Jump to content

వికీపీడియా:సంరక్షణ విధానం

వికీపీడియా నుండి
(వికీపీడియా:Protection policy నుండి దారిమార్పు చెందింది)
Gold padlock Fully-protected
Goldlock
Brown padlock Interface protected
Redlock
Pink padlock Template-protected
Pinklock
Silver padlock Semi-protected
Silverlock
Blue padlock Create protected
Skybluelock
Green padlock Move protected
Greenlock
Purple padlock Upload protected
Purplelock
White padlock Pending changes protected
Whitelock
Dark blue padlock Extended confirmed protected
Bluelock
Black padlock Protected by Office
Blacklock
Turquoise padlock Cascade protected
Turquoiselock

కొన్ని సందర్భాల్లో పేజీలలో మార్పులు జరగకుండా సంరక్షించాల్సి ఉంటుంది. వికీపీడియా సూత్రమేమిటంటే ఎవరైనా ఏ విషయం గురించైనా మార్పులూ, చేర్పులూ చేసే అవకాశాన్ని కల్పించడం. దానికనుగుణంగా వీలైనన్ని పేజీలను వాడుకరులందరికీ దిద్దుబాట్లు చేసే అవకాశాన్నివ్వడం వికీ లక్ష్యం. ఐతే కొన్నిసార్లు పేజీలు చెడగొట్టబడుతూ ఉండి, నిరోధం వంటి చర్యలతో కూడా వాటిని సంతృప్తికరంగా నిర్వహించడం కుదరకుంటే, వాటిని సంరక్షించవలసి ఉంటుంది. ఈ విధాన వ్యాసంలో వివిధ సంరక్షణా స్థాయులూ, పద్ధతులూ, ఎప్పుడు సంరక్షించాలనే విషయాలూ వివరించడమైనది.

పేజీలో దిద్దుబాట్లు చెయ్యకుండా, బొమ్మలను మార్చకుండా, లేదా తరలించకుండా సంరక్షించే అధికారం నిర్వాహకులకు ఉంది. ఈ అధికారాలను పరిమితంగా వాడాలి; ఎందుకంటే సంరక్షిత పేజీలు హానికారకము కనుక.

సంరక్షణ సంబంధిత పరిమితులను శాశ్వతంగా అమలుచేయవచ్చు లేదా పరిమిత కాలం పాటు అమలు చేయవచ్చు. ఒక పేజీ సంరక్షించబడుతున్నప్పటికీ, దాని సోర్సు కోడ్‌ను ఎవరైనా చూడొచ్చూ, వాడుకోవచ్చూ.

సంరక్షించబడ్డ పేజీ పైన కుడి పక్కన ఒక చిన్న తాళంకప్ప కనిపిస్తుంది. దీన్ని {{pp-protected}} మూస వాడి చేర్చవచ్చు.

నిర్వాహకులు కానివారు సంరక్షిత పేజీలలో మార్పులు చెయ్యదలిస్తే, ఆ మార్పులను సంబంధిత చర్చ పేజీలో ప్రతిపాదించాలి.

ఉపయోగాలు

[మార్చు]

సెమి-శాశ్వత సంరక్షణ ను కింది సందర్భాలలో వాడతాము:

  • మొదటి పేజీ వంటి ఎక్కువగా చూసే పేజీలను దుశ్చర్యల నుండి కాపాడటం.
  • సైటు లోగోను కాపాడటం.
  • కీలకమైన కాపీహక్కు, లైసెన్సు పేజీలను కాపాడటం.
  • పత్రికా ప్రకటనలను కాపాడటం.
  • "system administration" పేజీలను కాపాడటం.
  • ఎక్కువగ ఉపయోగంలో ఉండే మీడియావికీ నేంస్పేసు లోని టెక్స్టును కాపాడటం.
  • దుశ్చర్యలకు గురవుతూ ఉండే సభ్యుల పేజీలు, ఉప పేజీలను కాపాడటం.

తాత్కాలిక సంరక్షణ కింది వాటికి వాడతాము:

  • దిద్దుబాట్ల యుద్ధాలలో శాంతి నెలకొల్పటానికి-అభ్యర్ధన మీదట.
  • పదే పదే దుశ్చర్యకు గురవుతున్న పేజీ కానీ, బొమ్మను గానీ కాపాడటం.
  • MediaWiki సాఫ్ట్‌వేరులోని లోపాన్ని సరిచేసే సమయంలో ఒక పేజీలో మార్పులను నివారించడానికి.


పేజీ ఫలానా కూర్పు వద్ద సంరక్షించబడితే దానర్ధం - ఆ ఫలానా కూర్పుకు మా మద్దతు ఉన్నదని అర్ధం కాదు. కాబట్టి, సంరక్షణ వేరే కూర్పు వద్ద చెయ్యమని అడగవద్దు. చర్చా పేజీలు, సభ్యుని చర్చా పేజీలు మరీ తీవ్రమైన పరిస్థితులలో తప్ప సంరక్షించబడవు.


ఏదైనా పేజీ మొదటి పేజీ నుండి ఉన్న లింకు వలన గానీ, వేరే ఇతర కారణాల వలన గానీ బాగా వెలుగులో ఉంటే, సాధారణంగా అది దుశ్చర్యలకు గురవుతుంది. అటువంటపుడు దానిని సంరక్షించే బదులు, మీ వీక్షణ జాబితాకు చేర్చి, ఎప్పటికప్పుడు దుశ్చర్యలను పునస్థాపించండి.

