Coordinates: 18°43′53″N 79°59′01″E / 18.73139°N 79.98361°E / 18.73139; 79.98361

కాళేశ్వర ముక్తేశ్వర దేవాలయం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కాళేశ్వర ముక్తేశ్వర దేవాలయం
కాళేశ్వర ముక్తేశ్వర దేవాలయం
కాళేశ్వర ముక్తేశ్వర దేవాలయం is located in Telangana
కాళేశ్వర ముక్తేశ్వర దేవాలయం
కాళేశ్వర ముక్తేశ్వర దేవాలయం
తెలంగాణ లోని ప్రదేశం
భౌగోళికాంశాలు:18°43′53″N 79°59′01″E / 18.73139°N 79.98361°E / 18.73139; 79.98361
స్థానం
దేశం:భారతదేశం
రాష్ట్రం:తెలంగాణ
జిల్లా:జయశంకర్ భూపాలపల్లి జిల్లా
ప్రదేశం:మహదేవపూర్
నిర్మాణశైలి, సంస్కృతి
ప్రధానదైవం:శివుడు
నిర్మాణ శైలి:ద్రవీడులు
వెబ్‌సైటు:కాళేశ్వర ముక్తేశ్వర దేవాలయం జాలగూడు

కాళేశ్వర ముక్తేశ్వర దేవాలయం తెలంగాణ రాష్ట్రం, జయశంకర్ భూపాలపల్లి జిల్లా, మహదేవ్ పూర్ మండలం కాళేశ్వరం గ్రామంలో వెలసిన ఆలయం.[1][2] దట్టమైన అడవి మధ్యలో, చుట్టూ రమ్యమైన ప్రకృతి రమణీయతల మధ్యన, పవిత్ర గోదావరి నది ఒడ్డున వెలసిన ఈ క్షేత్రం చాలా ప్రాచీనమైనది. శివుడు, యముడి దేవాలయాలు ఇక్కడి ప్రత్యేకత.[3] ఇక్కడ గోదావరి, దాని ఉపనది అయిన ప్రాణహిత నదులతో పాటు అంతర్వాహినిగా సరస్వతీ నది ప్రవహించడం వలన త్రివేణి సంగమ తీరమైన దక్షిణకాశీగా ప్రసిద్ధిచెంది, శ్రీశైల, ద్రాక్షారామ, కాళేశ్వరం అనే త్రిలింగక్షేత్రాలలో ఒకటిగా ఈ క్షేత్రం ప్రసిద్ధిగాంచింది.[4]

సాధారణంగా గర్భగుడి లో ఎన్ని శివలింగాలు ఉంటాయి. ఒక్కటే కదా !! కానీ కాళేశ్వర ఆలయంలో రెండు శివలింగాలు గర్భగుడిలో పూజలందుకుంటాయి. అందులో ఒకటేమో ముక్తేశ్వరునిది (శివుడు), మరొకటేమో కాళేశ్వరునిది (యముడు). ఇటువంటి ప్రత్యేకత కలిగిన ఆలయం బహుశా ఇండియాలో ఎక్కడా కనిపించదేమో.

స్థల పురాణం - విశిష్టత[మార్చు]

గర్భగుడిలో రెండు శివలింగాలు ఉండటం ఈ దేవాలయ ప్రత్యేకత. ఈ ఆలయాన్ని దర్శించిన భక్తులందరికీ ముక్తేశ్వరస్వామి ముక్తిని ఇస్తుండడంతో యముడికి పనిలేకుండా పోయిందట. అప్పుడు యమధర్మరాజు స్వామిని వేడుకోగా, యమున్ని కూడా తన పక్కనే లింగాకారంలో నిల్చోమన్నాడట. ముక్తేశ్వరున్ని చూచి యమున్ని దర్శించకుండా వెళితే మోక్షప్రాప్తి దొరకదని వాళ్ళని నరకానికి తీసుకుపోవచ్చని శివుడు చెప్పాడట. అందుకే భక్తులు స్వామిని దర్శించుకొని, కాళేశ్వర స్వామిని కూడా దర్శించుకుంటారు.

ముక్తేశ్వరస్వామి లింగంలో మరో ప్రత్యేకత కూడా ఉంది. లింగంలో రెండు రంధ్రాలు ఉన్నాయి. ఈ రంధ్రంలో నీరు పోసి అభిషేకిస్తే ఆ నీరు అక్కడికి సమీపంలో ఉన్న గోదావరి, ప్రాణహిత సంగమ స్థలంలో కలుస్తుందని భక్తుల నమ్మకం.[5][6]

ఉత్సవాలు[మార్చు]

శివరాత్రి[మార్చు]

మహాశివరాత్రి సందర్భంగా ఉదయం 5 గంటలకు మహాన్యాస రుద్రాభిషేకం జరుగుతుంది. సాయంత్రం 4.16 గంటలకు ముక్తీశ్వర, శుభానందదేవి కల్యాణోత్సవం, రాత్రి 12 గంటలకు గర్భగుడిలోని ద్విలింగాలకు మహాభిషేకం, లింగోద్భవ పూజ, చండీ హవనం, కాళరాత్రి హవనం నిర్వహిస్తారు. మసుసటిరోజు ఉదయం 5 గంటలకు మహాన్యాస రుద్రాభిషేకం, 11.30కి యాగశాలలో పూర్ణాహుతి, సదస్యము, మహదాశ్వీరాదం, పండిత సన్మానం, సాయంకాలం 4 గంటలకు కల్యాణోత్సవం, రాత్రి 8 గంటలకు నాకబలి, పవళింపు సేవతో శివరాత్రి ప్రత్యేక పూజలు ముగుస్తాయి.[7]

