞానసర్వస్వం ధోరణి లోనే చూస్తుంది. ఆ కృతిని ఎలా అభివృద్ధి చేసారు, దాని రూపురేఖలేంటి, దానికి ఎలాంటి ప్రజాదరణ లభించింది, దాని ప్రశస్తి ఏంటి, దాని ప్రభావం ఏంటి అనేవాటి గురించి రాయాలి. అలా రాస్తూ కావాలంటే ఆ కృతులను సంక్షిప్తంగా రాయవచ్చు.
 2. పాటల సాహిత్యాన్ని ప్రచురించే సైటు కాదు ఏదైనా సినిమా పాట గురించి గానీ, ఇతర గేయాల గురించి గానీ పేజీ రాస్తే అందులో ఆ పాట ఎవరు రాసారు, ఎప్పుడు ప్రచురించారు, ఏ సినిమాలో వచ్చింది, ఎవరు నటించారు, గాయకులు, సంగీత కర్త, రాగం, అది కలిగించిన ప్రభావం వగైరా విషయాలను రాయాలి. పాట లోని ఏదైనా భాగాన్ని ఉల్లేఖించాలంటే దాన్ని క్లుప్తంగా, మిగతా వ్యాస పరిమాణానికి సరైన నిష్పత్తిలో ఉండేలా రాయాలి. ఆ ఉల్లేఖన ఏదైనా చర్చకు దారితీసేదై ఉండాలి లేదా శైలిని వివరించేలా ఉండాలి. పాట సాహిత్యం మొత్తాన్ని పెట్టాలంటే వికీసోర్స్ లో పెట్టవచ్చు. 1928 తరువాత ప్రచురించిన పాటల సాహిత్యంలో చాలావరకు కాపీహక్కుల పరిధిలో ఉంటాయి; వాటిని ఉల్లేఖించే పనైతే దాన్ని వీలైనంత కనిష్ఠ పరిమాణంలో ఉంచాలి. అది కూడా ఏదైనా శైలిని వివరించే సందర్భం లోనో, లేదా ఏదైనా వ్యాఖ్య చేసే సందర్భంలోనో మాత్రమే ఉదహరించాలి. ఆ పాటకు సంబంధించి బయటి లింకు ఇచ్చేటపుడు, సదరు సైటుకు ఆ పాటను పంపిణీ చేసే కాపీహక్కు ఉందని నిర్థారించుకున్నాకే ఇవ్వాలి.
 3. తరచూ అడిగే ప్రశ్నల జాబితాలు కాదు. వ్యాసాల్లో తరచూ అడిగే ప్రశ్నల జాబితాలు చేర్చరాదు. దాని బదులు, అదే సమాచారాన్ని ఓ పద్ధతిలో వ్యాసంగా అమర్చండి.
 4. అనేక చిన్న చిన్న విషయాలను గుదిగుచ్చి చూపించే సంగ్రహం కాదు: సూక్తులు, గొప్పవారి ఉటంకింపులు, ఉల్లేఖనలు మొదలైన వాటి ఏరి కూర్చి పెట్టే సంగ్రహం కాదు.
 5. ప్రయాణ మార్గదర్శిని కాదు: విశాఖపట్టణం వ్యాసంలో దాల్ఫిన్స్ నోస్ గురించి, రామకృష్ణా బీచ్ గురించి ఉండొచ్చు. అంతేగానీ, అక్కడ ఏ హోటల్లో గది అద్దెలు తక్కువగా ఉంటాయి, భోజనం ఎక్కడ బాగుంటుంది, ఫలానా చోటికి వెళ్ళాలంటే ఏ నంబరు బస్సెక్కాలి ఇలాంటివి ఉండకూడదు.
 6. జ్ఞాపికలు రాసుకునే స్థలం కాదు: సన్నిహితుల మరణం దుస్సహమే. అంతమాత్రాన వాళ్ళ జ్ఞాపకాలను, సంతాప తీర్మానాలను రాసుకోడానికి వికీపీడియాను వాడుకోరాదు. వారి గురించి వ్యాసం రాయాలంటే, దానికి తగ్గ ప్రఖ్యాతి కలిగి ఉండాలి.
 7. వార్తా నివేదికలు కాదు: వికీపీడియా వేడివేడిగా వార్తలందించే పత్రిక కాదు.
 8. టెలిఫోను డైరెక్టరీ కాదు: వ్యక్తుల గురించి వికీపీడియాలో రాయాలంటే వారికి అందుకు తగ్గ పేరుప్రఖ్యాతులు, గుర్తింపు ఉండాలి.
 9. వ్యాపార విశేషాలు తెలియజేసే డైరెక్టరీ కాదు: ఏదైనా టెలివిజను చానలు గురించిన వ్యాసం ఉందనుకోండి. ఆ చానల్లో ఏ సమయానికి ఏ కార్యక్రమం వస్తుందో జాబితా తయారు చేసి పెట్టరాదన్న మాట. ముఖ్యమైన కార్యక్రమాల గురించి రాయవచ్చు కానీ మొత్తం కార్యక్రమాల జాబితా ఇవ్వరాదు.