  1. తాత్కాలికంగా సంరక్షించబడిన పేజీలో దిద్దుబాట్లు చెయ్యవద్దు, - సంరక్షించబడింది అనే నోటీసు పెట్టడానికో, సంబంస్ధిత విధానాల్కు లింకు ఇవ్వడానికో అయితే తప్ప.
  2. మీరు స్వయంగా ఏదైనా వివాదంలో భాగమయినప్పుడు, సదరు పేజీని సంరక్షించవద్దు.
  3. {{సంరక్షణ}} (లేదా దుశ్చర్యకు వ్యతిరేకంగా నయితే {{దుశ్చర్యసంరక్షణ}}) అనే మూసను పేజీ పై భాగాన పెట్టి, ఈ విషయాన్ని దిద్దుబాటు సారాంశంలో రాయండి.
  4. మీరు సంరక్షించిన పేజీని వికీపీడియా:సంరక్షిత పేజీ లో చేర్చండి.
  5. వివాదంలో ఇరుక్కున్న వివిధ పక్షాల మధ్య పరిష్కారాన్ని ప్రోత్సహించండి.
  6. సంరక్షణ నుండి తొలగించిన పేజీ పైనున్న {{సంరక్షణ}} టాగును తీసేసి ఆ విషయాన్ని దిద్దుబాటు సారాంశంలో రాయండి.

నిర్వాహకులు తాము సంబంధం కలిగి ఉన్న పేజీలను (పేజీలో దిద్దుబాట్లు - మరీఓ చిన్నవి కాకుండా- చేసినా, చర్చా పేజీలో మీ అభిప్రాయాలు రాసినా సంబంధం కలిగి ఉన్నట్లే ) సంరక్షించ రాదు. నిర్వాహకత్వం ఒక ప్రత్యేక హోదాగా కాక, నిర్వాహక విషయాలలో సభ్యులకు సేవకుడుగా భావించాలి. మీరు మీకు సంబంధం ఉన్న పేజీని సంరక్షించాలని భావిస్తే, మరో నిర్వాహకుడి సహాయం తీసుకోండి.


నిర్వాహకులు ఏదో ఒక పక్షపు అభిప్రాయాలకు అనుకూలంగా ఉండరాదు. దుశ్చర్యకు సంబంధించిన వివాదంలో దుశ్చర్యకు వ్యతిరేకంగా రెండో పక్షపు వాదనను బలపరచవచ్చు. అటువంటి వివాదాల్లో నిర్వాహకుడు దుశ్చర్యకు ముందటి కూర్పును సంరక్షించవచ్చు.

తాత్కాలికంగా సంరక్షించిన పేజీలను మరీ ఎక్కువ కాలం సంరక్షణలో ఉంచరాదు. మరియు వాటి చర్చా పేజీలను దిద్దుబట్లకు అనుమతించాలి. css, js వంటి పేజీలను సంరక్షించనవసరం లేదు.

సంరక్షిత పేజీలలో దిద్దుబాట్లు చెయ్యడం

[మార్చు]

సంరక్షిత పేజీలో మార్పులు చెయ్యకూడదనే విధానం సెమి-సంరక్షిత పేజీకి సంబంధించిన విధానం వంటిది కాదు. ఈ పేజీల విషయంలో నిర్వాహకులు సంబంధిత పేజీ విషయానికి సంబంధించిన మార్గదర్శకాలను, ఆ విషయంపై ఏకాభిప్రాయాన్నీ పాటిస్తూ దిద్దుబాట్లు చెయ్యాలి. మీరు చెయ్యదలచిన దిద్దుబాటు ముఖ్యమైనది అయ్యీ, అలా చెయ్యడం వివాదాస్పదం అయ్యేలా ఉంటే, ముందు దాన్ని చర్చా పేజీలో లేవనెత్తి చర్చించడం మంచిది.


తాత్కాలిక సంరక్షణ విషయంలో నిర్వాహకులు దిద్దుబాట్లు చెయ్యరాదు. అయితే కింది సందర్భాలలో నిర్వాహకులు దిద్దుబాటు నిర్ణయం తీసుకోవచ్చు:

  • వివాదాలకు సంబంధించిన విధానపరమైన పేజీలకు లింకు ఇవ్వడానికి
  • వివాదం మొదలు కాక ముందున్న కూర్పుకు పేజీని తీసుకువెళ్ళడానికి

సంరక్షిత పేజీల జాబితా

[మార్చు]

మీరేదైనా పేజీని సంరక్షించినా, లేక ఏదైన సంరక్షించబడిన పేజీ రక్షిత పేజీల జాబితాలో లేనట్లు గమనించినా, సదరు పేజీని జాబితా లో చేర్చండి. ఎందుకు సంరక్షించారో ఒక చిన్న వివరణను — 10 పదాలకు మించకుండా — చేర్చండి. దాని గురించి ఇంకా చెప్పాలనుకుంటే, ఆ పేజీ యొక్క చర్చా పేజీ లో రాయండి.

ఇంకా చూడండి

[మార్చు]