ప్రయాణ వివరాలు[మార్చు]

  • రైలు మార్గం: కాళేశ్వరంలో రైల్వే స్టేషన్ లేదుకనుక సమీప రైల్వే స్టేషనైన రామగుండం (98 కిలోమీటర్లు) లో దిగి ఆర్టీసీ బస్సులో ప్రయాణించి కాళేశ్వరం చేరుకోవచ్చు. రాముగుండం నుండి కాళేశ్వరానికి అధిక సంఖ్యలో బస్సులు అందుబాటులో ఉంటాయి. వరంగల్, కాజీపేట్ రైల్వే స్టేషన్ లు 110 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి.
  • బస్సు మార్గం: తెలంగాణ ఆర్టీసీ హైదరాబాద్ నుండి కాళేశ్వరంకి నేరుగా బస్సులను నడుపుతుంది. మహాత్మా గాంధీ బస్ స్టేషన్ లేదా జూబ్లీ బస్టాండ్ నుండి ఈ బస్సులు ప్రతి రోజు అందుబాటులో ఉంటాయి. ఎక్కువగా ఎక్స్‌ప్రెస్ సర్వీసులను ఆర్టీసీ నడుపుతుంది. ప్రయాణ సమయం 4 - 5 గంటలు పట్టవచ్చు.
  • కారు మార్గం లేదా బైక్ మార్గం: హైదరాబాద్ - సిద్దిపేట - పెద్దపల్లి - కాళేశ్వరం ( 300 కిలోమీటర్లు, 5 గంటల సమయం), హైదరాబాద్ - బొంగిర్ - వరంగల్ - పర్కాల్ - కాళేశ్వరం ( 260 కిలోమీటర్లు, 4 గంటల 15 నిమిషాలు)

అభివృద్ధి[మార్చు]

కాళేశ్వర దేవాలయ అభివృద్ధికి రూ.100కోట్లు కేటాయించి, ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు 600 ఎకరాల స్థలాన్ని సేకరించాలని, ఇందుకోసం ప్రభుత్వ, ప్రైవేట్, ఫారెస్ట్ స్థలాలను సేకరించాలని, కళ్యాణ మండపంతోపాటు పెద్ద స్వాములు ఎవరైనా వచ్చినప్పుడు ప్రవచనాలు చెప్పడానికి వీలుగా ఆలయ నిర్మాణాన్ని విస్తరించనున్నారు.[8]

ప్రాణహిత పుష్కరాలు - 2022[మార్చు]

ప్రాణహిత పుష్కరాలు 2022 ఏప్రిల్ 13 నుంచి 24వ తేదీ వరకు జరుగనున్నాయి. ప్రాణహిత నది తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దుగా ప్రవహిస్తుంది. కాళేశ్వరం దేవస్థానం వేదికగా పుణ్యస్నానాలు, పుష్కర విధులు ఆచరించడానికి భక్తులకు తగు ఏర్పాట్లుచేయబడ్డాయి.[9]

ఇవీ చదవండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "Governor Narasimhan to inspect Kaleshwaram project works". www.telanganatoday.com. 19 January 2018. Archived from the original on 20 January 2018. Retrieved 17 February 2018.
  2. "All set for development of Kaleshwaram temple". The Hans India. Retrieved 17 February 2018.
  3. నమస్తే తెలంగాణ, నిపుణ (18 August 2015). "తెలంగాణ పర్యాటక రంగం-విశేషాలు". Retrieved 17 February 2018.
  4. "Kaleshwaram temple to get a makeover". The Hans India. Retrieved 17 February 2018.
  5. తెలుగు నేటీవ్ ప్లానెట్, ట్రావెల్ గైడ్. "శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయ మహత్యం". telugu.nativeplanet.com. Mohammad Shaffee. Archived from the original on 15 December 2016. Retrieved 17 February 2018.
  6. మన టెంపుల్స్.నెట్. "కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయం -కాళేశ్వరం". manatemples.net. Archived from the original on 2018-01-01. Retrieved 2018-02-17.
  7. ఈనాడు, రాజన్న సిరిసిల్ల జిల్లా (4 March 2019). "కాళేశ్వరం.. మహిమాన్వితం". Archived from the original on 4 March 2019. Retrieved 7 March 2019.
  8. నమస్తే తెలంగాణ, బతుకమ్మ (ఆదివారం సంచిక) (2 June 2019). "మన తెలంగాణ ఘన తెలంగాణ". Archived from the original on 2 June 2019. Retrieved 15 June 2019.
  9. "పుష్కరాలకు ముమ్మర ఏర్పాట్లు". EENADU. Retrieved 2022-04-12.

బయటి లంకెలు[మార్చు]