పిల్లల కోసం వికీపీడియాను సెన్సారు చెయ్యం

[మార్చు]

వికీపీడియాలో ఉండే కొన్ని వ్యాసాలు కొందరు పాఠకులకు అభ్యంతరకరంగా ఉండవచ్చు. ఇక్కడి వ్యాసాలను ఎవరైనా సరిదిద్దవచ్చు. ఆ దిద్దుబాట్లు వెంటనే వ్యాసంలో కనిపిస్తాయి. అందుచేత ఆయా వ్యాసాల్లో కనిపించే విషయాలు పిల్లలు చదివేందుకు అనుగుణంగా ఉంటాయని చెప్పలేం. అనుచితమైన విషయాలు దృష్టికి వెనువెంటనే తీసెయ్యడం జరుగుతుంది. అయితే శృంగారం, బూతు మొదలైనవి విజ్ఞాన సర్వస్వంలో భాగమే కాబట్టి, అలాంటి విషయాలపై వ్యాసాలు ఉండే అవకాశం లేకపోలేదు.

ఏది వికీపీడియా సముదాయం కాదు

[మార్చు]

వికిపీడీయా అరాచకం కాదు

[మార్చు]

వికిపీడీయాలో మార్పులు చేర్పులు చెయ్యడానికి అందరికి అవకాశం ఉంటుంది. కాని కొన్ని సందర్భాలలో మార్పులు చేయడాన్ని నియంత్రించవచ్చు లేదా నిరోధించవచ్చు. ఇది వివాదాస్పద అంశాలకు ప్రత్యేకంగా వర్తిస్తుంది. వికిపీడీయా ఒక స్వయంనియంత్రణ వ్యవస్థ. అయితే ఇది ఒక అంశం లేదా ఒక విషయం మీద సభ్యులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేసే చర్చావేదిక కాదు. వికిపీడీయాను అందరి సహాయంతో విజ్ఞాన సర్వస్వ భాండాగారం క్రింద తయారు చేసే ఉద్దేశంతో ప్రారంభించాం. చర్చావేదిక కోసమైతే ఇక్కడ చూడండి. వికీఫోర్క్ ను వాడండి. అరాచకపీడియా. ఇది కూడా చూడండి పవర్

వికీపీడియా ప్రజాస్వామ్యం కాదు

[మార్చు]

వికీపీడియా ప్రజాస్వామ్యంలో ప్రయోగం లాంటిదేమీ కాదు. ఇక్కడ విస్తృతాభిప్రాయం సాధించే పద్ధతి -చర్చేగానీ, వోటింగు కాదు. అంటే, అధిక సంఖ్యాకుల అభిప్రాయమే నియమం కావాలనేమీ లేదు. నిర్ణయం తీసుకోవడంలో వోటింగు ఒక అంగం మాత్రమే. వోటింగుతోపాటు జరిగే చర్చ, విస్తృతాభిప్రాయం సాధించడంలో కీలకం. ఉదాహరణకు, వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు పేజీలో జరిగే చర్చ.

వికీపీడియా అధికార యంత్రాంగం కాదు

[మార్చు]

విభేదాలు తలెత్తినపుడు, నియమాలు, పద్ధతులను పట్టుకుని వేళ్ళాడకుండా చర్చ ద్వారా పరిష్కరించుకోవాలి. ఏదైనా పని ఓ పద్ధతి ప్రకారం జరగనంత మాత్రాన, ఆ పనే సరైనది కాదనడం పద్ధతి కాదు. నియమ నిబంధనలు, విధానాలు, మార్గదర్శకాలు మొదలైన వాటి అంతరార్థాలను గ్రహించి ఆచరించాలే గానీ, వాటి ప్రత్యక్షర భావాన్నీ అనుసరించే ప్రయత్నం చెయ్యరాదు.

