కూత: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
[[Image:Solsort.jpg|thumb|right|350px|A male [[Common Blackbird|Blackbird]] (''Turdus merula'') singing. Bogense havn, Funen, Denmark. {{audio|Turdus merula male song at dawn(20s).ogg|Blackbird song recorded at Lille, France}}]]
[[Image:Solsort.jpg|thumb|right|350px|A male [[Common Blackbird|Blackbird]] (''Turdus merula'') singing. Bogense havn, Funen, Denmark. {{audio|Turdus merula male song at dawn(20s).ogg|Blackbird song recorded at Lille, France}}]]
[[File:Kutha-Te.ogg]]
కూతను అరుపు, కేక అని కూడా అంటారు. అయితే సందర్భాని బట్టి ఈ పదాలను ఉపయోగిస్తారు. ఇతర వాటిని ఆకర్షించడానికి లేదా వికర్షించడానికి నోటి నుంచి విడుదల చేసే ధ్వనిని కూత అంటారు.
కూతను అరుపు, కేక అని కూడా అంటారు. అయితే సందర్భాని బట్టి ఈ పదాలను ఉపయోగిస్తారు. ఇతర వాటిని ఆకర్షించడానికి లేదా వికర్షించడానికి నోటి నుంచి విడుదల చేసే ధ్వనిని కూత అంటారు.



17:09, 4 ఆగస్టు 2013 నాటి కూర్పు

A male Blackbird (Turdus merula) singing. Bogense havn, Funen, Denmark. audio speaker iconBlackbird song recorded at Lille, France 

కూతను అరుపు, కేక అని కూడా అంటారు. అయితే సందర్భాని బట్టి ఈ పదాలను ఉపయోగిస్తారు. ఇతర వాటిని ఆకర్షించడానికి లేదా వికర్షించడానికి నోటి నుంచి విడుదల చేసే ధ్వనిని కూత అంటారు.

ఈ పదాల యొక్క అర్ధం ఒకటే అయినప్పటికి ముఖ్యంగా పక్షులకు కూత అనే పదాన్ని, జంతువులకు అరుపు అనే పదాన్ని మనుషులకు కేక అనే పదాన్ని ఉపయోగిస్తారు.

పక్షుల కూత

పక్షులు సంతానోత్పతి కోసం జంట పక్షిని ఆకర్షించడానికి, పక్షి తన పిల్లలకు దగ్గ్గరగా ఉన్నానని తెలియజేయుటకు, ఇతర వాటి నుంచి రక్షించుకోవడానికి కూత కూస్తుంది.

ప్రతి రోజు కోడి తెల్లవారుజామున తెల్లారింది లెగండోయ్ కొక్కొరోక్కో అని కూత పెట్టి ప్రపంచాన్ని మేల్కొలుపుతుంది.

శారీరకంగా బాగా ఎదిగిన పక్షులను పిట్ట కూత కోచ్చిందిరోయ్ అంటుంటారు.

జంతువుల అరుపు

పెంపుడు జంతువులు మేత కోసం, నీళ్ళ కోసం, అడవి జంతువులు ఇతర వాటిని భయపెట్టడం కోసం తన ఆధిపత్యాన్ని నిరూపించుకోవడం కోసం అరుస్తుంటాయి.


మనుషుల కేక

మనుషులు ఇతరుల దృష్టిలో పడడానికి ఇతరులను పిలవడానికి బాధను దిగమింగుకోవడానికి ఇతరులను అరచి భయపెట్టడానికి కేక వేస్తారు.

సాంస్కృతిక కార్యక్రమాలలో, కొత్త సినిమా విడుదల సందర్భాలలో, వివిధ సమావేశాలలో పర్యాటక ప్రదేశాలలో మరియు ఆటలు ఆడేటప్పుడు తమ ఆనందాన్ని వెల్లిబుచ్చడానికి కేకలు వేస్తారు.

ఈ కేకలు మరింత ఎక్కువగా ఉంటే వాటిని కెవ్వుకేకలు అంటారు.

వాహనాల కూత

వివిధ వాహనాల యొక్క రాకను తెలియజేయడానికి ఆ వాహనాలకు హారన్ బిగిస్తారు. ఈ హారన్ నుంచి వచ్చే కూత వలన ఆ వాహనంలో ప్రయాణించాలనుకున్న ప్రయాణికులు గమనించి ఆ వాహానాలలో ఎక్కి ప్రయాణిస్తారు.

ప్రమాదాలు జరగకుండా వాహనములకు అడ్డుగా ఉన్న వారిని ప్రక్కకు తొలగండి అని హెచ్చరించేందుకు ఈ వాహనముల హారన్ కూత ఉపకరిస్తుంది.

మావి చిగురు తినగానే కోయిల కూసేనా

మావి చిగురు తినగానే కోయిల కూస్తుందా, లేక కోయిల గొంతు వినగానే మావి చిగురు తొడుగుతుందా అనే సందేహాలు రావడం సహజమే.

ఎందుకంటే కోయిల గొంతు వినగానే వసంతకాలం వచ్చిందని తెలుస్తుంది. కానీ కోయిల మాత్రం వసంతం కోసం కూయదు.

ఈ కాలంలో కూయడం దాని అవసరం. కారణం దాని సంతానోత్పత్తికి అనువైన కాలం ఇదే. మనం వినే కుహుకుహూలు మగ కోయిల కూతలు.

ఆడ కోయిలను ఆకర్షించడానికి ఇలా కూస్తాయి. ఆడ కోయిల ఇంత మధురంగా కూయలేదు. వాటి ఆకారాల్లో కూడా తేడాలుంటాయి.

మగ కోయిల నల్లగా ఉంటే, ఆడ కోయిల బూడిద రంగులో తెల్ల మచ్చలతో ఉంటుంది.

ఆడ కోయిలలు తమ గుడ్లను తాము పొదగలేవు. అందుకని అవి ఆ గుడ్లను కాకుల గూళ్లలో పెట్టి దూరంగా అడవుల్లోకి ఎగిరిపోతాయి. కాకులే ఆ గుడ్లను పొదుగుతాయి.

కాకులు సాధారణంగా మనుషులు నివసించే ప్రాంతాలకు దగ్గరగా గూళ్లు కట్టుకుంటాయి.

కోయిల వసంత కాలంలో జనవాసాల్లోకి వచ్చి చెట్ల గుబురుల్లో కూర్చుని పాటలు పాడడం మొదలు పెడతాయి.

ఈ సమయాల్లో కోయిల కూతను పిల్లలు అనుకరిస్తే అవి మరో మగ కోయిల పోటీ కూతలుగా భావించి రెట్టిస్తాయి.

ఆడ కోయిల ఆ పాటకు ఆకర్షితురాలై జత కట్టాక గుడ్లను కాకుల గూళ్లలో పెట్టి వెళ్లిపోతాయి. ఈ కాలంలో తప్ప మిగతా సమయాల్లో అవి కూయవు.

పైగా దూరంగా అడవి ప్రాంతాల్లోకి పోతాయి. అందువల్ల వసంత కాలంలోనే మనం కోయిలల గొంతును వినగలుగుతాం.

సామెతలు

కూసే గాడిద మేసే గాడిదను చెడగొట్టినట్టు

ఇవి కూడా చూడండి

సప్తస్వరాలు

"https://te.wikipedia.org/w/index.php?title=కూత&oldid=893827" నుండి వెలికితీశారు