రోవర్ (అంతరిక్ష అన్వేషణ)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సోజర్నర్, మెర్, క్యూరియాసిటీ సహా మూడు వేర్వేరు అంగారక గ్రహ రోవర్ నమూనాలు.
అపోలో 15 చంద్ర రోవర్


రోవర్ అనగా ఒక అంతరిక్ష అన్వేషణ వాహనం, ఇది గ్రహం యొక్క ఉపరితలంపై లేదా ఇతర ఖగోళ గ్రహాంపై తరలించేందుకు రూపొందించబడిన వాహనం. దీనిని కొన్నిసార్లు గ్రహ రోవర్ అని కూడా అంటారు. కొన్ని రోవర్లు మానవ అంతరిక్ష సిబ్బంది యొక్క ప్రయాణం కొరకు రూపొందిస్తున్నారు; ఇతరత్రా రోవర్లు పాక్షికంగా లేదా పూర్తి స్వతంత్రంగా నడిచే రోబోట్లు కలిగినవి. సాధారణంగా రోవర్లను లాండర్ తరహా వ్యోమనౌక ద్వారా గ్రహ ఉపరితలానికి చేరుస్తారు. రోవర్లు విద్యుత్ వాహనాలు, వీటిని నడిపేందుకు సౌర శక్తి లేదా అణు విద్యుత్ ఉపయోగిస్తారు. వివిధ దూరాలలో ఉన్న భూమి యొక్క చంద్రుడు, అంగారక గ్రహం వంటి ఉపరితలములపై వివిధ చక్రాల వాహన రోవర్లను నడుపుతారు.