వికిపీడీయా యుద్ధభూమి కాదు

[మార్చు]

ప్రతీ సభ్యుడు తన సహసభ్యులతో సంయమనంతో వ్యవహరించాలి. మర్యాదగా, సంయమనంతో, సభ్యతతో వ్యవహరించాలి, సహకరించుకోవాలి. మిగతా సభ్యులతో ఏకీభవించని పక్షంలో సహసభ్యులపై వ్యక్తిగత దాడులు చెయ్యరాదు, దూషించరాదు, పరుషవ్యాఖ్యలు, వ్యక్తిగత నింద చేయరాదు లేదా రాయరాదు. ఏకీభవించని విషయాన్ని చాకచక్యంతో, ఋజువులతో నిరూపించాలి, చర్చించాలి. చర్చించిన విషయం మీద ఒక నిర్ణయానికి రావాలి. కేవలం మీ వాదనను నిరూపించేందుకు వ్యాసాలను సృష్టించడం, ఉన్న వ్యాసాలను మార్చడం వంటివి చెయ్యరాదు. వికీపీడియాపైనా, వికీపీడియనులపైనా, వికీమీడియా ఫౌండేషను పైనా చట్టపరమైన చర్యల బెదిరింపులు చెయ్యరాదు. బెదిరింపులను సహించం. బెదిరించిన సభ్యులు నిషేధానికి గురౌతారు. వికీపీడియా:వివాద పరిష్కారం కూడా చూడండి.

వికీపీడియా తప్పనిసరేమీ కాదు

[మార్చు]

వికీపీడియా స్వచ్ఛంద సేవకుల సముదాయం. వికీపీడియన్లు ఎంత సమయాన్ని కేటాయించాలని అనుకుంటారో అంతకంటే ఎక్కువ సమయాన్ని కేటాయించాల్సిన అవసరం లేదు. ఆరోగ్యం సహకరించినంత మేరకు మాత్రమే పనిచెయ్యండి. వికీపీడియా నుండి విరామం తీసుకునేందుకు, శాశ్వతంగా వదిలేసేందుకూ వాడుకరులకు స్వేచ్ఛ ఉంది. ఇతర వికీపీడియన్ల దగ్గర అతిగా డిమాండు చెయ్యకుండా, వికీపీడియాను అభివృద్ధి చెయ్యడంపై శ్రద్ధ పెట్టండి.

చివరగా

[మార్చు]

ఇక్కడ చేర్చిన అంశాలకు పరిమితి ఏమీ లేదు. గతంలో వివిధ వాడుకరులు వెలుగులోకి తెచ్చిన అనేక తప్పుడు పనులను గమనించి వాటిని ఈ పేజీలో చేర్చాం. భవిష్యత్తులో వచ్చే కొత్తకొత్త తప్పుడు పనులను ఈ జాబితాలో చేరుస్తూ ఉంటాం.

ఏం చెయ్యాలో అర్థం కానపుడు

[మార్చు]
 • "ఫలానా" వ్యాసంలో ఏమేం ఉండాలో నిర్ణయించుకోలేని పరిస్థితిలో ఉంటే, ముందు ఆ "ఫలానా" వ్యాసంలో ఏమి ఉండాలని పాఠకుడు కోరుకుంటారో మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి.
 • ఆ వ్యాసంలో ఈ పేజీలో పేర్కొన్న నియమాలను ఉల్లంఘించినట్లు మీరు గమనిస్తే, ఇలా చెయ్యవచ్చు:
  • వ్యాసంలో తగు దిద్దుబాట్లు చెయ్యడం (మామూలు దిద్దుబాటు)
  • పేజీ చరితాన్ని భద్రపరుస్తూ, పేజీని దారిమార్పుగా మార్చడం
  • పేజీ తొలగింపు విధానానికి అనుగుణంగా ఉంటే ఆ పేజీని తొలగించేందుకు ప్రతిపాదించడం.
  • ఇతర సభ్యులతో చర్చించి, ఒక విస్తృతాభిప్రాయానికి వచ్చాక, ఈ పేజీలోని నియమ, నిబంధనలను మార్చడం.


ఇవి కూడా చూడండి

[మార్చు]